మానవి

Thursday, August 27, 2015 - 15:45

ఆకసంలో సగం.. అవనిలో సగం.. సమాజంలో సగం.. ఓటర్లలో సగం... అంతటా సగం.. అన్నిటా సగం... మరి ఆ సగానికి భద్రమైన చోటు ఉందా? ఆ సగం మనుగడకు భరోసా ఉందా? ఆ సగాన్ని సాటి మనుషులుగా బతకనిస్తున్నామా? లేదు.. ఆ పరిస్థితి లేనే లేదు అంటున్న నివేదిక మన ముందుంది.
మహిళలకు అగౌరవం..
ఏ విభాగంలోనైనా ముందున్నామంటే మనం చక్కటి అభివృద్ధి సాధిస్తున్నామని గర్వ పడొచ్చు. ఉత్సాహంతో...

Wednesday, August 26, 2015 - 14:41

హెచ్ఐవి..1976 హెచ్ఐవీ ఉందని మద్రాసులో గుర్తించడం జరిగిందని న్యాయవాది పార్వతి పేర్కొన్నారు. టెన్ టివిలో మానవి 'మై రైట్' కార్యక్రమంలో హెచ్ఐవి బాధితులకు ఎలాంటి హక్కులున్నాయనే దానిపై ఆమె విశ్లేషించారు. ఏ రోగాలు వచ్చినా ధైర్యంతో చెప్పగలరని, సాంఘీక బహిష్కరణకు గురవుతున్నారన్నారు. ఎవరూ కూడా ఆమోదించడం జరగడం లేదని, ఆసుపత్రుల్లో చికిత్స చేయడానికి కూడా నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు....

Tuesday, August 25, 2015 - 17:45

మహిళల భద్రత కోసం, వారిని గౌరవంగా చూసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మహిళలకు రక్షణ దొరుకుతుందా అంటే లేదని చెప్పాలి. ప్రస్తుతం సమాజంంలో మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమాజం వారిని ఏ విధంగా చూస్తుంది. ఎటువంటి మార్పు రావాల్సి ఉంది అనే అంశంపై వేదిక చర్చను చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో ఉమెన్ కౌన్సిల్ మెంబర్ అండ్ కార్పొరేట్ మేనేజర్ చిత్ర రాజన్, వియ్...

Monday, August 24, 2015 - 19:19

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహ సందర్భం ప్రత్యేకం. అంతటి ప్రత్యేక సందర్భానికి వీలైనంత ఆడంబరంగా రెడీ అవటానికి అమ్మాయిలు ఇష్టం చూపుతారు. అలాంటి వారి కోసం వన్ గ్రాం గోల్డ్ లో బ్రైడల్ వేర్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చింది ఇవాళ్టి సొగసు.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, August 24, 2015 - 15:17

చుట్టూ జరుగుతున్న అనేక ఘటనలు మనకు అనేక అనుభవాలను పంచుతాయి. ఆ అనుభవాలు కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలాంటి ఆలోచనలు కొత్త కార్యచరణకు శ్రీకారం చుడతాయి. అవే ఆలోచనలు నలుగురిలో భిన్నంగా నిలబెడతాయి. అలా నలుగురికీ భిన్నంగా ఆలోచిస్తూ మరో నలుగురికి చేయూతనందిస్తున్న అతివ కథనంతో ఇవాళ్టి స్ఫూర్తి మీ ముందుకు వచ్చింది.
వృద్ధుల కళ్లల్లో వెలుగులు
జీవితం చాలా...

Friday, August 21, 2015 - 14:54

హైదరాబాద్ : ఒకప్పుడు టీనేజ్ పిల్లలకే పరిమితమైన హాఫ్ సారీస్ ఇప్పుడు మధ్య వయస్సు వనితలకు కూడా ఫేవరేట్ గా మారింది. అలాంటి హాఫ్ సారీస్ లేటెస్ట్ కలెక్షన్ ను సొగసు దిల్ షుక్ నగర్ లో ఉన్న అర్హమ్ క్రియేషన్స్ మన ముందుకు తెచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Friday, August 21, 2015 - 14:48

హైదరాబాద్: జాతీయ నేరాల నమోదు సంస్థ తాజా నివేదిక తెలుగు రాష్ట్రాలలో మహిళల భద్రతకు సవాల్ విసురుతోంది. అనేక విషయాలలో ముందున్నామని చెప్పుకునే మనం మహిళలను అగౌరవంగా చూసే విషయంలోనూ ముందే ఉన్నామని మరో సారి రుజువయ్యింది.

స్త్రీ, పురుష సమానత్వం కోసం...

ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల వివక్షను తొలగించి స్త్రీ, పురుష సమానత్వం కోసం ఐక్యరాజ్య...

Thursday, August 20, 2015 - 15:03

హైదరాబాద్ : ప్రకృతి పరంగా మహిళల్లో చోటుచేసుకునే రుతు స్రావ ప్రక్రియలో ఒక్కో వయస్సు వారికి ఒక్కో సమస్య బాధిస్తుంటుంది. మరి ఈ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలున్నాయో ఇవాళ్టి మానవి 'హెల్త్ కేర్' లో డాక్టర్ నర్మద సలహాలు సూచనలు తెలియజేశారు. మరి మీరు కూడా తెలసుకోవాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Thursday, August 20, 2015 - 15:02

సంస్కృతి, సంప్రదాయాల పేరుతో సమాజంలో మహిళలను అణగదొక్కే పరిస్థితి ఎన్నో శతాబ్దాల పాటు నిరంతరాయంగా కొనసాగింది. ఈ స్థితి నుండి ఆడపిల్లలను బయటకు తీసుకొచ్చి స్వశక్తితో ఎదిగేందుకు కావలసిన పరిస్థితులను కల్పించేందుకు మొదలైన సంస్థ కస్తూర్భా గాంధీ స్మారక కేంద్రం.

స్వశక్తితో వారి కాళ్ళపై వారు నిలబడేందుకు...

ఆపదలో ఉన్న ఆడపిల్లలను చేరదీసి, వారికి...

Wednesday, August 19, 2015 - 14:48

హైదరాబాద్ : వీలునామా అంటే ఏమిటి? వీలునామా ఏవిధంగా రాయాలి? వీలునామా రాసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలపై 'మై రైట్' కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. అంతే కాకుండా పలు అంశాలపై న్యాయ సలహాలు, సూచనలు అందించారు. పార్వతి ఏఏ అంశాలపై చర్చించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Tuesday, August 18, 2015 - 15:55

హైదరాబాద్: ప్రకృతి సహజంగా మహిళలు, పురుషుల్లో మార్పులు సహజం. పిల్లల కౌమార దశలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటూ వుంటాయి. అమ్మాయిలకు ఈ దశలో రుతుస్రావ ప్రక్రియ మొదలౌతుంది. అయితే ఈ దశలో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన శానిటరీ నాప్కిన్స్ ఎంతో అవసరం. కానీ పేదరికం, అవగాహనా లోపం కారణంగా చాలా మంది అపరిశుభ్రమైన పద్దతులను అవలంభిస్తున్నారు. ఇది అమ్మాయిల భవిష్యత్, ఆరోగ్యంపై...

Monday, August 17, 2015 - 20:54

అందరూ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ నే ఫాలో అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్, ట్రెండ్స్ ని అప్ డేట్ అవుతున్నారు. ఓన్లీ చీరలు.. డ్రెస్సులే కాదు.. ఇల్లు కూడా అంతే ట్రెండీగా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే మీతో పాటు.. మీ ఇంటిని కూడా ట్రెండీగా మార్చుకునేందుకు మంచి డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిస్తోంది.. ఇవాళ్టి మీ సొగసు. ఆ.. వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, August 17, 2015 - 20:52

సరికొత్త ట్రెండ్స్ తో పాటు, వైవిధ్యభరితమైన డిజైన్స్ ను పరిచయం చేస్తూ ఎప్పటికప్పుడు నూతనత్వంతో ముందుకు దూసుకుపోయే వ్యాపార రంగం వస్త్ర ప్రపంచం. అలాంటి ఈ రంగంలో ఎంత పోటీ ఉంటుందో అవకాశాలు అంతే ఎక్కువగా ఉంటాయి. సృజనాత్మకతతో, సరికొత్త ట్రెండ్స్ పై అవగాహనతో, స్వయం ఉపాధి పొందుతున్న ఓ అతివ వ్యాపార అనుభవాలను మీ ముందుకు తెచ్చింది ఇవాళ్టి స్ఫూర్తి.
ఉపాధివైపు అడుగులు...

Friday, August 14, 2015 - 18:13

వాడ్రోబ్ లో ఎంత కలెక్షన్ ఉన్నప్పటికీ ఇంకా కొత్తగా ఏమోచ్చాయని వెతుక్కునే ప్రయత్నం చేసేందుకు అతివలు ఆసక్తి చూపుతారు. అంతే కాదు ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవటంలో వారే ముందు వరుసలో ఉంటారు. అలాంటి వారి కోసం లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి సొగసు.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, August 14, 2015 - 17:54

పసితనానికి, యవ్వనానికి మధ్య దశ టీనేజ్. ఎన్నో భావోద్వేగాలు చుట్టు ముట్టే ఈ వయస్సులో ఎంతో మంది పిల్లలు హింసకు పాల్పడుతున్నారు. మరి ఈ ధోరణి ఎందుకు అలవడుతుంది? ఈ స్థితిని ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు సరియైన దిశలో మార్గదర్శకాన్నివ్వచ్చో ఇవాళ్టి నిర్భయలో తెలుసుకుందాం.. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, August 14, 2015 - 17:52

మహిళల రక్షణకు కొత్త వ్యూహం
రాష్ట్ర రాజధానిలో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన షీ టీమ్స్ తమ పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ట్రైన్స్ లో కూడా మహిళల రక్షణ కోసం కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది.
శ్రేయా గోషాల్ కు మరో పురస్కారం
యువ నేపథ్యగాయనిగా కొద్ది కాలంలోనే ఎంతో మంది అభిమానులను...

Thursday, August 13, 2015 - 15:32

కోటి ఆశలతో, ఉన్నత లక్ష్యాలతో కాలేజీలలో చేరిన విద్యార్థులు భయం భయంగా అడుగులేస్తున్నారు. ర్యాగింగ్ పేరుతో ఎవరు ఎలా కాటేస్తారో అని కలవర పడుతున్నారు. సీనియర్స్ ను ఎదుర్కోలేక, ఉన్నత చదువులను వదులుకోలేక విద్యార్థులు సతమతమవుతున్నారు. సున్నిత మనస్కులైతే జీవితాలనే అంతం చేసుకుంటున్న స్థితి నెలకొంది. ఎందుకిలా? కాలేజీలలో ఏం జరుగుతోంది? విద్యార్థుల ఆశలను మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం ఎవరు...

Wednesday, August 12, 2015 - 14:58

హిందూ వివాహం చట్టం సెక్షన్ 13 ప్రకారం విడాకులు తీసుకుంటున్నారు. దీనికి ఆధారాలు చూపెట్టాలి. అనేక గ్రౌండ్స్ ఉన్నాయి. అందులో శారీరక..మానసికం కూర్రత్వం. ఒకటి. భార్య పట్ల భర్త..భర్త పట్ల భార్య ఎలాంటి క్రూరత్వం చేస్తున్నారో పరిగణిస్తారు. ఇందులో అనేక రకాలైన హింసలుంటాయి. శారీరక..మానసిక..క్రూరత్వంపై టెన్ టివి 'మై రైట్' కార్యక్రమంలో లాయర్ పార్వతి విశ్లేషించారు. అలాగే పలు న్యాయపరమైన...

Tuesday, August 11, 2015 - 16:40

మహిళలను చూసే దృక్కోణం మారాలని వక్తలు అన్నారు. సమాజం.. మహిళలు.. చిన్నచూపు అనే అంశంపై మానవి నిర్వహించిన చర్చ వేదిక కార్యక్రమంలో సామాజిక కార్యకర్తల దేవీ, పిఓడబ్ల్యు నేత ఝాన్సీ పాల్గొని, మాట్లాడారు. మహిళలను వ్యక్తిత్వం ఉన్న మనుషులుగా గుర్తించాలని కోరారు. మహిళలను వస్తువుగా చూసే భావజాలంలో మార్పు రావాలన్నారు. మహిళల వస్త్రధారణను వ్యాఖ్యానించటం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం...

Monday, August 10, 2015 - 17:31

సందర్భానికి తగినట్లుగా రెడీ అవటంలో మహిళలెప్పుడూ ప్రత్యేకమే. వారి కోసం డిజైనర్స్ ఎప్పటికప్పుడు ఎన్నో వెరైటీస్ ను అందుబాటులో తెస్తున్నారు. అలాంటి డిజైనర్స్ లో ఒకరు తనూజ. తన ఆసక్తి, అభిరుచిలను సమ్మిళితం చేసి టెర్రకోట జ్యువెల్లరీని తయారుచేసి చూపించేందుకు ఇవాళ్టి సొగసులో సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..
 

Monday, August 10, 2015 - 17:29

పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు, వ్యాపార రంగంలోనూ సత్తా చాటుకుంటున్నారు. వైవిధ్యమైన ఉత్పత్తులతో, సరికొత్త ఆలోచనతో తమదైన ప్రత్యకతను సాధించుకుంటున్నారు. పర్యావరణ హితంగా, పోషకాహార మిళితంగా సరికొత్త ప్రాడెక్ట్ తో మార్కెట్ లోకి ప్రవేశించిన మహిళా వ్యాపార వేత్త అనుభవాలతో మీ ముందుకొచ్చింది ఇవాళ్టి స్పూర్తి.
వ్యాపారమంటే ఆటుపోటులతో పయనం......

Friday, August 7, 2015 - 17:39

హైదరాబాద్ : శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదని గుర్తించిన ప్రభుత్వాలు ప్రజలను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా పాలిచ్చే తల్లుల కోసం తమిళనాడు ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
మన దేశంలో శాస్త్ర పారిశ్రామిక మండలి నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. మొత్తం పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం...

Friday, August 7, 2015 - 14:57

హైదరాబాద్: ఇంటి అలంకరణ విషయంలో మారుతున్న ట్రెండ్స్ కర్టెన్స్ ప్రాధాన్యతను పెంచుతున్నాయి. ఇంటీరియర్ లో కర్టెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. అలాంటి లేటెస్ట్ కర్టెన్ వెరైటీస్ తో కొత్తపేట పివి మార్కెట్లో ఉన్న జ్యోతి హ్యాండ్ లూమ్స్ సొగసు వచ్చింది. మరి మీరు కూడా చూడాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Friday, August 7, 2015 - 14:48

హైదరాబాద్ :మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎంతో మంది జీవితాల్లో ఎన్నో మార్పులను తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఒంటరితనం, ముఖ్యంగా ఒంటరి మహిళలు సమాజంలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవటం మనం చూస్తుంటాం. మరి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలను ఎలా నివారించాలి?  పెద్ద వయసు మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి ఎందుకిలా? ఎలాంటి స్థితిలో మహిళలు వివిధ...

Thursday, August 6, 2015 - 14:43

హైదరాబాద్: మనదేశంలోనూ 1992 లో శిశు ఆహార చట్టానికి రూపకల్పన జరిగి, 1993 ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చింది. తల్లిపాల సంస్కృతి అంతరించడానికి ఆధునిక ఆసుపత్రులు కొంతవరకు దో్హదం చేశాయి. గ్రామాల్లో, ఇళ్లల్లో కాన్పులు అయ్యే స్త్రీలు ఎక్కువగా తల్లిపాలు పట్టడం, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో కాన్పు అయ్యే స్త్రీలు ఎక్కువగా పోతపాలు పట్టడం జరుగుతోంది. ఈ విషయమై...

Wednesday, August 5, 2015 - 14:47

హైదరాబాద్:పెళ్లి తరువాత భార్యాభర్తలు అనివార్య కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకోవడాన్ని విడాకులు గా పిలుస్తారు. హిందూ వివాహ చట్టంలో అసలు విడాకులు తీసుకోవాలంటే ఎలాంటి చట్టాలు వున్నాయి? విడాకులు ఇవ్వాలంటే ఏఏ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఇలాంటి అంశాలను 'మై రైట్' కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పార్వతి వివరించారు. పూర్తి సమాచారం...

Tuesday, August 4, 2015 - 18:08

జోగిని వ్యవస్థను రద్దు చేయాలని వక్తలు తెలిపారు. బోనాలు...రంగం.. జోగిని వ్యవస్థ.. అనే అంశంపై టెన్ టివి మానవి వేదిక చర్చా కార్యక్రమంలో రచయిత్రి, పరిశోధకురాలు గోగు శ్యామల, జోగిని వ్యవస్థ వ్యతిరేకపోరాట సంఘటన్ కన్వీనర్.. గ్రేస్ నిర్మల పాల్గొని, మాట్లాడారు. బోనాల పండుగలో రంగం అనేది భవిష్యవాణి. స్త్రీలు భవిష్యవాణి చెప్పడం గొప్ప విషయమన్నారు. గ్రామాల్లో ఒక మతం చేసే క్రతువు బోనాలు...

Pages

Don't Miss