జగన్ సాక్షిగా ప్రమాణం : ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వామి భక్తి

Submitted on 12 June 2019
MLA Kotamreddy Sridhar Reddy Takes Oath AP Assembly

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో వింత చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలందరూ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వినూత్నంగా ప్రమాణం చేశారు. దైవ సాక్షితో పాటు..తమ ఆరాధ్య నాయకుడు జగన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా అంటూ ఆయన ప్రమాణం చేశారు. కానీ జగన్‌పై ప్రమాణం చేయడం నిబంధనలకు విరుద్ధమన్న ప్రొటెం స్పీకర్..కోటంరెడ్డి చేత మరోసారి ప్రమాణం చేయించారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జూన్ 12వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇవే తొలి అసెంబ్లీ సమావేశాలు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రమాణం చేయడానికి వచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడినైన..కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను సభా నియమాలకు..కట్టుబడి ఉంటానని..వాటిని అనుసరిస్తానని..సభా మర్యాదాలను పాటిస్తానని..సంప్రదాయాలను గౌరవిస్తానని..దైవ సాక్షిగా..ఆరాధ్య నాయకుడు వైఎస్ జగన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను‘ అంటూ కోటంరెడ్డి ప్రమాణం చేయడం విశేషం. నిబంధనలకు విరుద్ధమని ప్రొటెం స్పీకర్ వెల్లడించి..మరోసారి ఆయనచేత ప్రమాణం చేయించారు. 

MLA Kotamreddy Sridhar Reddy
takes
oath
AP Assembly

మరిన్ని వార్తలు