గిరిజనుల ఊచకోత: ఆటవికంగా 16మందిని చంపేశారు

Submitted on 10 July 2019
 At least 15 women and children killed in tribal massacre

ప్రపంచవ్యాప్తంగా అసమానతలు తగ్గిపోవాలి అంటూ అనేకమంది ఉద్యమాలు చేస్తుంటే.. ప్రాచీన యుగంలో కూడా ఇంకా కొందరు ఆటవికంగా ఏమాత్రం జాలి లేకుండా గిరిజనులను చంపేసిన ఘటన పాపువా న్యూ గునియా దేశంలో చోటు చేసుకుంది. చిన్నారులు, మహిళలు అనే తేడా లేకుండా గర్భిణీలను సైతం ఊచకోత కోశారు కొంతమంది నర రూపంలో ఉండే రాక్షసులు.

హెలా ప్రావిన్స్‌లోని కొండ ప్రాంతాల్లోనే ఉండే గిరిజనల తెగల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ అంతర్యుద్దం.. ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. హత్యల వరకు వెళ్లింది. ఓ తెగ ప్రజలు.. మరో తెగపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. మహిళలు, చిన్నారులు అని చూడకుండా కనపడ్డవారిని కనపడినట్లు ఊచకోత కోశారు. టారీ-పొరి జిల్లాలోని చిన్న గ్రామాల్లో ఈ క్రూరమైన  ఘటన చోటు చేసుకుంది.

ఆదివారం(7 జూలై 2019) మునిమా గ్రామంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురిని హత్య చేయగా.. మహిళలు, పిల్లలతో సహా మొత్తం 16 మందిని కరీడా గ్రామంలో ఊచకోత కోశారు. వారిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించిన పాపువా న్యూ గునియా ప్రధాని జేమ్స్ మరెప్ హంతకులకు హెచ్చరికలు జారీ చేశారు.

హగుయి, ఒకిరు, లివి గిరిజన తెగలకు చెందిన వారు ఈ ఘటనలకు పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. వారిలో కొందరు తుపాకులు, బడిసెలు వినియోగించినట్లు వెల్లడించారు. ఈ క్రూర ఘటనలకు పాల్పడిన వారికి సమయం దగ్గరపడిందని, అందుకే ఇటువంటి చర్యలకు తెగబడతున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలను పెంచామని, ఎవరికీ భయపడేది లేదని, ఊచకోత కోసిన వారికి తప్పక శిక్ష పడుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు.

Women
children
tribal massacre
Papua New Guinea

మరిన్ని వార్తలు