LIC హౌసింగ్‌లో 300 ఉద్యోగాలు

Submitted on 9 August 2019
LIC HFL Recruitment 2019 for 300 Assistant, Associate & Assistant Manager Posts Across India

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ (LIC)కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 300 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్ధులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చెరీ, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది LIC హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. 

విభాగాల వారీగా ఖాళీలు: 
అసిస్టెంట్ : 125 ఖాళీలు.
అసిస్టెంట్ మెనేజర్: 100 ఖాళీలు.
అసోసియేట్: 75 ఖాళీలు.
మొత్తం : 300 ఖాళీలు.

విద్యార్హత : 
> అసిస్టెంట్ పోస్టుకు 55% మార్కులతో గ్రాడ్యుయేషన్. 
> అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు MBA, PGDM, PG Diploma చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 
> ఇక అసోసియేట్ పోస్టుకు 60% మార్కులతో గ్రాడ్యుయేషన్‌తో పాటు CA ఇంటర్ ఉండాలి.
 
వయసు: అభ్యర్ధులు 21 నుంచి 28 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోడానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 
దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 8, 2019. 
దరఖాస్తు చివరితేది: ఆగస్ట్ 26, 2019.
కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ : సెప్టెంబర్ 9, 2019.

దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read Also: రూ.50వేలు జీతం : ఇంజనీరింగ్ పాసయ్యారా? NTPCలో ఉద్యోగాలు

LIC HFL Recruitment 2019
300 Assistant
Associate & Assistant Manager Posts
Across India

మరిన్ని వార్తలు