కృష్ణా డెల్టాకు నీటి విడుదల :ప్రతీ ఎకరాకు నీరు

Submitted on 12 July 2019
Minister Anil Kumar Yadav Water Release for Krishna Delta

జల వనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కష్టా డెల్డాకు నీటిని విడుదల చేశారు. ఖరీఫ్ సీజన్ లో తొలిసారిగా 1000 క్యూసెక్కుల నీటిని మంత్రి విడుదుల చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతు..కృష్టా డెల్డాలో చివరి ఆయకట్టువరకూ నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. 80 టీఎంసీలు పట్టిసీమ నుంచి..60 టీఎంసీలు సాగర్ తో పాటు ఇతర మార్గాల ద్వారా అందిస్తామని..రాబోయే పది రోజుల్లో పూర్తిస్థాయి నీటిని విడుదల చేస్తామన్నారు.
 

కాగా గురువారం (జులై 11)న జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గురువారం కృష్టాజిల్లా 31వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పార్థసారధి, మల్లాది విష్ణు  హాజరయ్యారు.

మావేశం అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పంట దెబ్బతినకుండా ప్రతి రైతుకు నీరు అందిస్తామన్నారు.కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులను కొనసాగిస్తామన్నారు. సాగు, తాగు నీటి అవసరాల కోసం ప్రస్తుతం 70 శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. 

AP
Minister
Anil Kumar Yadav
Water
release
Krishna Delta
Patisima Project


మరిన్ని వార్తలు