జూలై 11 నుంచే సేల్ : మైక్రోమ్యాక్స్ New Android TV వచ్చేసింది

Submitted on 10 July 2019
Micromax launches Android TV Lineup in India

ఇండియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త సిరీస్ ఆండ్రాయిడ్ టీవీ వచ్చేసింది. దేశీయ ఆన్ లైన్ మార్కెట్లలో జూలై 11 నుంచి మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ టీవీ అందుబాటులోకి రానుంది. గూగుల్ సర్టిఫై చేసిన ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీని మూడు మోడల్స్ లో మైక్రోమ్యాక్స్ కంపెనీ లాంచ్ చేసింది.

ఈ మూడింటిలో 16:9 అస్పెక్ట్ రేషియోతో (32, 40, 43)అంగుళాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియాలో ఈ కొత్త టీవీ లైనప్ జూలై 11 నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో సేల్ ప్రారంభం కానుంది. ఆండ్రాయిడ్ టీవీ ప్రారంభ ధర రూ.13వేల 999 నుంచి అందుబాటులో ఉంటుంది. 

కొత్త మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ టీవీతో గూగుల్ ప్లే స్టోర్ యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో మ్యూజిక్, మూవీస్, గేమ్స్ కూడా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీలో క్రోమ్ క్యాస్ట్ ఇన్ బుల్ట్ అయి ఉంటుంది.

వాయిస్ ఎనేబుల్డ్ సెర్చ్ ఆప్షన్ తో కూడిన గూగుల్ అసిస్టెంట్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. కొత్తగా లాంచ్ అయిన మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించి పూర్తి వివరాలు రివీల్ కాలేదు. 

మైక్రోమ్యాక్స్ ఇన్ఫోర్మాటిక్స్ డైరెక్టర్ రోహన్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ సర్టిఫై చేసింది. ఆకర్షణీయ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునే ఉన్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునేవారికి ఇందులోని ఫీచర్లు ఎంతో ఉత్తమంగా ఉంటాయని భావిస్తున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

మైక్రో మ్యాక్స్ పోర్టుపొలియోలో మరో ప్రొడక్టును కూడా లాంచ్ చేసింది. ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ను కేవలం రూ.10వేల 999కే అందిస్తోంది.  

Micromax
Android TV
TV Lineup
Micromax Android TV
fully automatic
top loading
washing machine 


మరిన్ని వార్తలు