మానవి

Monday, October 26, 2015 - 15:39

పండుగలు, వివాహం లాంటి ప్రత్యేక సందర్భాలలో అతివలు ఆడంబరంగా రెడీ అవటానికి ఇష్టపడతారు. అందుకోసం మార్కెట్ లో అనేక రకాల ఫ్యాబ్రిక్స్ పై అందమైన హ్యాండ్ వర్క్ తో చక్కటి కలెక్షన్ అందుబాటులో ఉంటోంది. అలాంటి లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం..

Monday, October 26, 2015 - 15:37

ప్లాస్టిక్ ఆధునిక మనిషి నిత్య జీవితంలో భాగంగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమని తెలిసినా, వాడకుండా ఉండలేని స్థితి. అయితే ఇదే ప్లాస్టిక్ ను రీసైకిల్ చేయటంతో కాలుష్యం కొంతైనా తగ్గే అవకాశముందని కొంతమంది నిపుణుల వాదన. ఈ అంశాన్నే వ్యాపారానికి పునాదిగా చేసుకున్న ఓ అతివ కథనం..

అద్భుత ఫలితాలు...
కెరీర్ స్టార్టింగ్ లో మనకు ఉద్యోగం బెటరా? లేక...

Friday, October 23, 2015 - 19:49

ఫ్యాషన్ ప్రపంచం రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ట్రెండ్ కి అనుగుణంగా అనేక డిజైన్స్ తో అతివలను ఆకర్షిస్తోంది. ఇప్పుడు విభిన్న రంగులతో, అంతకు మించిన డిజైన్స్ తో లేసులు ఫ్యాషన్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి స్పెషల్ లేసులతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, October 23, 2015 - 19:48

పుట్టబోయే పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం గృహ హింస అవుతుందని ఢిల్లీ న్యాయస్థానం స్పష్టం చేసింది. కుటుంబం పట్ల బాధ్యతలు విస్మరించే పురుషులకు ఈ తీర్పు ఒక హెచ్చరికగా పనిచేయనుంది.
ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక అధ్యయనం
ఆడపిల్లల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీ...

Friday, October 23, 2015 - 19:45

ఆటపాటలతో గడవాల్సిన బాల్యం కొందరు చిన్నారులకు శాపంగా పరిణమిస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, అయిన వారే వారిపై దాడులకు తెగబడుతూ బాల్యాన్ని చిద్రం చేస్తున్నారు. అలాంటి స్థితిలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? పిల్లలకు ఎలాంటి స్థైర్యాన్నందించాలో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, October 21, 2015 - 14:47

వినియోగదారులు వస్తు రూపేణ, ఇతర నిర్లక్ష్యాల కారణంగా మోస పోవడమే కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి కోసం వినియోగదారుల చట్టాన్ని రూపొందించారని లాయర్ పార్వతి పేర్కొన్నారు. మానవి 'మై రైట్' కార్యక్రమంలో వినియోగదారులు..చట్టంపై విశ్లేషించారు. వినియోగదారుల చట్టం 1986లో వచ్చిందన్నారు. నిత్య జీవితంలో అనేక సేవలను పొందుతుంటామని, అలాగే వస్తువులు కొనడం జరుగుతుందన్నారు. ఇందులో...

Tuesday, October 20, 2015 - 19:35

సరోగసీ విధానం అంతా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలని వక్తలు తెలిపారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రమ, అడ్వకేట్ శ్యాంసుందరి పాల్గొని, మాట్లాడారు. చట్టం పరిధిలో లేని కారణంగా మానవ పిండాల రవాణా జరుగుతోందన్నారు. అద్దె గర్భం పద్ధతి అంతా పారదర్శకంగా జరగాలని చెప్పారు. ఆ వివరాలను వారి మాటల్లోనే....
'సరోగసీకి ఒప్పుకునే తల్లుల...

Monday, October 19, 2015 - 19:39

ట్రెండ్స్ ను ఫాలో అవటంలో టీనేజర్స్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. అలాగే ప్రత్యేక సందర్భాలకు తగినట్లుగా డ్రెస్ చేసుకోవటంలోనూ వారే ముందుంటారు. అలాంటి వారి కోసం లాంగ్ ఫ్రాక్స్ లో లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు.

 

Monday, October 19, 2015 - 19:38

ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెది సరికొత్త శైలి. సంప్రదాయ చేనేత రంగంలో ప్రత్యేక ఒరవడి. రోజుకో కొత్త పుంతలు తొక్కే ఫ్యాషన్ ప్రపంచంలో, సంప్రదాయ చేనేతలకు, అందమైన ఆర్ట్ ను అద్ది వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న అతివ కథనంతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి. చేనేతలంటేనే ముతక బట్టలు, పెద్ద వయసు వారు మాత్రమే ఇష్టపడే వస్త్ర రాజసం అనే అభిప్రాయమే మనలో చాలా మందికి ఉంటుంది...

Friday, October 16, 2015 - 14:51

బతుకమ్మ పూలతో చేసే జాతర. అందాల హరివిల్లును నేలమీద పరిచే తిరునాళ్లు . కంచెలు కంచెలుగా, బీళ్లు బీళ్లుగా విస్తరించుకున్న నీళ్లులేని తెలంగాణలో క'న్నీటి' చెలిమె బతుకమ్మ. ఉయ్యాలలూపే పాటల పల్లవుల్లో ఆడపడుచుల ఆర్భాటపు పండగ బతుకమ్మ. ఆ బతుకమ్మకి మానవి అక్షరాభిషేకం చేస్తోంది. ఆటాపాటా కలబోసుకున్న అచ్చ తెలంగాణా ఆడపడుచుల పండుగ బతుకమ్మ. భారత్ లోనే కాదు, ప్రపంచంలోనే మరెక్కడా లేని పూల జాతర...

Thursday, October 15, 2015 - 16:32

అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాదాపు 75 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తోంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వృత్తులే ప్రధాన జీవనాధారంగా పనిచేస్తున్న ఈ గ్రామీణ జనాభా ప్రపంచానికి ఆహార భద్రత కల్పిస్తోంది. వీరిలో సగ భాగంగా ఉన్న మహిళలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ అక్టోబర్ 15 ను ప్రపంచ గ్రామీణ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మానవి ఫోకస్...

Wednesday, October 14, 2015 - 14:56

ఏదైనా కేసులు కోర్టుకు వస్తే ముందు అది మీడియేషన్ సెంటర్ అంటే మధ్యవర్తిత్వం వద్దకు పంపిస్తారని అడ్వకేట్ జె.ఎల్.ఎన్. మూర్తి పేర్కొన్నారు. మానవి 'మై రైట్' కార్యక్రమంలో ఈ అంశంపై విశ్లేషించారు. మధ్యవర్తిత్వంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని తెలిపారు. మొదట కేసును మీడియేషన్ సెంటర్ కు పంపిస్తారని, అక్కడ ట్రైనింగ్ పొందిన వ్యక్తి (మధ్యవర్తిత్వం) వద్ద కేసును పరిష్కరించే దిశగా...

Tuesday, October 13, 2015 - 14:58

పిల్లల దత్తతలన్నీ చట్టపరంగా, నిబంధనలకనుగుణంగా జరగాలని వక్తలు సూచించారు. ఈ అంశపై మానవి నిర్వహించిన 'వేదిక' చర్చా కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్యామ సుందరి, అడ్వకేట్ శ్రీశైలం, సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొని, మాట్లాడారు. దత్తత తీసుకున్న పిల్లల బాగోగుల పట్ల ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఉండాలని కోరారు. దత్తత స్వీకరించిన పిల్లల పట్ల తల్లిదండ్రులు...

Monday, October 12, 2015 - 15:49

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని కొత్త ఫ్యాషన్స్ పుట్టుకొచ్చినా హ్యాండ్లూమ్స్ స్పెషాలిటీ ఎప్పటికీ ప్రత్యేకమే. అలాంటి హ్యాండ్లూమ్స్ పైన హ్యాండ్ పెయింటింగ్స్ తో ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తోంది ఒక అతివ. 

Monday, October 12, 2015 - 15:45

సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని అవయవాలు సక్రమమైన పనితీరుతో ఉన్నవారే పోటీ ప్రపంచంలో వత్తిడికి గురవుతూ అనేక మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ అందుకు భిన్నంగా వైకల్యాన్ని జయించి జయకేతనం ఎగురేస్తూ విశ్వదృఖ్ సంస్థ సభ్యులు ముందుకెళుతున్నారు. మధురమైన పాటకు ఏం కావాలి. అద్భుతమైన కంఠం కావాల్సి ఉంటుంది. రాగతాళాలకు అనుగుణంగా పాడే స్వర పరిజ్ఞానం ఉండాల్సి ఉంటుంది. అంతేకాని పాటకు చూపే...

Friday, October 9, 2015 - 21:22

రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీ, పరుషులను ఒక్కటి చేసే బంధం వివాహం. అలా భిన్న నేపథ్యాలతో ఒక్కటయ్యే జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మరి ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశాలపై మానవి నిర్వహించిన నిర్భయ కార్యక్రమంలో సైక్రియాటిస్టు.. పూర్ణిమనాగరాజు పాల్గొని, మాట్లాడారు. భార్యాభర్తల రిలేషనషిప్ మధ్య వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి...

Thursday, October 8, 2015 - 18:05

ప్రజా రక్షణ వారి బాధ్యత. నేరస్థులను పట్టుకోవటం వారి విధి. ప్రతి ప్రత్యేక సందర్భానికి తగిన చర్యలు తీసుకోవటం వారి వృత్తి. వారి సేవలు ఆగిపోతే ప్రజాజీవనం స్థంభిస్తుంది. సాధారణ ప్రజలకు రక్షణ కరువుతుంది. మరి అలాంటి విశిష్ట బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. మానసికంగా ఉత్సాహంగా ఉండాలి. మరి ఆ స్థితి ఉందా? లేదని తేల్చింది ఒక సర్వే.
పరిమితి...

Thursday, October 8, 2015 - 17:27

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని...

Wednesday, October 7, 2015 - 14:35

హైదరాబాద్ : మహిళల భద్రతకు సంబంధించన చట్టాలలో సెక్షన్ 304 బిఆఫ్ ఐపీసీ అంటే ఏమిటి అనే అంశంపై న్యాయపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించే మైరైట్ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. సెక్షన్ 304 బిఆఫ్ ఐపీసీ లో వివాహిత మహిళ 7 సంవత్సరాల లోపు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే దానిని వరకట్న వేధింపులతో మరణించినట్లు భావిస్తారు. పూర్తి వివరాలు కావాలంటే ఈ...

Tuesday, October 6, 2015 - 17:49

పిల్లల దత్తతలన్నీ చట్టపరంగా, నిబంధనలకనుగుణంగా జరగాలని వక్తలు సూచించారు. ఇదే అంశపై మానవి నిర్వహించిన వేదిక చర్చా కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్యామ సుందరి, అడ్వకేట్ శ్రీశైలం, సీడబ్ల్యుసీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొని, మాట్లాడారు. దత్తత తీసుకున్న పిల్లల బాగోగుల పట్ల ప్రభుత్వం నుంచి మానిటరింగ్ ఉండాలని కోరారు. దత్తత స్వీకరించిన పిల్లల పట్ల తల్లిదండ్రులు...

Monday, October 5, 2015 - 15:51

అతివల ఆల్ టైం ఫేవరెట్ డ్రెస్సింగ్ చుడీదార్స్. క్యాజువల్ గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకత చుడీదార్స్ ది. అలాంటి చుడీదార్స్ లో లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం.

Monday, October 5, 2015 - 15:49

ఊహ తెలిసిన నాటి నుండే ఎంతో మంది ఎన్నో కలలు కంటారు. భవిష్యత్ జీవితం గురించి ఎన్నో లక్ష్యాలను నిర్ధేశించుకుంటారు. ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు, కలలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. లక్ష్యాన్ని సాధిస్తారు. పలువురికి స్పూర్తిగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒక అతివ పరిచయం. యాంత్రికత, సాంకేతికతే ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో కళను కెరీర్ గా మలుచుకునే...

Friday, October 2, 2015 - 15:07

హైదరాబాద్ : మహిళలకు మెటర్నిటీ లీవ్ మంజూరుచేస్తామని, వారి పిల్లల కోసం సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటంలో శ్రద్ద తీసుకుంటామని అనేక సంస్థలు తమ నిబంధనలలో చేరుస్తున్నప్పటికీ వాస్తవంలో అదంతా అమలు కావట్లేదని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వారికి సౌకర్యవంతమైన మాతృత్వం అందట్లేదని ఈ నివేదిక తేల్చింది.

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా...

Friday, October 2, 2015 - 15:02

హైదరాబాద్ : ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా అతివలు ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తారు. మరి చీరలకు మ్యాచింగ్ బ్లౌజ్ ఒకప్పటి ట్రెండ్ అయితే డిజైనర్ బ్లౌజెస్ ప్రస్తుత ట్రెండ్. అలాంటి ట్రెండీ డిజైనర్ బ్లౌజెస్ కి ఇవాళ్టి సొగసు మీ ముందుకు వచ్చింది. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, October 1, 2015 - 14:51

హైదరాబాద్ : ఆరోగ్యవంతమైన జీవన విధానంలో దంతాల పాత్ర కీలకమైనది. తీసుకునే ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ దంతాల నుండే మొదలవుతుంది. అలాంటి కీలకమైన దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో, ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయో ఇవాళ్టి హెల్త్ కేర్ లో డాక్టర్ దిలీప్ వివరించారు. మరి ఆ వివరాలను మీరు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Thursday, October 1, 2015 - 14:38

హైదరాబాద్ : 14 ఏళ్లలోపు బాలలందరూ పాఠశాలలోనే ఉండాలంటోంది చట్టం. బాల కార్మికులను పనిలోకి పెట్టుకుంటే నేరం అంటుంది న్యాయవ్యవస్థ. మరి ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేసే వ్యవస్థ ఉందా? లేదనే పెదవి విరుపే మనకు సమాధానంగా నిలుస్తుంది. అందుకే తన పరిధిలో బాలలకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తోంది తులిషా రెడ్డి ఫౌండేషన్. ఉన్నత చదువులే చక్కటి భవిష్యత్ కు మార్గం అని...

Tuesday, September 29, 2015 - 14:43

హైదరాబాద్ : యూపీలో కొన్ని గ్రామ కౌన్సిల్స్ లో అమ్మాయిలు లెగ్గిన్స్ వేసుకోవద్దని, సెల్ ఫోన్స్ వాడవద్దని ఆంక్షలు పెట్టారు. సమాంజనంలో మన చుట్టూ వున్నఅమ్మాయిల పై కూడా అనేక ఆంక్షలు విధిస్తున్నారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు? సమస్యలు ఎదుర్కోవడటానికి మహిళలంతా ఐక్యంగా స్పందించాల్సిన అవసరం లేదా? మహిళలను...

Pages

Don't Miss