లెజెండరీ క్రికెటర్‌తో మహేష్ బాబు

Submitted on 13 June 2019
Mahesh Babu Meets Legendary Cricketer Andy Roberts

మహర్షి ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా విదేశాల్లోని వివిధ ప్రదేశాల్లో భార్య, పిల్లలతో కలిసి మహేష్ సరదాగా గడుపుతున్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.

రీసెంట్‌గా ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో సందడి చేసిన మహేష్.. ఇప్పుడు వెటరన్ వెస్టిండీస్ క్రికెటర్, ఆండీ రాబర్ట్స్‌ను కలిసాడు. ఆయనతో కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

'విత్ ది లెజెండ్ హిమ్‌సెల్ఫ్, ఆండీ రాబర్ట్స్.. హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్' అంటూ షేర్ చేసాడు.. మహేష్ ఈ పిక్‌లో క్లీన్ షేవ్‌తో మరింత యంగ్‌గా కనిపిస్తున్నాడు.. మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించబోయే సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్ షూటింగ్ జూన్ 20 నుండి కశ్మీర్‌లో ప్రారంభం కానుంది.

Mahesh Babu
Andy Roberts

మరిన్ని వార్తలు