అంబులెన్స్‌ ఇవ్వలేదు: చనిపోయిన కొడుకును మోసుకుని వెళ్లిన తండ్రి

Submitted on 25 June 2019
Man carries baby's body on shoulders as hospital denies ambulance in Nalanda

సభ్య సమాజం తలదించుకునేలా మానవత్వం అనేదే భూమిపై లేదు అని అనుకునే విధంగా బీహార్‌లో జరిగిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. దేశవ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ఇంకా మనుషులు మారట్లేదు. వివరాల్లోకి వెళ్తే.. బీహర్‌లో ఈ గుండె తరుక్కుపోయే ఘటన చోటుచేసుకుంది. బీహర్‌లోని నలందలో సదర్ సర్కార్ ఆసుపత్రిలో కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతూ ఓ బాలుడు చేరాడు. చికిత్స పొందుతూనే ఆ బాలుడు చనిపోయాడు.

అయితే అక్కడి సిబ్బంది మాత్రం బాలుడు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ అడిగితే లేదని కఠినంగా చెప్పటంతో కొడుకు పోయిన బాధలోనే భుజాలపై మోసుకుంటూ కొడుకును తీసుకుని వెళ్లాడు తండ్రి.  తమ వద్ద అంబులెన్స్ అందుబాటులో లేదని సిబ్బంది చెప్పడంతో తండ్రి చేసేదేం లేక బిడ్డ శవాన్ని భుజాలపై మోసుకుని తీసుకెళ్లాడు తండ్రి. పక్కనున్న వారు కూడా ఫోటోలు తీశారే తప్ప సాయం చేస్తామని ముందుకురాలేదు. కాగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఘటన చివరికి జిల్లా కలెక్టర్ యోగేంద్ర సింగ్ దృష్టికి రాగా.. ఘటనపై విచారణ జరిపిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని, తప్పు చేస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీహర్‌లో మెదడు వాపు వ్యాధి సోకి 140మంది చిన్నారులు చనిపోగా నలందలో బాలుడి మృతి దేశవ్యాప్తంగా కలచివేస్తోంది. అయితే అంబులెన్స్ ఇవ్వకపోవడంపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

BIHAR
Man in Nalanda
carries body
Child
Ambulance
govt hospital
Yogendra Singh

మరిన్ని వార్తలు