ఒమెగా హాస్పిటల్ ఘనత : గర్భాశయ క్యాన్సర్ నివారణకు అత్యాధునిక పరికరం

Submitted on 6 July 2019
The most advanced tool for cervical cancer prevention

గర్భాశయ క్యాన్సర్ వ్యాధి నివారణకు గుంటూరు ఒమెగా హాస్పిటల్ అత్యాధునిక పరికరం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలోనే అత్యాధునిక క్జాప్ట్ ఎలక్ట్రానిక్ బ్రాకి థెరపి పరికరం ద్వారా రొమ్ము కాన్సర్‌కు ఒక్క రోజులోనే రేడియోషన్ చికిత్స చేయవచ్చనని డాక్టర్ నాగకిషోర్ తెలిపారు. 

గర్భాశయ ముఖద్వారం, గర్భాశయ కాన్సర్లకు కణితి లోపలి భాగాలకు రేడియేషన్ అందించవచ్చన్నారు. ఈ ప్రక్రియలో మూత్రాశయానికి గానీ పెద్దపేగుకు గానీ ఎటువంటి రేడియేషన్ సోకదని తెలిపారు. క్జాప్జ్ ఎలక్ట్రానిక్ బ్రాక్ థెరపి ద్వారా ఎటువంటి శస్త్ర చికత్స లేకుండా మొదటిదశ చర్మకాన్సర్‌ను నయం చేయవచ్చన్నారు. 

ఈ విధానంలో కాన్సర్ రోగికి చికిత్స అందిస్తున్న సమయంలో రోగి సహాయకుడు కూడా రోగి వద్దనే ఉండవచ్చని తెలిపారు. సహాయకుడుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవని, రేడియో ధార్మిక పదార్ధాల వాడుక లేని కారణంగా రేడియో ధార్మిక కాలుష్యాన్ని కూడా నివారించవచ్చన్నారు.
 

most advanced
tool
cervical cancer
PREVENTION
guntur
omega hospital

మరిన్ని వార్తలు