LIC భారీ రిక్రూట్ మెంట్ : 8వేల 581 పోస్టులు భర్తీ

Submitted on 22 May 2019
LIC Jobs 2019 Biggest Ever Vacancy Of Over 8500 Posts

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు  ఆహ్వానిస్తోంది. ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 9 లోగా  దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు.

LIC Recruitment 2019
Apprentice Development Officer(ADO)
మొత్తం పోస్టులు: 8వేల 581
జోన్ల వారీగా ఖాళీలు : 
సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ - 1251
సెంట్రల్ జోన్ ఆఫీస్, భోపాల్-25
ఈస్టరన్ జోనల్ ఆఫీస్, కోల్ కతా - 922
ఈస్ట్రన్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, పాట్నా- 701
నార్తర్న్ జోనల్ ఆఫీస్, ఢిల్లీ -1130
నార్తర్న్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, కాన్పూర్ - 1042
సదర్న్ జోనల్ ఆఫీస్, చెన్నై - 1257

విద్యార్హత : డిగ్రీ పాసై ఉండాలి
వయసు : 21 నుంచి 30 ఏళ్లు
ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.600..
SC/ST అభ్యర్థులకు రూ.50
అప్లికేషన్ తేదీ ప్రారంభం : మే 20, 2019
దరఖాస్తుకి చివరి తేదీ : జూన్ 09, 2019
కాల్ లెటర్ డౌన్ లోడ్ తేదీ(ఆన్ లైన్ ఎగ్జామ్ కి) : జూన్ 29, 2019
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : జూలై 6, 13
ఆన్ లైన్ మెయిన్ ఎగ్జామ్ : ఆగస్తు 10, 2019
పూర్తి వివరాల కోసం : https://www.licindia.in/Bottom-Links/Careers/Recruitment-of-Apprentice

LIC
jobs
recruitment
ADO
notification
Hyderabad
job alerts

మరిన్ని వార్తలు