కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి..బండి సంజయ్..ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!

Submitted on 26 May 2019
Kishan Reddy And Bandi Sanjay Central Cabinet

భారత ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫైనల్ చేశారు. మే 30వ తేదీ రాత్రి 7గంటలకు ప్రమాణం జరుగనుంది. మోడీతో పాటు 20 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. కొద్ది రోజుల కిందట రాష్ట్రపతిని..మోడీ కలిసిన సంగతి తెలిసిందే. బీజేపీ పక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని..ఎన్డీయేలోని పార్టీలు మద్దతు ఇస్తున్నాయని..రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి అందచేశారు మోడీ. ప్రమాణ స్వీకారం చేపట్టనున్న తేదీ, సమయం, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారి పేర్లను ఇవ్వాలని రాష్ట్రపతి సూచించారు. 

దీంతో మే 26వ తేదీ ప్రమాణ స్వీకారం చేసే సమయం, తేదీ అధికారికంగా ప్రకటించారు. మే 30వ తేదీ రాత్రి 7గంటలకు మోడీ ప్రమాణం చేస్తారు. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుండి ఇద్దరికి ఛాన్స్ ఉందని టాక్. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్ సభ  ఎన్నికల్లో నలుగురు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లలో ఒకరికి ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మొదటి విడతలో ఒకరికి..మరో విడతలో మరొకరిని కేబినెట్‌లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ఆరోగ్యం సరిగ్గా లేనందు వల్లే అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ మంత్రిత్వ శాఖల నుండి తప్పించే అవకాశం ఉంది. గతంలో ఉన్న మంత్రులుగా కొనసాగిన వారిని అవే శాఖలో కొనసాగిస్తారా ? లేదా ? అనేది చూడాలి. 2014లో మే 26వ తేదీన ప్రధానిగా మోడీ ప్రమాణం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

Kishan Reddy
bandi sanjay
Central Cabinet
May 30
Modi To Take Oath

మరిన్ని వార్తలు