రాం మాధవ్ ఎట్లుంటడో తెలీదు : ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ లోనే

Submitted on 13 June 2019
MP Komatireddy Condemns Rumors Over Party Change

ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని..పార్టీ మారడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ నేత రాం మాధవ్ ఎలా ఉంటాడో తెలియదన్నారు. పార్టీ ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. జూన్ 17వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా 10tvతో కోమటిరెడ్డి మాట్లాడారు.తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లో కొనసాగుతానని చెప్పారు. పార్టీ కోసమే పనిచేస్తానన్నారు. నిమ్స్ ను ఎయిమ్స్ గా మారుస్తామని చెప్పారని త్వరితగతిన పనులు జరిగే విధంగా చూస్తానన్నారు. భువనగిరి - వరంగల్ జాతీయ రహదారి పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని..ఈ సమస్యలను పరిష్కరించుకొనేందుకు తాను కృషి చేస్తానన్నారు.

కేంద్ర మంత్రులను కలిసి సమస్యలను ప్రస్తావిస్తానని..విభజన చట్టంలోని కాజీపేట రైల్వే జోన్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీల విషయంపై మాట్లాడుతానని చెప్పారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఆయన స్పందించారు. సీఎం జగన్ చూసి సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఐఆర్ విషయంలో కేసీఆర్ మాట్లాడలేదని..ఆశా వర్కర్ల జీతాలు..ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు ఎంపీ కోమటిరెడ్డి. 

MP Komatireddy
Condemns
Rumors
Over Party Change

మరిన్ని వార్తలు