మావోల ఘాతుకం : టీఆర్ఎస్ లీడర్ హత్య

Submitted on 12 July 2019
maoists killed trs ex mptc at Khammam district

ఖమ్మం : ఖమ్మం జిల్లా చర్ల మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్‌ నేత, నల్లూరి  శ్రీనివాస రావును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. జూలై 8 వ తేదీన శ్రీనివాస రావును మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. పోలీసు ఇన్‌పార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో మావోలు శ్రీనివాసరావును కాల్చి చంపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని ఎర్రంపాడు, పొట్టెపాడు గ్రామాల మధ్య శ్రీనివాస రావు  మృతదేహం లభ్యమైంది. మృతదేహం దగ్గర చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి  శారద పేరుతో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు.
 

"నల్లూరి శ్రీనువాసరావును ఇన్‌ఫార్మర్‌ అయినందుకే ఖతం చేశాం అని మవోయిస్టులు పేర్కోన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులతో కలిసి పార్టీని నిర్మూలించడానికి, ఆదివాసి గ్రామాలలో ఇన్‌ఫార్మర్స్‌గా తయారు చేస్తున్నాడు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు చేరవేయడం, ప్రజా సంఘాల వాళ్లను అరెస్టులు చేయించడం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఆదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల ప్రోద్భలంతో అక్రమంగా గుంజుకున్నాడు ప్రశ్నించిన వాళ్లను అరెస్టులు చేయిస్తున్నాడని మావోయిస్టులు లేఖలో పేర్కోన్నారు. SIB వాళ్లతో కలిసి ఆదివాసి ప్రజాసంఘాల పేరుతో CPI మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాడని,  ఆదివాసీలకు వారికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలవడంతో నల్లూరి శ్రీనువాసరావును ఖతం చేశాం.. విప్లవాభివందనాలతో.. కార్యదర్శి ...శారద అనే పేరుతో లేఖ విడుదల చేశారు. 
 

జూలై 8న కిడ్నాప్ చేసిన  శ్రీనివాస రావును విడుదల చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.  కానీ అతడు ఇంటికి రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీనివాసరావు మృతదేహం దొరికింది. కాగా...తనకు అన్నల మీద నమ్మకం ఉందని.. తన భర్త ఏ తప్పు చేయలేదని.. ఆయనను  వదిలేయాలని మావోయిస్టులను వేడుకుంది శ్రీనివాసరావు భార్య.  తన భర్త ఏమైనా తప్పు చేస్తే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పింది. చేతులు ఎత్తి దండం పెట్టింది. అయినా దుర్గ మొరను మావోయిస్టులు ఆలకించలేదు.
maoists letter

 

Telangana
Maoists
murder
Khamma district
Charla MPTC


మరిన్ని వార్తలు