రాజ్ దూత్ - 'మనసున ఏదో ఆశ' లిరికల్ సాంగ్

Submitted on 20 June 2019
Manasuna Manasuna Lyrical Song from Rajdooth

రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా.. 'రాజ్ దూత్' (లిమిటెడ్ ఎడిషన్).. అర్జున్ -కార్తీక్ కలిసి డైరెక్ట్ చేస్తుండగా, లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నాడు. నక్షత్ర హీరోయిన్‌గా పరిచయమవుతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రాజ్ దూత్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

'మనసున మనసున ఏదోఆశ మొదలే ఇవాళ.. కనులకు కనులకు రాదే నిదుర.. అరెరే అనేలా'.. అంటూ సాగే ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినసొంపుగా ఉంది.. ఫ్రెష్‌గా లవ్‌లో పడిన కుర్రాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ పాటరూపంలో చెప్పారు. వరుణ్ సునీల్ ట్యూన్‌కి, కిట్టు లిరిక్స్ రాయగా, సిద్ధార్థ్ మేనన్ చక్కగా పాడాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న రాజ్ దూత్ జూలై 5న రిలీజ్ కానుంది.

కోట, మనోబాలా, రవి వర్మ, సుదర్శన్, వేణు, ప్రియాంక వర్మ, అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : వరుణ్ సునీల్, బ్యాగ్రౌండ్ స్కోర్ : జెబి, కెమెరా : విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయ్ వర్థన్ కావూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : M.S.కుమార్..
 

Megamsh Srihari
Nakshatra
M.L.V.SatyaNarayana
Arjun-Carthyk

మరిన్ని వార్తలు