పార్టీ మారినా ప్రేమ మారలేదు: చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Submitted on 15 August 2019
Mla Seethakka Ties Rakhi to Chandrababu

రాజకీయ నాయకులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పార్టీలు మారినప్పుడల్లా నేతలపై మాటలు మారుతుంటాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్లు కూడా అందుకు కారణమైన వ్యక్తులపై తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. పార్టీ మారగానే తిట్టిపోస్తుంటారు. అయితే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రం అలా కాదు. పార్టీ మారినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రేమ  మారలేదు. ఆగస్టు 15వ తేదీ రాఖీ పండుగను పురస్కరించుకుని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు రాఖీ కట్టారు ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఆమె చంద్రబాబుకు రాఖీ కట్టి పుష్ప గుచ్చం అందజేశారు.

టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి రాఖీ కట్టిన ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తెలుగుదేశం పార్టీ ద్వారా, చంద్రబాబు ప్రోత్సాహంతో ఎదిగిన నేత.. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు మీద అదే అభిమానంతో ఆయనకు ప్రతీ సంవత్సరం రాఖీ కడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ఆమె చంద్రబాబుకు రాఖీ కట్టారు. పార్టీలు మారిన వెంటనే దుర్భాషలు ఆడే రాజకీయ నాయకులు ఉన్న తరుణంలో ఆమె చంద్రబాబుపై ప్రేమతో రాఖీ కట్టడంతో ఆమెను ప్రశంసిస్తున్నారు.

ఇదే సమయంలో మాజీ మంత్రి పరిటాల సునీత కూడ చంద్రబాబుకు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు.

MLA seethakka
rakhi
Chandrababu
Paritala Sunitha

మరిన్ని వార్తలు