బీ అలర్ట్: రోజుకు రెండు కన్నా ఎక్కువ గుడ్లు మంచిది కాదు

Submitted on 8 June 2019
More Than Two Eggs Per Day Is Two Dangerous To Heart

ఎగ్ లవర్స్ ప్లీజ్ బీ కేర్ ఫుల్.. ఈ రోజుల్లో ప్రోటీన్స్ సమస్యలు వచ్చి డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ రోజుకు ఒక గుడ్డు తినాలని అని చెప్తుంటారు. అయితే సాధరణంగా మనందరం గుడ్డును పలావ్‌లలో, బేకరీల్లో, ఆమ్లెట్ చేసుకునో తింటాం. కానీ అలా తినకూడదు ఉడికించిన గుడ్డు మాత్రమే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఒక గుడ్డు తినడం వల్ల 70-80 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 190 గ్రాముల కొలెస్ట్రాల్‌ శరీరానికి అందుతుంది. ఇందులో అరుదైన లవణాలతో పాటు ఫాస్పరస్‌, అయోడిన్‌, సెలీనియం, ఐరన్‌, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మేలుచేసేవే. అయితే, లిమిట్ గా తింటే ఓకే కాని మరీ ఎక్కువ తింటే  విషం అవుతుంది.

తినే ఆహారం ఏదైనా మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం. గుడ్డు కూడా అంతేనట. రోజూ రెండు కంటే ఎక్కువ కోడిగుడ్లు తింటే గుండెకు ముప్పని తాజా సర్వే హెచ్చరిస్తోంది. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములు దాటితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, అమెరికా వ్యవసాయశాఖ వెల్లడించింది.

Also Read : ఓడిన తండ్రికి కొడుకు ఓదార్పు: చప్పట్లతో మార్మోగిన స్టేడియం

More Than Two Eggs
Per Day
Dangerous To Heart
2019

మరిన్ని వార్తలు