కిలో చెత్తకు భోజనం, అరకిలోకి టిఫిన్: అంబికాపూర్ మున్సిపాలిటి పథకం 

Submitted on 16 July 2019
Meals per kilo west, half a kilo  tiffin..Municipality of Ambikapur ‘Garbage Cafe’ Scheme

ప్లాస్టిక్ భూతానికి అడ్డుకట్టు వేయాలంటు పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్  వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్లాస్టిక్ ను పెద్దగా పట్టించుకోవటంలేదనే చెప్పాలి. కానీ చిన్న రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ మున్సిపాలిటీ మాత్రం దీనిపై దృష్టి పెట్టింది. ఓ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. 
 

ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ మున్సిపాలిటీ దేశంలో తొలిసారిగా ‘గార్బెజ్ కెఫే’ పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకాన్ని మేయర్ డాక్టర్ అజయ్ తిర్కీ  ప్రారంభించారు. ఈ పథకం కింద చెత్తను తీసుకుని  ఆహారాన్ని అందిస్తున్నారు. కిలో చెత్తను సేకరించి మున్సిపల్ కార్యాలయంలో అందజేసిన వారికి కడుపు నిండా భోజనం..అర కిలో చెత్తకు అల్పాహారం అంటే టిఫిన్ అందించనున్నారు. దీంతో పేదలకు కడుపునిండా భోజనం దొరుకుతోంది. అలాగే నగరంలో చెత్త సేకరించేవారు పెరుగుతున్నారు. కాగా  పారిశుద్ధ్య ప్రచారంలో అంబికాపూర్ దేశంలో రెండవ అతిపెద్దది కావటం విశేషం.

అంబికాపూర్ మున్సిపాలిటీ కొత్తగా రూపొందించిన బడ్జెట్‌లో ‘గార్బెజ్ కెఫే’ పథకానికి ఐదున్నర లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా మేయర్ అజయ్ తిర్కి మాట్లాడుతూ ‘గార్బేజ్ కెఫె’ పథకాన్ని దేశంలో తొలిసారిగా అంబికాపూర్‌లో ప్రారంభమయ్యిందన్నారు.

Chhattisgarh
Ambikapur
Municipality
Garbage Cafe’ Scheme
kilo west
MEALS
half kilo tiffin

మరిన్ని వార్తలు