మానవి

Friday, December 25, 2015 - 15:00

నిర్భయపై దాడికి పాల్పడిన మైనర్ విడుదలయ్యాడు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ కి అనుగుణంగా ఈ తీర్పు వెలువడింది. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయస్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్...

Thursday, December 24, 2015 - 15:39

అనేక కారణాలతో ఎంతో మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి సంతాన లేమి అంటే ఏమిటి ? సమస్యను గుర్తించటమెలా ? పరిష్కారమార్గాలేమిటో మానవి హెల్త్ కేర్ లో వైద్యులు విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, December 24, 2015 - 15:00

నేరస్థుడి వయసుతో ముడిపడి న్యాయస్థానం తీర్పు చెప్పాలా? లేక నేరానికి తగినట్టుగా శిక్షలుండాలా? గత వారం రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. మొత్తానికి ఈ చర్చకు పార్లమెంట్ ఓ ముగింపు పలికింది. ఎట్టకేలకు జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణ చేసింది. దీనిపై ప్రత్యేక కథనం..నిర్భయ ఘటన, భారత చరిత్రలో ఎప్పటికీ ఒక చారిత్రక పరిణామమే. ఈ తర్వాత వెలువెత్తిన ఉద్యమాలు, భావోద్వేగాలు దేశంలో...

Wednesday, December 23, 2015 - 14:47

దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన బాలల న్యాయ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఎగువ, దిగువ సభల ఆమోదం పొందిన కొత్త చట్టం ప్రకారం 16 నుండి 18 ఏండ్లలోపు బాలలు చేసిన హేయమైన నేరాలు ఇకపై బాలనేరస్తుల చట్ట పరిధిలోకి రావు. నిర్భయ ఘటన జరిగిన మూడేళ్ల అనంతరం ఈ చట్టంలో సవరణలు చేశారు. ఈ సందర్భంగా మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ అంశంపై లాయర్ పార్వతి విశ్లేషించారు. అత్యంత హేయమైన నేరాలు చేసిన...

Tuesday, December 22, 2015 - 14:56

క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలు చేయించుకుంటున్నారని అన్ని సందర్భాల్లో అది అనవసరమని వైద్యులు, నిపుణులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ భయంతో ముందస్తు చికిత్సలను ఎంజెలోనా జోలి చేయించుకుంది. దీనితో జోలి సిండ్రోమ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అందం కోసం కూడా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారని..ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలను సోషల్ పాలసీ స్టడీస్ జర్నల్ వెల్లడించింది. ఈ అంశంపై మానవి...

Monday, December 21, 2015 - 15:15

తీరిక వేళల్లో మహిళలు తమకు తాము ఏదో వ్యాపకం కల్పించుకుంటారు. ఇందులో భాగంగా అనేక వస్తువులతో ముచ్చటైన రూపాలనూ తయారు చేస్తుంటారు. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి అలంకార వస్తువులు తయారు చేయటం ఎలాగో వీడియోలో చూడండి. 

Monday, December 21, 2015 - 15:13

మనమంతా వెలుగు కావాలనే కోరుకుంటాం. మనమంతా వెన్నెల కాంతుల్ని ఆస్వాదించాలనే అనుకుంటాం. మనమంతా ఈ సృష్టిలోని అందాలను అనుభవించాలనే ఆశపడతాం... కానీ మరి, ఆ వెలుగును, వెన్నెలను, అందాలను చూడలేని అంధుల మాటేమిటి? వారి చదువు సంగతేమిటి? వారికి అందాల్సిన విజ్ఞానం గురించి ఆలోచించి, ఎవరూ చేయని కృషి చేస్తూ, ముందుకు సాగుతున్న ఓ అతివ స్పూర్తిదాయక కథనం ఎలా సాగిందో తెలుసుకుందాం. చీకటి తప్ప...

Friday, December 18, 2015 - 15:55

ఓల్గా అరుదైన గౌరవం..

ప్రముఖ స్త్రీవాద రచయిత్రి వోల్గా అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. మూడు దశాబ్దాలుగా మహిళల సమస్యలను భిన్నమైన కోణంలో వ్యక్తీకరిస్తూ స్త్రీవాద రచయిత్రిగా ఆమె గుర్తింపు సాధించారు.

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తి...

నిర్భయ నిందితులలో మైనర్ కు శిక్షాకాలం పూర్తయ్యింది. అబ్జర్వేషన్ హోంలో ఉంటున్న...

Friday, December 18, 2015 - 15:51

హైదరాబాద్ : విద్య, ఉద్యోగావకాశాలను అందుకునే క్రమంలో మహిళలు ఎక్కడికైనా, ఏ సమయంలోనైనా ఒంటరిగా బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అడుగడుగునా పొంచి ఉన్న ఆకతాయిల ఆగడాలను ఎదుర్కోవాలంటే ఆత్మరక్షణా పద్ధతులను నేర్చుకోవటంతో పాటు చక్కటి డైట్ నూ అనుసరించాలి. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.

Friday, December 18, 2015 - 15:47

హైదరాబాద్ : ఆసక్తి, అభిరుచులకు రంగుల మేళవింపును జత చేస్తోంది ఒక అతివ. సింపుల్ టెక్నిక్స్ తో అందమైన పెయింటింగ్స్ ను ఆవిష్కరిస్తోంది. అవేంటో, ఎలా చేస్తోందో ఇవాళ్టి సొగసులో చూసి నేర్చుకుందాం. ఆ పెయింటింగ్స్ ను చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Thursday, December 17, 2015 - 14:54

హైదరాబాద్ : మహిళల జీవిత గమనంలో మెనోపాజ్ దశ ఎంతో కీలకమైనది. జీవక్రియలలో అనేక మార్పులు చోటు చేసుకునే ఈ దశలో ఎంతో మంది మహిళలు ఆస్టియో పోరోసిస్ బారిన పడుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో డాక్టర్ వివరించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Thursday, December 17, 2015 - 14:52

హైదరాబాద్ : కాల్ మనీ. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. కాల్ మనీ పేరుతో జరుగుతున్న ఈ వడ్డీ వ్యాపారం ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో తెలుసుకుంటే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. మహిళల్ని బాధితులుగా చేస్తున్న తీరు, అప్పు కోసం వారిని నిస్సహాయ స్థితిలోకి నెట్టడం చూస్తుంటే, డబ్బు వికృత రూపం...

Wednesday, December 16, 2015 - 14:35

హైదరాబాద్ : దేశ రాజధాని లో జరిగిన నిర్భయ ఘటనకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. 2013లో వర్మ కమిటి అధ్యక్షతన నిర్భయ చట్టం వచ్చింది. అస్సలు నిర్భయ చట్టం అంటే ఏమిటి? దాని పూర్వాపరాలు ఏమిటి? న్యాయసలహాలు, సందేహాలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. వారు ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

Tuesday, December 15, 2015 - 16:54

హైదరాబాద్ : వివాహ బంధం విచ్చిన్నం అయిపోతోంది. రోజు రోజుకు విడాకుల సంఖ్య కూడా పెరిగి పోతోంది. జీవిత భాగస్వామికి క్యాన్సర్ కారణంగా విడాకులు తీసుకోవచ్చా? ఈ అంశంపై న్యాయస్థాం ఒక కేసులో ఓ తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు సంబంధించి చర్చను చేపట్టింది వేదిక. ఈ చర్చా కార్యక్రమంలో పీఓడబ్ల్యు నేత సంధ్య, జెఎల్ ఎన్ మూర్తి న్యాయవాది పాల్గొన్నారు. . వివాహాన్ని బాధ్యతతతో...

Monday, December 14, 2015 - 21:07

ఆధునిక మనిషి 30 సంవత్సరాలకే రకరకాల రోగాల బారిన పడుతున్నాడు. 40 కల్లా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేస్థితికి నెట్టబడుతున్నాడు. 50 ల కల్లా రోగాల పట్టుగా మారిపోతున్నాడు. కానీ ఈ ఆధునిక ప్రపంచంలోనూ.. 65 వసంతాల వయస్సులో చిరు నవ్వులు చిందిస్తూ... చిద్విలాసంగా బతికేస్తున్న వ్యక్తులు.. మన మధ్యనే ఉన్నారు. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో కమలమ్మ అందరికీ...

Thursday, December 10, 2015 - 16:05

మహిళల జీవన చక్రంలో, మెనోపాజ్ ఒక కీలక దశ. మానసిక, శారీరక ఆరోగ్యంపై కీలక ప్రభావాన్ని చూపే దశ. కాస్త జాగరూకతతో ఉంటే, ముందు నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, మెనోపాజ్ ని విజయవంతగా దాటే వీలుంది. ఆ వివారలేంటో, హెల్త్ కేర్ లో చూడండి..

Thursday, December 10, 2015 - 16:03

ప్రకృతి మహిళకు ఇచ్చిన అదనపు బాధ్యత బిడ్డలను కనడం.. ఆ ప్రక్రియ ఎంతటి వేదనతో నిండినదైనా స్త్రీ ఆనందంగా అందుకు సిద్ధపడుతుంది. మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించేందుకు చావు లాంటి ప్రసవ వేదనను అనుభవిస్తుంది.. పండంటి బిడ్డను పొత్తిళ్లలో దాచుకోవాలని తపన పడుతుంది.. కానీ, ఆ మాతృత్వపు భావన మన్యం మహిళల్లో విషాదాన్ని నింపుతోంది.. ఈ నేపథ్యంలో మన్యంలోని మహిళల ఆరోగ్య పరిస్థితిపై మానవి...

Wednesday, December 9, 2015 - 14:41

దేశంలో 1937 వరకు ఎలాంటి చట్టాలు లేవని, అప్పట్లో మహిళలంటే ఆలన..పాలన..పోషణ చూసే హక్కు కల్పించబడిందని లాయర్ పార్వతి పేర్కొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పురుష కుటుంబ దయదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించే వారని పేర్కొన్నారు. మహిళలు..ఆస్తిలో హక్కు అనే అంశంపై టెన్ టివిలో 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. 1937 మొట్టమొదటగా మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించాలని తాత్కాలికంగా...

Tuesday, December 8, 2015 - 14:50

నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు అంతర్జాతీయంగా మహిళలపై హింసా వ్యతిరేక ప్రచారం జరుగనుంది. అన్ని చోట్ల వివక్ష కొనసాగుతుండడం..కుటుంబసభ్యులే దాడులకు పాల్పడుతున్న వైనాలు మనం చూడవచ్చు. ఇంటా, బైట రక్షణ కరువవుతోంది. చివరకు పని ప్రదేశాల్లో కూడా లైంగిక వేధింపులు అధికమౌతున్నాయి. ఈ నేపథ్యంలో మానవి 'వేదిక'లో ఈ అశంపై లక్ష్మీ (ఓయూ ప్రొఫెసర్), గిరిజ (వాయిస్ ఫర్ జెండర్ జస్టిస్) ...

Monday, December 7, 2015 - 20:56

గృహిణులుగా స్థిరపడిన మహిళలు తమ కళాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు ఇష్టపడతారు. తీరిక వేళల్లో అందమైన కళాకృతులకు రూపమిస్తారు. అలాంటి వారికి క్రష్ పెయింటింగ్ ను నేర్పేందుకు ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, December 7, 2015 - 20:54

పేదరికంతో పోరాటం..అక్షర జ్నానం కోసం ఆరాటం...పరిస్థితులకు ఎదురీదే సంకల్పం. నలుగురికీ అండగా నిలిచే ఆశయం. ఈ లక్షణాలే లక్షలాది మంది అమ్మాయిల్లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఆటుపోట్లకు ఎదురు నిలిచేలా చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సమీపంలో, ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఉషా విశ్వకర్మ , స్వయం కృషితో చదువుకుంది. తనలాంటి సమస్యల్లో ఉన్న వారికి అక్షర జ్నానం అందివ్వాలనుకుంది....

Friday, December 4, 2015 - 14:49

హైదరాబాద్ : అతివలకు అన్ని సందర్భాలకు తగిన విధంగా అమరిపోయే వస్త్రధారణ చుడీదార్స్. ఈ చుడీదార్స్ లో ప్రత్యేక సందర్భాల కోసం చక్కటి కలెక్షన్ ను అందిస్తున్నారు కియారా డిజైనర్స్. ఆ కలెక్షన్ ఏమిటో ఇవాళ్టి సొగసులో చూద్దాం.

 

Friday, December 4, 2015 - 14:48

హైదరాబాద్ : మహిళలకు అడుగడుగునా వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణా పద్ధతులలో వారు నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే కరాటేలో మెళకువలతో ఇవాళ్టి నిర్భయ మీ ముందుకొచ్చింది.

Friday, December 4, 2015 - 14:47

మహిళా రిజర్వేషన్లకు మోక్షమెప్పుడు అంటోంది మహిళా లోకం. తాజాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా సంఘాలు చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు.....

మయన్మార్ పార్లమెంటరీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఆంగ్ సాన్ సూకీ వచ్చే ఏడాది బాధ్యతలు తీసుకోనుంది. ప్రభుత్వం సైనిక పాలనతో...

Thursday, December 3, 2015 - 14:50

హైదరాబాద్ : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా, దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ఇక దురలవాట్లు ఉన్న వారికైతే ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యలకు అనేక రకాల చికిత్సా పద్ధతులున్నాయంటుమని 'మానవి హెల్త్ కేర్' కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ హరీష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

Thursday, December 3, 2015 - 14:47

హైదరాబాద్ : కులమేదైనా, మతమేదైనా, నూటికి 90 శాతం ప్రజలు నమ్మేది దేవుడినే. ఆడైనా, మగైనా ఒకేరీతిగా దైవాన్ని కొలుస్తారు. మరి అలాంటప్పుడు ఆధ్మాత్మిక ప్రదేశాల్లోకి, ఆలయ ప్రాంగణాల్లోకి మహిళలకు ఎందుకు ప్రవేశం ఉండటం లేదు? ఆంక్షలు ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇటీవల శని సింగాపూర్ ఆలయంలో జరిగిన ఘటన మరోసారి ఈ విషయాలను తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో మానవి ప్రత్యేక కథనం.

దేవుడి...

Wednesday, December 2, 2015 - 14:43

హైదరాబాద్ : న్యాయసలహాలు, సూచనలు అందించే 'మైరైట్' కార్యక్రమంలో తల్లిదండ్రులు, పిల్లలు వారి భార్య, మెయింటెనెన్స్ కు ఎలాంటి చట్టాలు ఉన్నాయి. మెయిటెనెన్స్ తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? అనే అంశం పై ప్రముఖ న్యాయవాది పార్వతి తెలియజేశారు. పార్వతి ఏఏ అంశాలను తెలియజేశారో వినాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Pages

Don't Miss