మక్కాలో తప్పిపోయిన హైదరాబాదీ దొరికారు

Submitted on 10 June 2019
Missing Hyderabad man traced in Mecca

మక్కా యాత్ర(ఉమ్రా)కు వెళ్లి తప్పిపోయిన హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ ఖాదర్ అనే వ్యక్తి దొరికినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయ శంకర్ వెల్లడించారు. 25 మంది బృందంతో కలిసి వెళ్లిన ఖాదర్ మే 25న అల్ హరమ్ మస్జిద్‌లో తప్పిపోయారు. 

ఖాదర్ కొడుకైన మొహమ్మద్ శమీ తప్పిపోయిన సమాచారాన్ని భారత రాయబార కార్యాలయంకు తెలియజేయడంతో గాలింపు చర్యలు చేపట్టాకగ. ఇందులో భాగంగానే అమ్జద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి ద్వారా ఖాదర్ ఆచూకీ దొరికినట్లు సమాచారాన్ని అందుకున్నారు. విదేశాంగ మంత్రి జయ్ శంకర్ మాట్లాడుతూ.. 
Also Read : నిఘా వర్గాల రిపోర్ట్ : ఆ భయంతోనే పాక్.. ఉగ్ర శిబిరాలను మూసేస్తోంది!

'హైదరాబాద్ కు చెందిన ఖాదర్ మిస్ అయినట్లు జూన్ 8న రాయబార కార్యాలయానికి సమాచారం అందింది. ఆ తర్వాత ఖాదర్ గురించిన వివరాలు అతని కొడుకు షమీని అడిగి తెలుసుకున్నాం. ఇదవే అతణ్ని వెదికిపట్టుకోవడంలో సహాయపడ్డాయి. స్థానిక అధికారులు సహకరించడంతో మా పని ఇంకా సులువు అయింది. 25మంది తీర్థయాత్రికులు క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు' అని తెలిపారు.  

తిరుగుప్రయాణంలో ట్రావెలింగ్ ఏజెన్సీ వారికి ఆహారం, వసతి ఏర్పాట్లు సరిగా చేయలేదు. ట్రావెలింగ్ ఏజెన్సీ మమ్మల్ని దారుణంగా మోసం చేసిందంటూ బాధితుల్లో ఒకరు చాదర్‌ఘట్ పోలీస్ స్టేషన్లో కంపైంట్ కూడా చేశారు. 
Also Read : కథువా కేసులో కీలక తీర్పు: ముగ్గురికి జీవిత ఖైదు

Missing
Hyderabad man
Mecca
Hyderabad

మరిన్ని వార్తలు