మూవీ రివ్యూ

Friday, May 6, 2016 - 19:32

చిల్లర డాన్సులు, ఫైట్లు, ఛీప్ కామెడీతో నిండిన సినిమాలు మన ప్రాంతీయ భాషా చిత్రాలను చులకన చేస్తున్నాయి. కానీ వందలో ఒకటిగా వినూత్న ఆలోచనలతో వచ్చే 24లాంటి సినిమాలు మళ్లీ మన గౌరవాన్ని నిలబెడుతున్నాయి. విశ్వ సమస్తానికి కారణ భూతమైన సమయాన్ని ఆపగలిగితే, వెనక్కి, ముందుకు పంపించగలిగితే మనిషి అద్భుతాలు చేయగలడు, చూడగలడు. ఈ అంశాన్ని మూలకథగా ఎంచుకుని దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఒక...

Thursday, May 5, 2016 - 19:21

కమర్షియల్ కొలతల సినిమాలు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే ఉంటాయి. ఇందులో వైవిధ్యాన్ని వెతికేందుకు చేసే ప్రయత్నాలు వృథాప్రయాసే...ఐతే కొద్ది సేపు వినోదానికి మాత్రం గ్యారెంటీ ఉంటుంది. పటాస్ సినిమాను ఎంటర్ టైనింగ్ తెరకెక్కించిన దర్శకుడు అనిల్..తన రెండో సినిమాకూ ఇదే ఫార్మేట్ ఫాలో అయ్యాడు. పటాస్ కు కార్బన్ కాపీగా సుప్రీమ్ ను రూపొందించాడు.
కథ...
సుప్రీమ్ కథలోకి...

Friday, April 29, 2016 - 19:47

ఇది ష్యూర్ హిట్ అని ఇండస్ట్రీలో ఏ సినిమాకు ఎవరూ జోస్యం చెప్పలేరు. కథ వినేప్పుడు కలిగే ఆసక్తి...దాన్ని సినిమా మలిచాక...ప్రేక్షకుల్లో  కలగకపోవచ్చు. ఇది కథను సినిమాగా మలిచే అనేక స్థాయిల్లో జరిగే మార్పు. ఈ మార్పులు బాగుంటే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే కౌంటర్ లో టికెట్లపై ఎవరూ చేయి వేయకుండా తయారవుతుంది. రోహిత్ కొత్త సినిమా రాజా చెయ్యి వేస్తే దీన్నే ఫాలో అయ్యింది.
...

Friday, April 22, 2016 - 18:57

వెనకటికి ఎవరో....ఏ కథ చెప్పమన్నా...అనగనగా ఒక ఆవు..దానికి రెండు కొమ్ములు అని మొదలు పెట్టేవారట. చివరకి విమానం గురించి చెప్పమన్నా...ఒకసారి విమానంలో వెళ్తున్నాను...కిందకి చూశాను...ఆవు కనిపించింది..దానికి రెండు కొమ్ములున్నాయి...ఇదీ వరస...ఇలాగే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు దర్శకులు....హీరో ఎవరైనా...అదే కథను తెరకెక్కిస్తున్నారు. హీరోకున్న ఇమేజ్ ఏంటి...ఏ కథలో, ఏ క్యారెక్టర్ లో...

Thursday, April 14, 2016 - 19:20

ఈ సంవత్సరం రిలీజైన సినిమాల్లో ఎక్కువ భాగం ప్రయోగాత్మకంగానూ, ఫ్యామిలీ ఎమోషన్స్ బేస్డ్ గానే సాగాయి. కామెడీ మూవీస్ మీద ఫుల్ గా ఎవరూ ఫోకస్ చేయలేదు. కానీ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ను మొదటి నుంచి చివరి వరుకూ ఔట్ అండ్ ఔట్ కామెడీ తో జనాన్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది ఈడో రకం ఆడో రకం. డైనమైట్ తర్వాత ఒక్క సరైన సినిమాలేని విష్ణు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ప్లాప్ తో కాస్త డల్ అయిన రాజ్...

Friday, April 8, 2016 - 18:41

నువ్వు నీలా నటించావు...సహజం....అందిరికీ నచ్చావు....నువ్వు ఎలా నటిస్తే అందరూ ఇష్టపడతారో..అలా కనిపించాలని ప్రయత్నిస్తే...అసహజం....ఎవరికీ నచ్చవు. స్క్రీన్ అప్పీయరెన్స్, డైలాగ్స్ డెలివరీ, హ్యూమర్ , స్టైలిష్ యాక్షన్ తో పవర్ స్టార్ గా పేరుతెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. రెండు దశాబ్దాల కెరీర్ లో పవన్ ను ప్రేక్షకులు, అభిమానులు ప్రేమించేలా చేసిన అంశాలివి. ఈ సినిమాలు...ఈ నటన...పవన్...

Friday, April 1, 2016 - 18:52

వారం తిరిగేలోపు కొత్త సినిమాతో థియేటర్లోకి వచ్చేస్తున్నాడు నారా రోహిత్. ఈ వారం సావిత్రి సినిమాతో తెరపైకి వచ్చాడు. టైటిల్ చూసి లేడీ ఓరియెంటెడ్ సినిమా అనే అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో ఇలాంటి పేర్లతోనే స్టార్ హీరోలు సూపర్ హిట్స్ అందుకున్నారు. టైటిల్ పాజిటివ్ గా ఉంది...మరి సినిమా అలాంటి పాజిటివిటీనే కంటిన్యూ చేసిందా....చూద్దాం..

కథ..
కథ గురించి...

Friday, April 1, 2016 - 18:49

కిల్లింగ్ వీరప్పన్ హిట్టు తరువాత రామ్ గోపాల్ వర్మ మళ్లీ పాత బాణీలోకి వచ్చేస్తాడని, మళ్లీ శివ, గాయం రేంజ్ లో సినిమాలు తీస్తాడని అనుకున్నారు జనం. ఎటాక్ సినిమా చూస్తే నిజమే అనిపిస్తుంది. నిజమే మళ్లీ రాము పాత రాము అయిపోయాడు. అయితే ఇక్కడో ట్విస్టేంటంటే రామ్ గోపాల్ వర్మ పాత బాణీలోనే మళ్లీ గాయం, రౌడీ, బెజవాడ లాంటి సినిమాయే తీసాడు. అదే కథ, అవే చంపుకోవడాలు, అవే కక్షలు అవే గొడవలు....

Friday, March 25, 2016 - 18:57

సినిమా అంటే మనం నమ్మిన అంశాన్ని తెరకెక్కించడం. అది రీమేక్ ఐనా....విదేశీ సినిమా ఐనా...ఈ నమ్మకమే ఫిల్మ్ మేకర్ కు కావాల్సింది. ఇలా కాన్ఫిడెంట్ గా రూపొందించిన సినిమాలు నిరాశపర్చవు. పైగా కొత్త ప్రయత్నానికి ప్రశంసలు తెచ్చిపెడతాయి. కొంత తడబడినా...నాగార్జున కొత్త సినిమా ఊపిరి ఇలాంటి అప్రిషియేషన్స్ నే దక్కించుకునేలా ఉంది. ఫ్రెంచి ఫిల్మ్ ఇన్ టచబుల్స్ ని ఊపిరి పేరుతో రీమేక్ చేశాడు...

Friday, March 11, 2016 - 18:31

వేరే భాషలో ఓ సినిమా సూపర్ హిట్టై కోట్లు వసూలు చేస్తే చాలు ఇక దాన్ని రీమేక్ చేసేందుకు మన దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. అక్కడ రికార్డు విజయాలు సాధించిన తుపాకి లాంటి ఎన్నో సినిమాలు ఇక్కడ బొక్కబోర్లా పడటం చూసైనా మారరు. తమిళంలో హిట్టైన మాన్ కరాటే సినిమాను తెలుగులో తుంటరిగా రీమేక్ చేశారు...అక్కడి సక్సెస్ లో మూడో వంతు మాత్రమే దక్కించుకోలిగిందీ సినిమా.

కథ....

Friday, March 4, 2016 - 20:48

కొత్తరకం వంటకం చేయాలని బిర్యానీలో బెల్లం వేస్తే దరిద్రంగా ఉంటుంది. అలాగే...ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నామనే పేరుతో తలతిక్క ప్రయోగాలను చేస్తే తిరస్కరిస్తాం. తన ఇమేజ్ కు భిన్నంగా మంచు మనోజ్ చేసిన శౌర్య...ఇలాగే తలతిక్కగా తయారైంది. తన సినిమా కాని సినిమాను దశరథ్, తన ఇమేజ్ కు పనికిరాని సబ్జెక్ట్ ను మనోజ్ చేయడం వల్ల శౌర్య ఎవరికీ అర్థం కాని సినిమాగా తయారైంది. 
కథ...

Friday, March 4, 2016 - 20:41

దశాబ్దాలుగా తెలుగు సినిమాకు ఫ్యామిలీ డ్రామా కథలు ఓ సక్సెస్ ఫుల్ ఫార్ములా. వేరే జానర్ సినిమాలు పక్కాగా కుదిరితేనే బాగుంటాయి....కానీ ఈ తరహా కథలు కాస్త అటు ఇటైనా....విజయంలో తేడా ఉండదు. ఐతే...కథా స్క్రీన్ ప్లే లలో చేసే తప్పులకు తగిన రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి ఉంటుంది. టోటల్ గా క్రెడిట్ మాత్రం స్టోరీ ఐడియాకే దక్కుతుంది. ఇలా దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందించిన కళ్యాణ వైభగమే  ...

Friday, February 19, 2016 - 16:17

ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడి పని దర్శకుడు..నిర్మాత పని నిర్మాత చేయాలి...లొకేషన్లు, అక్కౌంట్స్, ఆర్టిస్టుల కోఆర్టినేషన్, ప్రొడక్షన్.. ఇలాంటి పనులు చేయాల్సిన నిర్మాత...కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వ శాఖల్లో అనవసర జోక్యం చేసుకుంటే...కాస్తో కూస్తే బెటర్ గా రావాల్సిన సినిమా అట్టర్ ఫ్లాప్ గా తయారవుతాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి...

...

Friday, February 12, 2016 - 18:29

ఇమేజ్ కు తగిన కథలను ఎంచుకునే కథానాయకులే స్టార్లు అవుతారు. వీళ్లలో నాని మొదటి లిస్టులో ఉంటారు. తనకు సరిపోయే స్టోరీలతో సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. నాని సినిమాలో ఎదో కొత్తదనం ఉంటుందనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథతోనూ ఈ నమ్మకాన్ని మరింత పెంచాడు నాని. ..

కృష్ణ ..రాయలసీమలోని ఓ కుర్రాడు. బాలకృష్ణ అభిమాని. ఉండేది సీమలోనైనా....గొడవలంటే మహా...

Friday, January 29, 2016 - 18:57

పల్లె వాతావరణంలో ప్రేమ కథలు అరుదుగా తెలుగు తెరపైకి వస్తుంటాయి. వాస్తవానికి ఈ సినిమాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. కథ, కథలోని ఎమోషన్స్ బాగా కుదిరితే....విలేజ్ లవ్ స్టోరీలకు తిరుగుండదు. ఇలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. మరి ఈ సినిమాకు ఆడియెన్స్ ఎలాంటి రిజల్ట్ నిచ్చారో తెల్సుకుందాం.

కథ..
రాజ్ తరుణ్, ఆర్తన...

Friday, January 29, 2016 - 18:55

ఏమీ రానివాళ్లకు అవకాశాలిచ్చే టాలీవుడ్...ఎంతో టాలెంట్ ఉన్న వాళ్లను కాలగర్భంలో కలిపేస్తుంటుంది. లక్కీగా అవకాశం వచ్చిన దర్శకులు మాత్రం...లచ్చిందేవికి ఓ లెక్కుంది లాంటి సినిమాలు చేసి కనిపించకుండా పోతుంటారు. రోజూ న్యూస్ పేపర్లలో వచ్చే ఓ చిన్న పాయింట్ పట్టుకుని దానికి బూజు పట్టిన కథను అల్లి సినిమాగా తీసేశారు. ఇలా తెరపైకి వచ్చిన లచ్చిందేవి....ఆడియోన్స్ ను ఒ ఆటాడుకుంది.

...

Friday, January 15, 2016 - 18:39

సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలైతే...పండగ కళంతా ఒక సినిమాలోనే కనిపించింది. ఫెస్టివల్ ఫేవరేట్ అనుకున్న ఆ సినిమా...ఊహించినట్లుగానే ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. అదే నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన. పల్లె వాతావరణం, కలర్ ఫుల్ గా పాటల పిక్చరైజేషన్, పాత్రల చిత్రీకరణ, కామెడీ, కొంత సోషియో ఫాంటసీ అంశాలు...వెరసి సోగ్గాడిని పండగ హీరోను చేశాయి...

Thursday, January 14, 2016 - 18:28

హీరో హీరోయిన్లు సినిమా అంతా పరుగులు పెడితే...సినిమా బాక్సాఫీస్ దగ్గర అలాగే పరుగెత్తుతుందని అనుకోవడం మూర్ఖత్వం. ఒకే బానర్ లో ఒకసారి కుదిరిన కథ...అన్నీ సార్లూ కుదరక పోవచ్చు. కథగా అనుకున్నది తెరపై అస్సలు రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో నవ్వులు పూయించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ...ఎక్స్ ప్రెస్ రాజా తో మళ్లీ అలాంటి ప్రయత్నమే చేశాడు. ఐతే ఈ సారి...

Thursday, January 14, 2016 - 18:24

బాలకృష్ణ డిక్టేటర్ మాస్ ఆడియెన్స్ ను, అభిమానుల్ని అలరించే ఎంటర్ టైనర్ అయ్యింది. ఐతే హిట్ రేంజ్ ను మాత్రం చేరుకోలేకపోయింది. బాలకృష్ణ నటించిన ఈ తొంబై తొమ్మిదో సినిమా....తెలుగు, తమిళం, హిందీలో వచ్చిన 99 సినిమాలను కలిపి తయారుచేసిన ఫీలింగ్ ఇస్తుంది. కొత్తదనం కోరుకునే ఆడియోన్స్ కు, సాధారణ ప్రేక్షకులకు ఇది రుచించడం కష్టమే.

కథ..
ఓ సూపర్ మార్కెట్ లో...

Wednesday, January 13, 2016 - 19:31

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో 'నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అతి తక్కువ టైంలో అగ్ర హీరోగా ఎదిగి అతికొద్ది మందికి దక్కే స్టార్ డమ్ అందుకున్న నటుడు ఎన్టీఆర్. చూస్తుండగానే 24 సినిమాలు చేశారు. 'నాన్నకు ప్రేమతో' 25వ సినిమా. మైల్డ్ స్టోన్ లా ఉండాల్సిన సినిమా కాబట్టే నాన్నకు ప్రేమతో సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్....

Friday, January 1, 2016 - 17:11

తీవ్రమైన ఎండల తర్వాత నాలుగు చినుకులు పడితే వాతావరణం కొంత రిలీఫ్ నిస్తుంది. అలా అని ఆ నాలుగు చినుకులను వాన అనుకోవడానికి లేదు. రామ్ కొత్త సినిమా నేను శైలజా ఇలాంటి ఫలితాన్నే ఇచ్చింది. అతని గత చిత్రాల ఫ్లాపుల దెబ్బకు విసిగిపోయిన ప్రేక్షకులకు ….ఈ కొత్త సినిమా కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఐతే హిట్టయినట్లు కాదు. కొన్నేళ్లుగా కథల ఎంపికలో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు రామ్. నేను శైలజా కొత్త...

Friday, December 25, 2015 - 18:43

చిన్నప్పుడు వేసుకున్న చొక్కా బాగుండేదని ఇప్పుడు మళ్లీ వేసుకుంటే జనం నవ్వుతారు. అలాగే అప్పుడెప్పుడో ఇద్దరు భార్యల కథతో చేసిన సినిమా సక్సెస్ అయ్యిందని...దశాబ్దాల తర్వాత మళ్లీ తీస్తే...ప్రేక్షకులు తిరస్కరిస్తారు. కెరీర్ కు అనుభవం పనికిరానప్పుడు అది ఉన్నా లేనట్లే. టాలీవుడ్ లో నలభై ఏళ్ల ప్రయాణం చేస్తున్న మోహన్ బాబుకు....'మామ మంచు అల్లుడు కంచు' లాంటి సినిమా కథపై కనీసం అనుమానమైనా...

Thursday, December 24, 2015 - 15:55

సినిమాకు కథ... ఇంటికి పునాది లాంటిది. బేస్ మెంట్ బలంగా ఉంటే దానిపై కోట కట్టొచ్చు. అలాగే మూలకథ బాగుంటే...దానిపై రెండున్నర గంటల పాటు ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు. స్టోరీ లేకుండా స్టంట్స్ చేస్తేనే...ఆ సినిమా ప్రేక్షకులు భరించలేనట్లు తయారవుతుంది. 'గోపీచంద్' కొత్త సినిమా 'సౌఖ్యం'...ఇలాంటి ఫీట్లనే చేస్తూ...చూసే జనాలను అనేక పాట్లకు గురి చేసింది. పైగా రచయిత బుర్రకు తోచిన ట్విస్టులు...

Thursday, December 17, 2015 - 19:15

గతంలో ప్రేక్షకులు టైటిల్స్ చూసి ఆ సినిమా దర్శకుడెవరో చెప్పేవాళ్లు. సినిమా పై ఆ దర్శకుల ప్రభావం అంతాల ఉండేది. ప్రస్తుతం అలా చెప్పగలిగే ఒక దర్శకుడి పేరు పూరీ జగన్నాథ్. తను తీసే సినిమాల్లాగే.. పేరూ షార్ప్ గా ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ టైటిల్స్ తో సక్సెస్ ఫుల్ సినిమాలు చేశాడీ దర్శకుడు. ఐతే అన్ని సార్లూ తిట్టిన పేర్లూ హిట్ కావాలనీ లేదు. లోఫర్ చూస్తే ఈ విషయం తెలిసి పోతుంది. పూర్తి...

Thursday, December 10, 2015 - 14:58

తెలుగులోనే కాదు ఏ భాషా సినిమాల్లోనైనా కొత్త కథలతో వచ్చేవి చాలా అరుదు. కథలు పాతవే ఐనా...స్క్రీన్ ప్లే, మాటలతో బండి లాగించేయొచ్చు. అది కన్విన్సింగ్ గా చేయగల్గితే సినిమా సక్సెస్ అయినట్లే. బెంగాల్ టైగర్ సినిమాతో దర్శకుడు సంపత్ నంది ఇదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. తెలిసిన స్టోరీనే మాటల చాతుర్యంతో చూపించి ఫర్వాలేదు అనిపించాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ఈ సినిమా...

Friday, December 4, 2015 - 18:42

తాను ఇచ్చిన 72 సీన్లు అలాగే చిత్రీకరించి ఉంటే రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా హిట్ అయి ఉండేదని....రీసెంట్ గా రైటర్ కోన వెంకట్ కామెంట్స్ చేశాడు. ఇది నిజమేనేమో అనుకున్నారు కొంతమంది. కానీ...శంకరాభరణం సినిమా చూశాక మాత్రం అది ఖచ్చితంగా నిజం అయి ఉండదని తెలిసిపోతుంది. ఆ 72 సీన్లు అలాగే తీసి ఉంటే...బ్రూస్ లీ మరో పదిరెట్లు అట్టర్ ఫ్లాప్ సినిమా అయి ఉండేదని అర్థమైపోతుంది. ఎందుకంటే కోన...

Friday, November 27, 2015 - 20:20

హీరోయిన్ అనుష్క నటించిన ఫ్యాట్ ఎంటర్ టైనర్ సైజ్ జీరో. స్లిమ్ ఆండ్ బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనుష్క. అలాంటి బ్యూటీని బొద్దుగుమ్మల్లా చూడాలంటే కష్టం. అయినా అనుష్కను ఫ్యాటీ బ్యూటీగా మార్చి దర్శకుడు కోవెలమూడి ప్రకాశ్ సైజ్ జీరో సినిమా తీశాడు. ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా..? లేదా... ? సినిమా రివ్యూకు సంబంధించిన...

Pages

Don't Miss