హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో సర్వీస్

Submitted on 15 August 2019
Metro link work on IT Hub to Hyderabad airport will begin soon

నేరుగా ఎయిర్‌పోర్టు చేరుకునేందుకు మెట్రో సర్వీస్ సిద్ధం కాబోతుంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెల్లడించారు.  72కి.మీల మెట్రో లైన్‌లో 56కి.మీల వరకూ వాడుకుంటున్నామని, మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ క్రమంలో రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనులు త్వరలో మొదలుకానున్నాయి. 

తొలిదశలో నాగోల్‌-రాయదుర్గం, రెండో దశలో ఎల్బీనగర్-హైటెక్ సిటీ చేపట్టిన మెట్రో సర్వీస్‌లు రెండు మూడు నెలల్లో రాయదుర్గం స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుని నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లభించిందని త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయనిబుధవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. 

ముంబై లాంటి మహానగరాల్లో 70శాతం మెట్రో ప్రయాణం చేస్తుండగా, హైదరాబాద్‌లో 36 శాతం మంది మాత్రమే మెట్రోను వినియోగిస్తున్నారని తెలిపారు. కేపీహెచ్‌బీ నుంచి గచ్చిబౌలి వరకు ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మైండ్‌స్పేస్‌ చౌరస్తా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకూ 30.7 కి.మీ. దూరం ఉంటుంది. ఈ ప్రదేశంపై ఢిల్లీ మెట్రోరైలు సంస్థ పూర్తి ప్రాజెక్టును రూపొందించింది. అయితే సిటీలో ఉన్న మెట్రో సర్వీస్‌లా కాకుండా ఇది ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కాబట్టి ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్‌ ఉండదు. 30కి.మీ పైన ఉన్న దూరంలో మొత్తం 9 స్టేషన్లు ఉండనున్నాయి. రాయదుర్గం, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్‌ వెంట విమానాశ్రయం వరకు ఈ మార్గం ఉంటుంది. 

Metro
IT Hub
Hyderabad airport
Hyderabad

మరిన్ని వార్తలు