ఏం కష్టమొచ్చిందో: పుట్టిన బిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిన యువతి

Submitted on 27 May 2019
Mom leaves newborn baby in Hospital at Guntur

మాతృత్వం ఒక వరం.. అమ్మ అని పిలిపించుకునేందుకు ప్రతీ మహిళ ఆరాటపడుతుంది. అయితే గుంటూరులో పుట్టిన బిడ్డను రోజు గడవకముందే వదిలేసి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే.. మే 25వ తేదీ రాత్రి సమయంలో సర్వజనాసుపత్రికి ఓ యువతి తన తల్లితో కలిసి నెలలు నిండి వచ్చింది. రాత్రి సమయంలో ప్రసూతి విభాగంలో చేరిన మహిళ అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో ఆమె మగబిడ్డకి జన్మనిచ్చింది.

తరువాత కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన యువతి చిన్నారిని ముద్దులతో ముంచెత్తింది. కాసేపటికి మరుగుదొడ్డకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన యువతి, తల్లితో సహా వెళ్లిపోయింది. తల్లి వస్తుందని, ఎదరుచూసిన వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది.. ఆమె ఎంతసేపటికీ రాకపోవడంతో ఆసుపత్రి పరిసరాల్లో వెదికి ఆచూకీ దొరకకపోవడంతో ఔట్‌పోస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు.. ఎంట్రీ రికార్డులను పరిశీలించగా.. యువతి పేరు ఉప్పు శ్రావణి అని, వయస్సు 18ఏళ్లు అని, భర్త పేరు వెంకటేశ్వర్లు అని, రాజీవ్‌గాంధీ నగర్‌ 10వ వీధి అని అందులో వెల్లడించి ఉంది. ఆ వివరాలతో పోలీసులు అక్కడకు వెళ్లి విచారించగా.. అటువంటి పేరుతో ఎవరూ లేరని వాళ్లు వెల్లడించారు.  సీసీ పుటేజీ ఆధారంగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పుట్టిన బాబు ఆరోగ్యం బాగుందని, ప్రస్తుతం  ఎన్‌ఐసీయూ విభాగంలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

Mom leaves
newborn baby
hospital
Gunturu

మరిన్ని వార్తలు