బాబు ఎందుకు భయం : ఐదేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి - మంత్రి అనీల్ కుమార్

Submitted on 12 June 2019
minister anil kumar yadav press meet ap projects

మాజీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని..లెక్కలు తనిఖీ చేస్తుంటే బాబు ఎందుకు భయపడుతున్నారని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో ఒక్క మేజర్ ప్రాజెక్టును ప్రారంభించారా ? అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాల్లో జలయజ్ఞం కింద ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజల్లో లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని..అభివృద్ధి ఎక్కడా కుంటుపడదన్నారు. జూన్ 12వ తేదీ బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ప్రభుత్వం వచ్చి 13 రోజుల్లోనే..పలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులపై ఓ కమిటీ వేస్తే బాబుకు ఎందుకు భయం...జ్యుడిషయల్ ద్వారా టెండర్ల విధానం జరిగితే తప్పేంటని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టు పనులు సవ్యంగా జరిగితే..పనులు ముందుకు వెళుతాయన్నారు. పోలవరం,  రాజధాని పనులు ఆపేస్తున్నామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజల డబ్బులు దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం జగన్ సూచించడం జరిగిందన్నారు. ప్రాజెక్టుల విషయాల్లో నిజాలు..తప్పులు..దోపిడి బయటపడుతాయని మంత్రి అనీల్ కుమార్ వెల్లడించారు. 

minister anil kumar yadav
AP Irrigation
Polavaram
AP Projects

మరిన్ని వార్తలు