మా సంగతి తేల్చండి..కాపు రిజర్వేషన్లపై మోడీకి ముద్రగడ లేఖ

Submitted on 13 August 2019
mudragada writes letter to pm narendra modi on kapu reservations

అమరావతి : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రధాని మోడికి లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో 02.12.2017న అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోందించిందని.. అప్పటి ప్రభుత్వం  కేంద్రానికి పంపిన 33/2017 కాపు రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని లేఖలో ప్రధానిని కోరారు. 

ఏపీ ని పాలించిన రాజకీయ పార్టీలు గత యాభై  ఏళ్లలో తమ ఓట్లు పొంది రిజర్వేషన్ విషయంలో మోసం చేశాయని ముద్రగడ లేఖలో  ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాపులకు ఇచ్చిన 5% బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు.

తక్షణం బిల్లును ఆమోదించి కాపు రిజర్వేషన్ అమలుకు కేంద్రం సహకరించాలని ముద్రగడ తన లేఖలో మోడీకి  విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలో ముద్రగడ ఎక్కడా సీఎం జగన్ పేరు ప్రస్తావించక పోవటం గమనించతగ్గ అంశం. 

Mudragada  wrote a letter to modi

 

Andhra Pradesh
Chandrababu Naidu
kapu reservations
Mudragada Padmanabham
Narendra Modi

మరిన్ని వార్తలు