మనస్విని చంపాలని అనుకోలేదు - వెంకట్

Submitted on 12 July 2019
Manasvi Attack At Dilsukhnagar Venkatesh Face To Face

మనస్వినిపై దాడి చేసిన ప్రేమోన్మాది వెంకట్‌.. హత్య చేయాలన్న ఉద్దేశమే తనకు లేదంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని ఎలా చంపాలనుకుంటాను అని చెబుతున్నాడు. తన వెంట తెచ్చుకున్న కత్తి అమ్మాయిని చంపడానికి కాదు తాను ఆత్మహత్య చేసుకోవడానికే అన్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రేమోన్మాది వెంకటేష్‌ జరిపిన దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటనలో తీవ్రంగా గాయపడిన మనస్విని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన వెంకటేశ్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడితో 10tv మాట్లాడింది. 

2018, నవంబర్‌లో మనస్విని పరిచయం ఏర్పడిందని..కొంతకాలం తర్వాత ప్రేమిస్తున్నట్లు చెప్పినట్లు తెలిపాడు. తాను ఇంట్రస్ట్ చూపించకపోయినా..ఆమెనే ఫోన్ చేసేదన్నాడు. అమ్మాయి చూపించే ఇంట్రస్ట్‌తో..తాను మాట్లాడేవాడినన్నారు. అంతకుముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని..చెప్పిందని తెలిపాడు. తన రూంకు మనస్విని వచ్చేదని..ఒకరోజు ధ్వేషంతో..మరోసారి ప్రేమతో మాట్లాడేదని తెలిపాడు. చివరకు అమ్మాయి లేకపోతే ఎందుకు జీవితం అనుకుని చనిపోవాలని అనుకున్నట్లు వెల్లడించాడు. తమిద్దరి మధ్య గొడవ జరిగిందని..యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందన్నాడు. ఫోన్ తీసుకుని తమ్ముడితో మాట్లాడిందని..అనంతరం ఆమె సృహ కోల్పోయిందన్నారు. 

మరోవైపు మనస్విని గొంతుకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. 70 శాతం కోలుకుందని వైద్యులు తెలిపారు. మనస్విని ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు.. మాట్లాడలేకపోతుందని వైద్యులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో వెంకటేష్‌, మనస్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వెంకటేష్‌ కొంతకాలంగా మనస్వినిని ప్రేమిస్తున్నాడు. ఐతే..మనస్విని మరొక వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానంతో ఆమెతో గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని పిలిపించి ఆమెపై కత్తితో కర్కషంగా దాడి చేశాడు. 

Manasvi
Attack
Dilsukhnagar
Venkatesh


మరిన్ని వార్తలు