మన్మథుడు-2 పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి

Submitted on 16 May 2019
Manmadhudu 2 Portugal Schedule Wrapped Up

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై, నాగార్జున, పి.కిరణ్ నిర్మాణంలో మన్మథుడు-2 తెరకెక్కుతుంది. గతకొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. 32 రోజుల భారీ షెడ్యూల్‌లో నాగ్, రకుల్, లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు షూట్‌లో పాల్గొన్నారు. నాగ్ వర్కౌట్స్ చేస్తున్న పిక్స్, నాగ్, రకుల్ వర్కింగ్ స్టిల్స్‌ రాహుల్ ట్విట్టర్‌లో పోస్ట్ చెయ్యగా, వాటికి మంచి రెస్సాన్స్ వచ్చింది.

రీసెంట్‌గా పోర్చుగల్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నాగ్‌తో సహా మూవీ యూనిట్ అంతా హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. పోర్చుగల్‌‌లో షూటింగ్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వారితో, అక్కడ తమకు కావాల్సిన వసతులు సమకూర్చిన వారితో నాగార్జున ఫోటోలు తీసుకుని, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో అవి వైరల్‌గా మారాయి.

నాగ్, అమల కలిసి తీసుకున్న పిక్ చాలా బాగుంది. ఇప్పటికీ అంతే ఎనర్జిటిక్‌గా, అంతే అందంగా ఉందీ జంట. సమంత, కీర్తి సురేష్ ఈ మూవీలో నటించనున్నారని తెలుస్తుంది. త్వరలో మన్మథుడు 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
 

King Nagarjuna
Rakul Preeth
Rahul Ravindran

మరిన్ని వార్తలు