సినిమా

ప్రజెంట్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ముందు వరుసలో వినిపించే పేరు మహేష్ బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు వంద కోట్ల సినిమా మీద కన్నేశాడు.

హైదరాబాద్: దర్శక,నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "రుద్రమదేవి" చిత్రంలో కేథరిన్ అనామిక అనే పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రలో కేథరిన్ రాజకుమారిలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన న్యూ లుక్ ను ఇటివలే విడుదల చేసారు.

హైదరాబాద్: రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రుద్రమదేవి సినిమాలో ముక్తాంబ ప్రాతలో నటిస్తున్న నిత్యా మీనన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గుణ శేఖర్ తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే...

విజయవాడ : అలనాటి మేటి నటి కనకం (92) కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే మేనల్లుడు మృతి చెందడంతో కనకం దిగులుతో మంచాన పడ్డారు. రెండు రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర బృందం వరుసగా పోస్టర్లు విడుదల చేస్తోంది.

ప్రముఖ సినీ నటుడు నాగార్జున తనయుడు 'అఖిల్' నటిస్తున్న తాజా చిత్రం టీజర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు.

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీక్షిస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారని టాక్.

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు భాషల్లో డైలాగ్స్ పలికి అలరించారు. టీఎస్సార్, టీవీ9 అవార్డుల ప్రదానోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. పృథ్వీ రాజ్ కపూర్ మనవడు రిషికపూర్‌తో తనకు పరిచయం, స్నేహం ఉన్నాయని పేర్కొన్నారు.

ఫిలిం ఇండస్ట్రీ ఆ నలుగురిదే అని మరోసారి తేలిపోయింది. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకునే నాలుగు సెక్టార్లలో వాళ్లే ఉండటం వల్ల మళ్లీ ఛాంబర్ అధ్యక్ష పదవి ఆ టీమ్ కే దక్కింది.

ఇంటర్ నేషనల్ లెవల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ వీడియో గేమ్ సీరిస్ 'హిట్ మేన్' ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'హిట్ మేన్.. హిట్ మేన్ ఏజెంట్ 47' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలెగ్జాండర్ దర్శకుడు.

Pages

Don't Miss