ఆగస్టు 21 లాంచ్ : ఇండియాలో Mi A3 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే? 

Submitted on 13 August 2019
Mi A3 India Launch Date Set for August 21, Xiaomi Confirms

చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ నుంచి ఇండియన్ మార్కెట్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Mi A3. అద్భుతమైన ఫీచర్లు.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉంది.  షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మంగళవారం (ఆగస్టు 13) ట్విట్టర్ వేదికగా రివీల్ చేశారు. Mi A3 స్మార్ట్ ఫోన్ రిలీజ్‌ షెడ్యూల్‌కు సంబంధించి చైనీస్ కంపెనీ ఇప్పటికే మీడియా ఇన్విటేషన్లు పంపింది. Mi.in ఇండియా వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

Mi A2 స్మార్ట్ ఫోన్‌తో మార్కెట్లో మంచి సక్సస్ అందుకున్న షియోమీ.. గూగుల్ ఆండ్రాయిడ్ ఒన్ ప్రొగ్రామ్‌తో కంపెనీ నుంచి మూడో స్మార్ట్ ఫోన్ Mi A3 రిలీజ్ చేస్తోంది. ఇందులో Triple Camera సెటప్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. గ్రేడియంట్ ఫినీష్‌తో వస్తోంది. Mi A3లో ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది.
Read Also : Xiaomi Mi Super Sale : స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్లు ఇవే

న్యూఢిల్లీలో ఆగస్టు 21న (మధ్యాహ్నాం 12 గంటల నుంచి) ఇండియాలో Mi A3 స్మార్ట్ ఫోన్ షియోమీ లాంచ్ చేయబోతున్నట్టు జైన్ తన ట్వీట్ లో తెలిపారు.  Mi A3 ఇండియాలో లాంచింగ్ ముందు ఓ టీజర్ వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Mi A3 ధర ఎంతంటే? :
షియోమీ కంపెనీ.. స్పెయిన్‌‌లో జూలై నెలలో Mi A3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ వేరియంట్ (64GB స్టోరేజీ) ప్రారంభ ధర EUR 249.. ఇండియన్ కరెన్సీలో రూ.19వేల 900 వరకు ఉంటుంది. 128GB స్టోరేజీ ఆప్షన్ ప్రారంభ ధర EUR 279 (దేశీయ కరెన్సీలో రూ.22వేల 200 వరకు ఉంటుంది. స్పానీస్ మార్కెట్ మాదిరిగా ఇండియాలో కూడా మార్కెట్ పరంగా Mi A3 ప్రారంభ ధర ప్రకటించే అవకాశం ఉంది. 

3 కలర్లలో Mi A3 : 
* నాట్ జెస్ట్ బ్లూ (Not just Blue)
* మోర్ దెన్ వైట్ (More Than White)
* కైండ్ ఆఫ్ గ్రే (Kind of Gray)

Mi A3 స్పెషిఫికేషన్స్ ఇవే :

*  6.08 అంగుళాల HD + (720x1560 ఫిక్సల్స్) AMOLED డిస్‌ప్లే
* 19.5:9 అస్పెక్ట్ రేషియో, వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ 
* dual-SIM (Nano) 
* ఆక్టా కోర్ క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoC
* 4GB ర్యామ్
* 64GB, 128GB ఇంటర్నల్ స్టోరేజీ 
* ట్రిపుల్ కెమెరా సెటప్ 
* 48MP ప్రైమరీ కెమెరా సెన్సార్ (f/1.7) (రియర్)
* 8MP సెకండరీ కెమెరా (118 డిగ్రీ వైడ్ యాంగిల్ f/1.79లెన్స్) (రియర్)
* 2MP టెర్టియారీ సెన్సార్ డెప్త్ సెన్సింగ్ (రియర్)
* 32MP సెల్ఫీ కెమెరా (f/2.0 లెన్స్) 
* micro SD కార్డ్.. ఎక్స్ ప్యాండబుల్ మెమరీ ఆప్షన్
* ఇన్ డిస్‌ప్లే Fingerprint సెన్సార్
* 4, 030mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్
* 4G VoLTE, Wi-Fi 802.11ac
* Bluetooth v5.0, GPS/ A-GPS
* USB Type-C
* 3.5mm హెడ్ ఫోన్ జాక్ 
* ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ 

Read Also : జియో GigaFiber పోటీగా : Top 7 Broadband డేటా ప్లాన్లు.. ఆఫర్లు ఇవే

Mi A3
india
August 21 Launch
XIAOMI
Triple Camera
Mi A2 

మరిన్ని వార్తలు