మన్మథుడు 2 - రొమాన్స్‌లో రెచ్చిపోయాడు

Submitted on 13 June 2019
Manmadhudu 2 Teaser

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా.. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న మూవీ, మన్మథుడు 2.. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. మన్మథుడు 2కి 'హి లవ్స్ ఉమెన్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. 'నీకు షటర్లు మూసేసి, దుకాణం సర్దేసే వయసొచ్చింది, మరింత అందంగా పుట్టి, ఏం ప్రయోజనం ఉండదురా'.. అంటూ నాగార్జున గురించి దేవదర్శిని చెప్పే డైలాగుతో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది..

వయసు దాటిపోయాక పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తికి.. ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఫన్నీగా చూపించారు. ఆ మన్మథుడు అమ్మాయిలకు ఆమడ దూరంలో ఉంటే, ఈ మన్మథుడు మాత్రం మల్లెపువ్వులా నలిపేస్తున్నాడు అమ్మాయిల్ని.. నాగ్ కుర్రాడిలా కనిపించడమే కాదు, కుర్రాళ్లు అసూయపడేలా రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసాడు.. ఇక టీజర్ చివర్లో గాగుల్స్ క్లీన్ చేస్తూ.. 'ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్'.. అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.. ఎమ్. సుకుమార్ ఫోటోగ్రఫీ, పోర్చుగల్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్, చైతన్ భరద్వాజ్ ఆర్ఆర్ బాగున్నాయి.. సమంత, కీర్తి సురేష్ గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారు.

లక్ష్మీ, రావు రమేష్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు నటించిన మన్మథుడు 2, ఆగష్టు 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. డైలాగ్స్ : కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, రాహుల్ రవీంద్రన్, సినిమాటోగ్రఫీ : ఎమ్. సుకుమార్, ఎడిటర్స్ : చోటా కె ప్రసాద్, బొంతల నాగేశ్వర రెడ్డి, మ్యూజిక్ : చైతన్ భరద్వాజ్..

Akkineni Nagarjuna
Rakul Preet Singh
Chaitan Bharadwaj
Rahul Ravindran

మరిన్ని వార్తలు