తీస్తా ఉంటే వస్తా ఉన్నాయి : ఎయిర్ పోర్ట్ లో ఇతడు చేసిన పనికి నవ్వు ఆగదు

Submitted on 10 July 2019
Man wears 15 shirts to avoid extra baggage fee at a French airport

ఎయిర్ పోర్టుల్లో సాధారణంగా పరిమిత లగేజీకి మాత్రమే అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే.ఒకవేళ ఎక్కువ తీసుకెళ్తే.. అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఓ వ్యక్తి మాత్రం అదనపు చార్జీలు కట్టడం ఎందుకు దండగ అనుకున్నాడో ఏమో.. ఏకంగా బ్యాగ్ ఓపెన్ చేసి అందులోని చొక్కాలన్నీ ధరించాడు. ఎయిర్‌పోర్టులోనే అందరూ చూస్తుండగానే జాన్.. ఆ చొక్కాలు ధరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్రాన్స్‌లోని నైస్ ఎయిర్‌పోర్టులో  జాన్ ఇర్విన్ అనే వ్యక్తి లగేజీ 8 కిలోలు ఎక్కువగా ఉండటంతో.. 8 కిలోల బరువైన చొక్కాలను ధరించాడు. దానివల్ల 96 పౌండ్ల చార్జీని తప్పించుకోగలిగాడు. అంటే మన కరెన్సీలో 8206 రూపాయలు అన్నమాట. అయితే.. మనోడు అన్ని చొక్కాలు ధరించేసరికి ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ సిబ్బంది జాన్‌ను కొంచెం అనుమానంగా చూసి చెక్ చేశారట. షర్ట్స్ అన్నీ విప్పేయాలని చెప్పారట.

మనోడు ఒక్కో చొక్కా విప్పుతుంటే అతడు చొక్కాల్లోపల ఏం దాచాడో అని భయంగా చూశారట. కానీ.. చొక్కాల్లో ఏం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా కాసేపు నవ్వుకొని ఇర్విన్ ను పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.వీడు మూమూలోడు కాదురా బాబోయ్ అంటూ ఫన్నీగా సెటైర్లు వేస్తున్నారు.ఇంత గొప్ప ఐడియా తమరికి ఎలా వచ్చింది సార్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
 

france
Airport
avoid
BAGGAGE
fee
WEAR
15 T-SHIRTS

మరిన్ని వార్తలు