డాక్టర్లకు దీదీ వార్నింగ్ : 4 గంటల్లో డ్యూటీలో చేరాలి 

Submitted on 13 June 2019
Mamata Banerjee Warning for SSKM Medical college Junior Doctors: Join Duty within Four hrs

జూనియర్‌ డాక్టర్లకు సీఎం మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. నిరసనను విరమించి.. నాలుగు గంటల్లోగా విధుల్లో చేరాలని హెచ్చరించారు. ఆదేశాలను ధిక్కరిస్తూ.. నిరసన కొనసాగించే డాక్టర్లు.. వెంటనే ఆస్పత్రి నుంచి వెళ్లిపోవచ్చని సూచించారు. అలాంటి వారు అవసరం కూడా లేదని స్పష్టం చేశారామె. విధుల్లో చేరని డాక్టర్లకు ఆస్పత్రితో సంబంధం ఉండదని కూడా హెచ్చరించారు. లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

డ్యూటీ చేస్తూ ఎంతోమంది పోలీసులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారనీ.. మీలాగే వారు ఏమన్నా ధర్నాలు చేస్తున్నారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి నిరసనలను పట్టించుకోబోమని డాక్టర్లకు మమతా వార్నింగ్ ఇచ్చారు. 

రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఓ పేషెంట్ మృతి చెందాడు. మృతుడి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. కొందరు డాక్టర్లు గాయపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేస్తూ మూడు రోజుల నుంచి ఆందోళన చేపట్టారు డాక్టర్లు. డిమాండ్లను పోస్టర్ల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశామని.. న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్ల దగ్గరకు వచ్చారు సీఎం మమత. సీఎంను చూసిన వెంటనే డాక్టర్లు ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ల నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి అందరూ డ్యూటీలో చేరాలని హెచ్చరించారు. 

CM
Mamata Banerjee
Warning
SSKM
Medical College
Junior Doctors
Join Duty
West Bengal

మరిన్ని వార్తలు