మానవి

Thursday, January 14, 2016 - 15:06

కళ్లతో చూస్తాం..కళ్లతో ప్రపంచాన్ని వీక్షిస్తాం..ప్రకృతిలోని అందాలను ఆస్వాదిస్తాం..ఇంతేకదా అనుకుంటే పొరపాటే. కళ్లతో అవధానం కూడా చేయవచ్చని ఇద్దరు చిన్నారులు నిరూపిస్తున్నారు. బొటన వేలితో కూడా భావ వ్యక్తీకరణ చేస్తూ ఎందరినో అబ్బుర పరుస్తున్నారు. అంతేగాకుండా ఇండియాలోనే ఈ కళ్లలో నైపుణ్యాన్ని సాధించిన చిన్నారులు కూడా వీళ్లిద్దరే. తెలుగు సాహితీ ప్రపంచాన్ని శాసించిన సాహితి...

Wednesday, January 13, 2016 - 14:57

498 (ఎ) ..మానసికంగా హింసించినా, అందుకు ప్రేరేపించి ప్రోత్సహించినా ఈ సెక్షన్ కింద కేసు వేయొచ్చు. దీనిపై ఫిర్యాదు చేసే సమయంలో అనేక పొరపాట్లు చేస్తున్నారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మానవి 'వేదిక'లో పార్వతి ఈ అంశంపై విశ్లేషించారు. వరకట్న వేధింపులు..అత్తగారింటి నుండి వేధింపులు..హింసించబడినా..మానసికంగా..శారీరకంగా..ఆరోగ్యానికి తీవ్రమైన విఘాతం కలిగించడం..ఆత్మహత్యకు ప్రేరేపించడం...

Monday, January 11, 2016 - 15:02

వస్త్ర ప్రపంచంలో ఎన్ని కొత్త ఫ్యాషన్స్ వచ్చినా చేనేతలు ఎప్పటికీ ప్రత్యేకమే. అన్ని సందర్భాలకు తగిన కలెక్షన్ ను అందిస్తూ హుందాగా కనిపించే ప్రత్యేకత చేనేతలది. అలాంటి చేనేత ప్రదర్శనను మీ ముందుకు తెచ్చింది సొగసు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Monday, January 11, 2016 - 15:01

పిల్లలు, అమ్మ ఒడిలోనైనా ఆడుకోవాలి. లేదంటే, తరగతి గదిలోనైనా ఉండాలి. ఈ రెండు ప్రదేశాల్లో కాకుండా వారెక్కడున్నా, వారి బంగారు బాల్యం, చితికిపోయనట్టే.. వారి ఎదుగుదలలో పరిపక్వత లోపించినట్టే. ఇలాంటి చిన్నారులకు భద్రంగా బతికే చోటే లేదా? వారి బాల్యం ఎలాంటి పురోభివృద్ధి లేకుండా కరిగిపోవాల్సిందేనా? అంటే కాదంటున్న వారు, ఆ చిన్నారుల కోసం మేమున్నామనే భరోసా ఇస్తున్న వారు మన మధ్యే ఉన్నారు...

Friday, January 8, 2016 - 18:51

క్యాజువల్ వేర్ గా చీరలను ధరించేందుకు కొందరు అతివలు ఇష్టపడతారు. చీరలో హుందాగా కనిపించడంతో పాటు సౌకర్యంగా భావించే అలాంటి వారి కోసం లేటెస్ట్ క్యాజువల్ వేర్ సారీ కలెక్షన్ తో ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది.
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.…

 

Friday, January 8, 2016 - 18:50

ఇంటా, బయటా మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో మహిళలు ఆత్మరక్షణ పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆపద సమయంలో తమ దగ్గర ఉన్న వస్తువులనే ఆయుధాలుగా ఉపయోగించి తమను తాము రక్షించుకునే వీలుంటుంది. అలాంటి పద్ధతులేమిటో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

 

Friday, January 8, 2016 - 18:40

నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? ఏడాదిన్నరగా  జరుగుతున్న ఈ చర్చకు తెరపడి సవరించిన జువినైల్ జస్టిస్ చట్టం రాష్ట్రపతి ఆమోద ముద్రను వేసుకుంది.

బాలల న్యాయ చట్టం ఆమోదం పొందటంతో మహిళల రక్షణకు సంబంధించి జాతీయ మహిళా కమీషన్ కు కొన్ని కీలక అధికారాలు కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. 

మగవాళ్లతో పోల్చుకుంటే...

Thursday, January 7, 2016 - 18:07

ఆధునిక మహిళలు ఇంటిపనితో పాటు, అనేక బాధ్యతలు తమ భుజానికెత్తుకుంటున్నారు. అదే సమయంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కుంటున్నారు. సాధారణ సమస్యగా కనిపించే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు, పరిష్కార మార్గాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి హెల్త్ కేర్. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.…

Thursday, January 7, 2016 - 18:05

నేషనల్ మీడియా హల్ చల్  చేస్తుంటే, లోకల్ మీడియాలో పదుల కొద్దీ పత్రికలు, ఛానళ్లు పుట్టుకొస్తుంటే, గ్రామీణ మహిళల బాధలు, గాథలు ఎవరు వింటారు? వారి గొంతుకను ఎవరు వినిపిస్తారు? అన్న ప్రశ్నకు ఖబర్ లహరియా మేమంటూ సమాధానం చెప్తోంది. అనేక విషయాల్లో ప్రత్యేకతను చాటుకుంటూ, ముందుకెళ్తోంది. 

సెన్సేషన్ తప్ప, సెన్సివిటీ లేకుండా పోతున్న మీడియా ప్రపంచంలో, మహిళలే పత్రిక నడపడం సాహసమే...

Wednesday, January 6, 2016 - 21:44

దంపతులు చిన్న చిన్న విషయాలకు విడాకులు తీసుకుంటున్నారని.. యువత ఎక్కువగా విడాకులు కోరుతున్నారని లాయర్ పార్వతి అన్నారు. మానవి మైరైట్ కార్యమక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఆ వివరాలను ఆమె మాట్లోనే..
యూత్ అధిక మంది విడాకుల కోసం వస్తున్నారు. చిన్న చిన్ని విషయాలు, అసహనం, అపార్ధాలతో విడాకులకు వస్తునన్నారు. చిన్న అపర్ధాలు రాగానే.. పెద్దలకు, స్నేహితులకు చెప్పడం లేదు...

Tuesday, January 5, 2016 - 14:40

హైదరాబాద్ : మన దేశంలో ఎంతో మంది మహిళలు, బాల బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. మాతా శిశు మరణాలు రేటు పెరిగి పోవడానికి ప్రధాన కారణం పౌష్టికాహారం లోపం, రక్తహీనత అని లెక్కలు చెపుతున్నాయి. మరి ఈ సమస్యలు అధిగమించాలంటే ఏం చేయాలి? ఎటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి? ఇదే అంశంపై 'వేదిక' ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి...

Monday, January 4, 2016 - 21:35

సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు... స్వయం నిర్ణయాధికార శక్తి సన్నగిల్లుతుంది. సానుకూలంగా ఆలోచించే స్థితి నుంచి దూరమవుతాము. ఆ స్థితి నుంచి బయపడే మార్గం కోసం అన్వేషిస్తాము. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే ఉన్నా.. సమస్యల వలయాన్ని చేధించుకుని.. తన లాంటివారికి సాయపడేందుకు సిద్ధమయ్యారు శ్యామలాదేవి. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆమె జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. మరిన్ని వివరాలను...

Thursday, December 31, 2015 - 17:53

ఏడాది కాలగమనంలో సగ భాగమైన మహిళా ప్రపంచంలో అనేక మలుపులు...మరెన్నో మెరుపులు..కొన్ని చారిత్రాత్మకతను సంతరించుకున్నాయి. కొన్ని పోరాట స్పూర్తిని రగిలించేవి. మరికొన్ని విషాద వార్తలుగా మిగిలాయి. ఇంకొన్ని కొత్త ఆశలు కలిగించేవి. అలాంటి విభిన్న వార్తల సమాహారంతో కొత్త ఏడాదికి 'మానవి' స్వాగతం పలుకుతోంది.
ఆకలి తీర్చే అమ్మలున్నారు. పేద పిల్లల ఆలనా పాలనా..చూసే ఆయాలు..ప్రభుత్వ పథకాలు...

Wednesday, December 30, 2015 - 15:36

కాలం శక్తిమంతమైంది.. . గతాన్ని మంచిచెడుల జ్నాపకంగా మారుస్తుంది.. సంతోష విషాదాలను నింపుతుంది.. వర్తమానాన్ని దానికి కొనసాగింపుగా చేస్తుంది.. గతం ఎలా గడిచినా, భవిష్యత్ పై కొత్త ఆశను కలిగిస్తుంది.. అటువంటి అనుభవాలు, అనుభూతులతో నిండిన ఈ ఏడాదిని సింహావలోకనం చేసుకుంటూ, విమెన్ ఎట్ 2015 లో మహిళలకు సంబంధించి న్యాయపరంగా వచ్చిన మార్పులతో కథనం..

అత్యాచార కేసులపై సుప్రీం...

Tuesday, December 29, 2015 - 14:59

కాలం చాలా విలువైంది. గతాన్ని మరిచిపోయేలా చేస్తుంది. వర్తమానంలోని వాస్తవాల్ని వివరిస్తుంది. భవిష్యత్ మీద ఆశలు కలిగిస్తుంది. అలా కాలచక్రంలో మరో ఏడాది కరిగిపోయింది. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో, మహిళా ప్రపంచంలో జరిగిన అనేక సంఘటలను, సంక్షోభాలను, పోరాటాలను, ఆరాటాలను సింహావలోకనం చేసుకొందాం..మహిళలపై అనేక ఆంక్షలు విధించే ఆఫ్గనిస్తాన్ లాంటి దేశంలో, అక్కడి మహిళలు ఆ ఆంక్షల చట్రంలోంచి...

Monday, December 28, 2015 - 15:34

ఆసక్తికి పదును పెడుతూ వ్యర్థాలతో చక్కని వస్తువులు తయారు చేసే కళ కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి కళతో ముచ్చటైన రూపాలను ఓ అతివ తయారు చేస్తోంది. ఎలాంటి వస్తువులు తయారు చేశారో వీడియోలో చూడండి..

Monday, December 28, 2015 - 15:31

నాన్న మాటలు ఆమె భవిష్యత్ ను నిర్ధేశించాయి. చిన్ననాటి ఆలోచనలను ఆమెలో సేవానిరతిని పెంచాయి. కష్టాలను చూసి చలించిపోయే ఆమె మనస్థత్వం ఎంతోమంది చిన్నారులకు చక్కటి భవిష్యత్ ను అందిస్తోంది. సేవా భావం కొందరికి మాత్రమే సొంతం. తమకు లేకపోయినా పక్కవారి సంతోషమే లక్ష్యంగా పనిచేయాలని తపన పడడం అరుదైన లక్షణం. అలాంటి అరుదైన లక్షణానికి ప్రతీక నిలుస్తోంది ఓ అతివ. అలా వేలాది మంది చిన్నారుల...

Friday, December 25, 2015 - 15:02

కాలుష్యకారకంగా నిలుస్తున్న ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలను ఆలోచించాల్సిన తరుణమిది. అలాంటి ప్రత్యామ్నాయాలలో జూట్ ది ప్రత్యేక స్థానం. అందుకే జూట్ తో ఎన్నో వస్తువులను తయారు చేయవచ్చు. ఆ విశేషాలను వీడియోలో చూడండి.

 

Friday, December 25, 2015 - 15:01

ఇంటా, బయటా మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో మహిళలు ఆత్మరక్షణ పద్ధతులపై పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆపద సమయంలో తమ దగ్గర ఉన్న వస్తువులనే ఆయుధాలుగా ఉపయోగించి తమను తాము రక్షించుకునే వీలుంటుంది. అలాంటి పద్ధతులేమిటో వీడియోలో చూడండి..

Friday, December 25, 2015 - 15:00

నిర్భయపై దాడికి పాల్పడిన మైనర్ విడుదలయ్యాడు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కి అనుగుణంగా ఈ తీర్పు వెలువడింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్...

Thursday, December 24, 2015 - 15:39

అనేక కారణాలతో ఎంతో మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి సంతాన లేమి అంటే ఏమిటి ? సమస్యను గుర్తించటమెలా ? పరిష్కారమార్గాలేమిటో మానవి హెల్త్ కేర్ లో వైద్యులు విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, December 24, 2015 - 15:00

నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణ చేసింది. దీనిపై ప్రత్యేక కథనం..నిర్భయ ఘటన, భారత చరిత్రలో ఎప్పటికీ ఒక చారిత్రక పరిణామమే. ఈ తర్వాత వెలువెత్తిన ఉద్యమాలు, భావోద్వేగాలు దేశంలో...

Wednesday, December 23, 2015 - 14:47

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన బాలల న్యాయ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఎగువ, దిగువ సభల ఆమోదం పొందిన కొత్త చట్టం ప్రకారం 16 నుండి 18 ఏండ్లలోపు బాలలు చేసిన హేయమైన నేరాలు ఇకపై బాలనేరస్తుల చట్ట పరిధిలోకి రావు. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం ఈ చట్టంలో సవరణలు చేశారు. ఈ సందర్భంగా మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ అంశంపై లాయర్ పార్వతి విశ్లేషించారు. అత్యంత హేయమైన నేరాలు చేసిన...

Tuesday, December 22, 2015 - 14:56

క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలు చేయించుకుంటున్నారని అన్ని సందర్భాల్లో అది అనవసరమని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలను ఎంజెలోనా జోలి చేయించుకుంది. దీనితో జోలి సిండ్రోమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అందం కోసం కూడా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని..ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సోషల్ పాలసీ స్టడీస్ జర్నల్ వెల్లడించింది. ఈ అంశంపై మానవి...

Monday, December 21, 2015 - 15:15

తీరిక వేళల్లో మహిళలు తమకు తాము ఏదో వ్యాపకం కల్పించుకుంటారు. ఇందులో భాగంగా అనేక వస్తువులతో ముచ్చటైన రూపాలనూ తయారు చేస్తుంటారు. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి అలంకార వస్తువులు తయారు చేయటం ఎలాగో వీడియోలో చూడండి. 

Monday, December 21, 2015 - 15:13

మనమంతా వెలుగు కావాలనే కోరుకుంటాం. మనమంతా వెన్నెల కాంతుల్ని ఆస్వాదించాలనే అనుకుంటాం. మనమంతా ఈ సృష్టిలోని అందాలను అనుభవించాలనే ఆశపడతాం... కానీ మరి, ఆ వెలుగును, వెన్నెలను, అందాలను చూడలేని అంధుల మాటేమిటి? వారి చదువు సంగతేమిటి? వారికి అందాల్సిన విజ్ఞానం గురించి ఆలోచించి, ఎవరూ చేయని కృషి చేస్తూ, ముందుకు సాగుతున్న ఓ అతివ స్పూర్తిదాయక కథనం ఎలా సాగిందో తెలుసుకుందాం. చీకటి తప్ప...

Friday, December 18, 2015 - 15:55

ఓల్గా అరుదైన గౌరవం..

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. మూడు దశాబ్దాలుగా మహిళల సమస్యలను భిన్నమైన కోణంలో వ్యక్తీకరిస్తూ స్త్రీవాద రచయిత్రిగా ఆమె గుర్తింపు సాధించారు.

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తి...

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తయ్యింది. అబ్జర్వేషన్ హోంలో ఉంటున్న...

Pages

Don't Miss