నెలకు రూ.700 మాత్రమే : జియో GigaFiber ఆఫర్లు ఇవే

Submitted on 12 August 2019
Mukesh Ambani launches Jio GigaFiber 1Gbps broadband service, starts at Rs 700 per month

ఎప్పుడెప్పుడా అని జియో యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆగస్టు 12 (సోమవారం) రానే వచ్చేసింది. డేటా సంచలనం రిలయన్స్ జియో గిగాఫైబర్ సర్వీసు కమర్షియల్ ఈ రోజే లాంచ్ అయింది. రిలయన్స్ 42వ యానివల్ జనరల్ మీటింగ్ (AGM) సమావేశంలో రిలయన్స్ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.

దేశంలో అతిపెద్ద టెలికం నెట్ వర్క్‌గా అవతరించిన రిలయన్స్ జియో తమ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును 2019 సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభించనుంది. ఇండియాలో ప్రతిఒక్క యూజర్ కు Jio GigaFiber సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇప్పుడు అందరి దృష్టి జియో గిగాఫైబర్ సర్వీసులో ఎలాంటి ఆఫర్లు అందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. 
Read Also : ఫస్ట్ డే.. ఫస్ట్ షో.. సినిమా ఇంట్లోనే చూడవచ్చు : జియో సంచలన ఆఫర్

నెలకు రూ.700 నుంచి : 
జియో యూజర్ల అంచనాలకు తగ్గట్టుగా రిలయన్స్ జియో అద్భుతమైన అఫర్లను అందిస్తోంది. ‘Jio forver Annual plans’ తో జియో ఉచితంగా 4K/HD TV, 4K set-top box ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. జియో గిగాఫైబర్ అందించే డేటా ప్లాన్లలో ప్రారంభ ధర రూ.700లు మాత్రమే. ఈ ప్యాకేజీ కింద జియో తమ డేటా యూజర్లకు 100Mbps వరకు బ్రాడ్ బ్యాండ్ ఆఫర్ చేస్తోంది. రూ. 700 ప్లాన్ నుంచి కనీసం నెలకు రూ.10వేల ప్లాన్ వరకు అఫర్ చేస్తోంది. 

నెలకు రూ.500 చెల్లిస్తే చాలు : 
ఇంటర్నేషనల్ కాలింగ్ కోసం నెలకు రూ.500 చెల్లిస్తే చాలు.. జియో గిగాఫైబర్ Fixed voice calling, fixed line rates పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్లకు Unlimited calling చేసుకోవచ్చు. US, Canada దేశాలకు Unlimited వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. Free voice కాల్స్ మాత్రమే కాదు.. జియో గిగాఫైబర్ సర్వీసు అందించే ప్లాన్స్  యాక్టివేట్ చేసుకుంటే OTT ప్లాట్ ఫాం సబ్ స్ర్కిప్షన్లు బండెల్ పొందవచ్చు. ఇందులో కొత్తగా రిలీజ్ అయిన మూవీలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా హైస్పీడ్ 100Mbps బ్రాడ్ బ్యాండ్ మినిమం టైర్ కింద అందించనుంది. అలాగే Top-End tier ద్వారా 1Gbps వరకు బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ అందించనుంది. 

జియో Smart TV : 
ప్రీమియం కస్టమర్ల కోసం.. జియో Postpaid Plus అందుబాటులోకి తీసుకోస్తోంది. దీనిద్వారా platinum-grade సర్వీసు పొందవచ్చు. అంటే.. ఇంట్లో SIM సెటప్ సర్వీసుతో పాటు డేటా షేరింగ్, వాయిస్ కనెక్టవిటీ వంటి ఎన్నో ఫ్యామిలీ ప్లాన్లు పొందవచ్చు. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు పోటీగా హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ బేసిడ్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను జియో అందిస్తోంది. జియో గిగాఫైబర్ సర్వీసులో స్మార్ట్ హోం డొమైన్ గా పనిచేయనుంది. jio స్మార్ట్ టీవీలను కూడా ఇండియాలో విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే డేటా నెట్ వర్క్ కవరేజీలను దేశవ్యాప్తంగా విస్తరించిన జియో మరింత వృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 

Live TV బ్రాడ్ క్యాస్ట్ లివరేజింగ్ ఫీచర్ :
2018లో ట్రయల్ గిగాఫైబర్ సర్వీసును లాంచ్ చేసిన జియో.. దేశవ్యాప్తంగా 16వందల సిటీల్లో 15మిలియన్ల మంది రిజిస్ట్రేషన్స్ జరిగాయి. 0.5 మిలియన్ల ఇళ్లల్లో జియో గిగాఫైబర్ సర్వీసు రన్ అవుతోంది. జియో గిగాఫైబర్ సెట్ టాప్ బాక్స్ ఒరిజినల్ ధర ట్రయల్ ప్రారంభంలో రూ.4వేల 500కే అందించింది. ఆ తర్వాత దాని ధరను రూ. 2వేల 500కు తగ్గించింది. జియో భాగస్వామ్య బ్రాడ్ బ్యాండ్ సర్వీసులైన Hathway, Denతో పాటు LCO కంపెనీలు కూడా Live Tv బ్రాడ్ క్యాస్ట్ లివరేజింగ్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయి. 

* జియో గిగాఫైబర్ సర్వీసు set-top box తీసుకుంటే చాలు.. మల్టీపుల్ సర్వీసులు యాక్టివేట్ చేసుకోవచ్చు.
* మల్టీప్లేయర్ ఆన్ లైన్ గేమింగ్, హైస్పీడ్ వీడియో కాన్ఫిరెన్సింగ్ చేసుకోవచ్చు.
* షాపింగ్, ట్రావెలింగ్ వంటి సర్వీసులను కూడా పొందవచ్చు.
* జియో కాల్ చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాన్ఫిరెన్సింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
* మేజర్ గేమ్ పబ్లిషర్లు (మైక్రోసాఫ్ట్ ఎక్స్ స్టూడియోస్, టెన్ సెంట్) MMOG (మల్టీ ప్లేయర్ ఆన్ లైన్ గేమింగ్) సపోర్ట్
* ఇండియాలో నెట్ వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఆన్ లైన్ గేమింగ్ సర్వీసు పొందవచ్చు. 
* మిక్సడ్ రియాల్టీ కోసం జియో స్టాడెండ్ లోన్ headset అందించనుంది. త్వరలో సేల్ ప్రారంభం కానుంది. 

కాంబినేషన్ ఆఫర్ : నెలకు రూ.600 లోపు.. బ్రాడ్ బ్యాండ్, IPTV, ల్యాండ్ లైన్ కనెక్షన్ 
* డేటా స్పీడ్ 50Mbpsతో నెలకు 100GBవరకు పొందవచ్చు. 
* కాంప్లీమెంటరీ LandLine కనెక్షన్ Freeగా పొందవచ్చు.
* నెలకు రూ.500 ప్రారంభ ధరతో కనీసం 3 డేటా ప్లాన్లు 
* బేసిక్ 100Mbps కనెక్షన్ :  ఈ ప్లాన్ కింద బ్రాడ్ బ్యాండ్ సర్వీసు కనీస స్పీడ్ 100Mbps ఆఫర్
* గిగాటీవీ సర్వీసు : ఈ ప్లాన్ కింద GigaTV IPTV సర్వీసుతో Stream Tv చానెల్స్ పొందవచ్చు.
* GigaTV+ IoT ప్లాన్ : నెలకు రూ.వెయ్యి చెల్లిస్తే చాలు.. గిగాఫైబర్ సర్వీసు పొందవచ్చు. 
* IoT కంట్రోలర్ డివైజ్ నుంచి స్మార్ట్ డివైజ్ లను కంట్రోల్ చేసుకోవచ్చు. 

జియో ఫైబర్ టారిఫ్స్ : 
* US యావరేజ్ స్పీడ్ 90Mbps 
* ఇండియా (బేసిక్ జియో ఫైబర్ ప్లాన్ ) 100Mbps

Read Also : జియో గిగా ఫైబర్ ఆఫర్ : 4K టీవీ, సెట్ టాప్ బాక్స్, DTH ఫ్రీ

 

Jio GigaFiber
1Gbps broadband service
start
700 per month
Mukesh Ambani
io forver Annual plans

మరిన్ని వార్తలు