ఆర్మీ నుంచి పంపేస్తారనే ధోనీ సీక్రెట్‌గా ఉంచాడా..!

Submitted on 13 August 2019
MS Dhoni finger Fracture; wants it to be a ‘big secret’

కొన్నేళ్లుగా భారత క్రికెట్ మొత్తం ధోనీ చుట్టూనే తిరుగుతుంది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ 2019 పేలవ ఫామ్‌తో నిరుత్సాహపరిచాడని రిటైర్మెంట్ ఇచ్చేస్తే బాగుంటుందంటూ పలువురు విమర్శలు వ్యక్తం చేశారు. క్రికెట్‌ నుంచి 2నెలల విరామం తీసుకుంటూ ఆర్మీ క్యాంప్ కు వెళ్తున్నా.. అతనిపైనే చర్చ. అంతటి డెడికేషన్‌తో ఆడే ప్లేయర్‌పై ఈ మాత్రం రచ్చ ఉండదా మరి. 

వరల్డ్ కప్ 2019 టోర్నీలో ధోనీ బొటనవేలికి గాయమైంది అయినప్పటికీ విశ్రాంతి లేకుండా మ్యాచ్‌లు ఆడాడు. రక్తం కారుతుండగా బ్యాటింగ్ చేసిన ఫొటోలు కూడా అప్పుడు వైరల్‌గా మారాయి. అనూహ్యంగా టీమిండియా టాపార్డర్ కుప్పకూలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనే వెనుదిరగడంతో టీమిండియాకు వరల్డ్ కప్ ఆశలు వదులుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే ధోనీ వెస్టిండీస్ పర్యటనకు రాలేనని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లిపోయాడు. 

తన బొటనవేలి గాయం ఇంకా తగ్గకుండానే క్యాంప్‌లో జాయిన్ అయ్యాడు. సాధారణంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే ఆర్మీ బాధ్యతలకు ఎంట్రీ. లేదంటే రెస్ట్ తీసుకోవాల్సిందే. ధోనీ ఇందుకేనేమో తన బొటనవేలి గాయాన్ని బయటపెట్టలేదు. ఆర్మీ క్యాంప్‌కు వెళ్లాలనే ఆలోచనతో బొటనవేలి స్కానింగ్ కూడా తీసుకోకుండా ఎవ్వరికీ తెలియకుండా దాచి ఉంచాడు. లడఖ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న ధోనీ ఆగష్టు 15వరకూ ఆర్మీ కార్యకలాపాల్లో భాగంగా ఉండనున్నాడు. అక్కడే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో జెండా ఎగరేసి తిరుగుప్రయాణం కానున్నాడు. 

MS Dhoni
fracture
FINGER
big secret

మరిన్ని వార్తలు