16 ఏళ్ల తర్వాత మరోసారి: మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు

Submitted on 12 July 2019
Man Married for 16 Years Asks For Wedding Certificate, Officials Ask Him to 'Marry Again'

16 ఏళ్లకు మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగితే మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు. ఇది జోక్ కాదు. కేరళలోని మ్యారేజ్ రిజిష్ట్రార్ ఆఫీస్‌లో జరిగిన ఘటన ఇది. బాధితుడు జరిగిన ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కోజికోడ్ జిల్లాలోని ముక్కం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 16ఏళ్ల క్రితం జరిగిన మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ కోసం మధుసూదన్ అనే వ్యక్తి రిక్వెస్ట్ చేశాడు. 27.02.2003న స్పెషల్ మ్యారేజ్(మతాంతర వివాహం) జరిగింది. దాని డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలని జూన్ 19న అడిగాడు. రూల్ ప్రకారం.. అదే రోజు ఇవ్వాల్సి ఉండగా సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకూ నిర్లక్ష్యం చూపించారు. 

దానికి బదులుగా అపహాస్యం చేస్తూ.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం మేం పాత రికార్డులు తిరగేయలేం. నీకు ఈ రోజే కావాలంటే మళ్లీ పెళ్లి చేసుకో ఇప్పుడే ఇస్తామని తెలియజేశాడు. అధికారుల నిర్లక్ష్యాన్ని, ఎగతాళిని సోషల్ మీడియా వేదికగా బాధితుడు బయటపెట్టాడు. 

ఆ ఘటన రాష్ట్ర రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి సుధాకరన్ వరకూ తెలియడంతో రిజిష్ట్రార్ ఆఫీసులోని నలుగురు అధికారులు దేవీ ప్రసాద్, శివరామన్ నాయర్, మోహన్ దాస్, పీబీ రిజేశ్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

16 Years
Wedding Certificate
Marry Again
kerala man


మరిన్ని వార్తలు