OMG: ఒళ్లంతా బంగారమే!

Submitted on 1 July 2019
Meet the new Gold Man of India: Prashant Laxman Sapkal

సాధారణం గా బంగారాన్ని ఎక్కువ ఆడవాళ్లు ఇష్టపడతారు. మగవారు కూడా ఇష్ట పడతారు కానీ ఎదో రెండు ఉంగరాలు, ఒక చైన్, బ్రేస్ లైట్ వరకు ఓకే..! ఇతను మాత్రం ఒళ్లంతా బంగారు నగలు వేసుకుని.. నడిచొచ్చే నగల దుకాణంలా కనిపిస్తున్న ఈ గోల్డ్ మాన్ పేరు ప్రశాంత్ లక్ష్మణ్. అసలు ఇతను ఎవరూ..? ఇతని బంగారం వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందామా...?

సాధారణంగా ఒక్క బంగారు నగ ఉంటేనే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒళ్లంతా బంగారు నగలు ధరించిన ఇతను ఎలా ఫీల్ అవ్వాలి. మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రశాంత్ లక్ష్మణ్ మన లాగే కామన్ మేన్. కానీ అతనికి చిన్నపటి నుంచి బంగారం అంటే విపరీతమైన పిచ్చి. ఎప్పటికైనా ఒళ్లంతా బంగారు నగలు వేసుకోవాలని కలలు కనేవాడు. కలలు కనడం మాత్రమే కాదు..ఆ కలలను నిజం చేసుకున్నాడు. ఇప్పుడు అతను వేసుకున్న నగలు, ఆర్నమెంట్స్ చూస్తే మతి పోవాల్సిందే. 

ప్రస్తుతం లక్ష్మణ్ సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. దాంతో పాటూ NSS ఫర్ పూర్ పీపుల్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా నడుపుతున్నాడు. లక్ష్మణ్ రోజూ దాదాపు 5 కేజీల బంగారం నగలు ధరిస్తాడు. అతని రియాల్టీ అండ్ ఫైనాన్స్ బిజినెస్ లాభాల్లో సాగుతోంది. అతనికి బంగారు నగలు ధరించడమంటే చాలా ఇష్టమట. బంగారం అంటే ఎందుకు అంత ప్రేమ అని అడిగితే... చిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ గోల్డ్ అంటే చాలా పిచ్చి ..ఒళ్లంతా బంగారు నగలు వేసుకోవాలనేది నా డ్రీమ్ అని చెబుతున్నాడు.

2018 నుంచీ లక్ష్మణ్ ఇలా గోల్డ్ ఆర్నమెంట్స్ ధరిస్తున్నాడు. అంతేకాదు పేదవాళ్లు తమ లక్ష్యాలు చేరుకునేలా చెయ్యడమే తన లక్ష్యం అంటున్నాడు. లక్ష్మణ్ తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చుట్టుపక్కల పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు. అతనికి చాలా గోల్డ్ రింగ్స్, గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు లక్ష్మణ్ వేసుకునే స్పోర్ట్స్ షూస్ కూడా బంగారమే. వాటిపై స్పెషల్ ఎట్రాక్షన్ గోల్డ్ స్పైక్స్.

Gold Man
india
Prashant Laxman Sapkal
2019

మరిన్ని వార్తలు