మీడియా వార్తలు నిజం కాదు : బాధ్యత తెలుసు,ఓటు వేశా

14:08 - December 7, 2018

హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు పరాభవం ఎదురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నేరుగా బూత్ లోకి వెళ్తున్న ఆయనను ఓటర్లు అడ్డుకున్నారని, నేరుగా బూత్ లోకి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారనే వార్తలు వెలువడ్డాయి. అయితే, ఆ వార్తల్లో వాస్తవం లేదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే తిరిగి వెళ్లిపోయారనే వార్తలపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. పూర్తిగా తెలుసుకోకుండా మీడియా వార్తలను ఎలా ప్రసారం చేస్తుందంటు ప్రశ్నించారు. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను తప్ప క్యూలో నిలబడలేక కాదని తెలిపారు. క్యూలో నిలుచున్న తనను ఎవరూ అభ్యంతరపెట్టలేదనీ..బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కరం నాకు లేదన్నారు దర్శకేంద్రుడు. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయమని సూచించారు రాఘవేంద్రరావు.
 

Don't Miss