రాంగ్ పార్కింగ్ : ముంబై మేయర్‌.. అయితేంటి? ఫైన్ కట్టాల్సిందే!

Submitted on 16 July 2019
Mumbai Mayor issued a challan after his vehicle was found in no-parking zone

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఎంతటివారైన సరే ఫైన్ కట్టాల్సిందే అంటున్నారు ముంబై ట్రాఫిక్ పోలీసులు. ముంబై మేయర్ వాహనం రాంగ్ పార్కింగ్ చేశారని ట్రాఫిక్ చలాన్ జారీ చేశారు. నగరంలోని విలే పార్లే పక్కన బీఎంసీ నో పార్కింగ్ సైన్ బోర్డు దగ్గర ముంబై మేయర్ విశ్వానంద్ మహదేశ్వర్ అధికారిక వాహనాన్ని పార్కింగ్ చేశారు.

దీంతో జరిమానా విధించినట్టు ట్రాఫిక్ అధికారి ఒకరు తెలిపారు. అంథేరి, విలే పార్లే ప్రాంతంలోని పాపులర్ కోస్టల్ ఫిష్ ఫుడ్ జాయింట్ దగ్గర అధికారిక వాహనం నిలిపి ఉంచినట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఆ ఏరియా అంతా ఇరుక్కగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని నో పార్కింగ్ జోన్ గా ప్రకటించినట్టు చెప్పారు.

ఈ ప్రాంతంలో వాహనం నిలిపి ఉంచడంతో ట్రాఫిక్ ఉల్లంఘన కింద చలాన్ జారీ చేసినట్టు సీనియర్ అధికారి తెలిపారు. ముంబై మేయర్ వాహనానికి ఎంత జరిమానా విధించారు అనే విషయం వెల్లడించలేదు. బ్రిహ్మన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారిక విభాగం గతవారం నుంచి ఈ ప్రాంతంలో రాంగ్ పార్కింగ్ వాహనాలపై డ్రైవ్ నిర్వహిస్తోంది.

ఈ డ్రైవ్‌లో జరిమానాల రూపంలో లక్షల రూపాయలను వసూల్ చేశారు. మెట్రో పోల్స్, అధికారిక పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాల్లో 500 మీటర్ల దూరంలో నిలిపిన వాహనాలపై మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తున్నట్టు అధికారి తెలిపారు. 

Mumbai Mayor
traffic challan
Vehicle
Vishwanath Mahadeshwar
BMC
no-parking signboard 

మరిన్ని వార్తలు