ప్రజా వేదిక కూల్చివేతపై గంటా..కోడెల స్పందన

Submitted on 26 June 2019
Kodela Shiva Prasad And Ganta Srinivasa Rao Respond Praja Vedika demolition

ప్రజా వేదిక కూల్చివేతలపై టీడీపీ లీడర్స్ సీరియస్ అవుతున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన బాబు ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. 2019, జూన్ 26వ తేదీ బుధవారం నాడు జరిగిన ఈ మీటింగ్‌కు అందుబాటులో ఉన్న టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపై బాబు ఆరా తీశారు. ప్రధానంగా ప్రజా వేదిక కూల్చివేతపై హాట్ హాట్ చర్చలు జరిగాయి. మీటింగ్ ముగిసిన అనంతరం టీడీపీ నేతలు కోడెల, గంటా శ్రీనివాసరావు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాధాన్యత అంశాలునా...ప్రజా వేదిక కూల్చివేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని కోడెల వెల్లడించారు. కొత్త రాజధానిలో అనేక భవంతులు కావాలి..ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తే ప్రతిపక్షంగా తాము ప్రశ్నిస్తామన్నారు. బాబు అద్దె ఇంటిలో ఉంటున్నారు..అక్రమం అని అంటే..అద్దెకిచ్చిన వారు చూసుకుంటారని కోడెల పేర్కొన్నారు. 

గవర్నమెంట్ డబ్బుతో కట్టిన భవంతి అక్రమమంటూ..టెక్నికల్ రీజన్స్ చూపించి అర్ధరాత్రి కూల్చివేయడంపై తప్పని సమావేశంలో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై 2019, 27వ తేదీ గురువారం డీజీపీకి మెమోరాండం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు గంటా తెలిపారు. 

వారం రోజులుగా లండన్‌లో తన కుటుంబంతో విహార యాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు జూన్ 25 మంగళవారం ఉదయం హైదరాబాద్ కి చేరుకున్నారు. అదే రోజు రాత్రి అమరావతికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వందల సంఖ్యలో వచ్చిన నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చిస్తున్నారు.

Kodela Shiva Prasad
Ganta Srinivasa Rao
respond
Praja Vedika demolition

మరిన్ని వార్తలు