డాక్టర్ల వినూత్ననిరసన...హెల్మెట్ ధరించి పేషెంట్లకు ట్రీట్మెంట్

Submitted on 13 June 2019
Members of Resident Doctors' Association of All India Institute of Medical Sciences (AIIMS) work wearing helmets & bandages

వెస్ట్ బెంగాల్‌ లో మెడికల్ డాక్టర్లపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపారు వైద్యులు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు తలకు హెల్మెట్లు ధరించి రోగులకు వైద్యపరీక్షలు చేశారు. బెంగాల్‌ లో డాక్టర్లపై జరుగుతున్న హింసకు నిరసనగా డాక్లర బృందం తలచుట్టూ బ్యాండేజ్‌ కట్టుకుని తమ నిరసన తెలియజేశారు. మేం ఉగ్రవాదులం కాదు..మేము మిమ్మల్ని కాపాడే డాక్టర్స్...డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఆపేయండనే నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. 

రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం ఓ పేషెంట్ మృతి చెందాడు. మృతుడి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడి చేశారు. కొందరు డాక్టర్లు గాయపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు మూడు రోజుల నుంచి ఆందోళన చేపట్టారు.ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్ల దగ్గరకు గురువారం(జూన్-13,2019)సీఎం మమతా బెనర్జీ వచ్చారు. సీఎంను చూసిన వెంటనే డాక్టర్లు ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ల నినాదాలతో ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన విరమించి అందరూ డ్యూటీలో చేరాలని హెచ్చరించారు.


మరిన్ని వార్తలు