కొడంగల్ ఉద్రిక్తత : లాఠీలు పట్టుకొచ్చి మద్యం పంచుతున్నరంటు ఘర్షణ..

12:49 - December 7, 2018

కొడంగల్ (మహబూబ్ నగర్) : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎన్నికల సంఘం డేగకళ్లతో పర్యవేక్షిస్తోంది. అయినాసరే కొడంగల్ నియోజకవర్గంలో డిసెంబర్ 6 తేదీ రాత్రి సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఘటన జరిగింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు పంచుతున్నారంటూ టీఆర్ఎస్,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుని చిలికి చిలికి గాలివానగా మారి స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో కొన్ని చోట్ల వాహనాల అద్దాలను సైతం ధ్వంసం చేశారు ఆందోళనకారులు.
టీఆర్ఎస్ నేతలు లాఠీలు, మద్యం సీసాలను వాహనాల్లో తరలిస్తుండగా ప్రజాకూటమి కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోస్గి సమీపంలోని బాహర్‌ పేట కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో లాఠీలు, మద్యం ఉన్నాయంటూ కాంగ్రెస్ నాయకులు వాటిని అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, పోలీసులు ఆ వాహనాలను తనిఖీ చేయగా లాఠీలు బయటడ్డాయి. అన్ని వాహనాలను తనిఖీ చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో పాటు, ఇతర నాయకులు పట్టుబట్టారు. రెండు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగగా ఎస్పీ ఇరు వర్గాలను శాంతింప జేశారు. కర్రలు లభ్యమైన వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు. 
 

Don't Miss