వీళ్లు పోలీసులేనా? అసలు మనుషులేనా?: మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు

Submitted on 13 August 2019
Madhya Pradesh: Tribals made to drink urine in custody, four policemen suspended

ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసులు అంటూ ఓవైపు దేశవ్యాప్తంగా పోలీసులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే మరోవైపు మాత్రం నేరస్తులు పేరుతో దారుణంగా పోలీసులు దారుణంగా ప్రవర్తించే పరిస్థితులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని నన్‌పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన పోలీసులపై గౌరవం తగ్గించేలా ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసు విషయంలో నన్‌పూర్‌కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  పోలీసు అధికారిపై దాడి చేయడంతో యువకులను అరెస్టు చేశారు. ఐపిసి సెక్షన్ 353 (ప్రభుత్వ ఉద్యోగిని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించచడం లేదా క్రిమినల్ ఫోర్స్) కింద వారిపై కేసు నమోదు చేశారు.

ఐదుగురు గిరిజన యువకులలో ఒకరి చెల్లెలిని మరో యువకుడు ఏడిపించగా.. యువకులు అతడిని బెదిరిస్తుండగా వచ్చిన పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే గొడవ జరిగింది. అయితే స్టేషన్ కు తీసుకుని వెళ్లిన తర్వాత సదరు పోలీసులు కక్ష పూరితంగా యువకులను దారుణంగా కొట్టారు. ఖాకీలు తమ పవర్ ని ఉపయోగించి దారుణంగా హింసించారు. కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా వేదించారు. నీళ్లు ఇవ్వమని అడిగితే మూత్రం తాగించి మానవత్వం లేకుండా ప్రవర్తించారు. తీవ్రంగా అవమానించి గిరిజన యువకులను చిత్ర హింసలకు గురిచేశారు.

ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎస్పీ విపుల్‌ శ్రీవాస్తవ.. మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని యువకులను పోలీసు సిబ్బంది కొట్టడం నిజమని తేలిందని, ఇటువంటి చర్యకు పాల్పడిన నలుగురు పోలీసులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. దీనిపై మరింత విచారణ జరిపి చట్టపరమమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాయపడ్డ ఐదుగురు గిరిజన యువకులకు స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. 

Madhya Pradesh
tribals
drink urine
custody
policemen suspended

మరిన్ని వార్తలు