ముంబై విద్యార్థి రికార్డు.. అన్ని సబ్జెక్టుల్లో 35/100 పాస్ మార్కులు

Submitted on 13 June 2019
Mumbai Student Creates History, Scores 35/100 In All Subjects 

కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో హైస్కోరు సాధించేందుకు రాత్రింబవళ్లు తెగ కష్టపడతారు. పరీక్షలు దగ్గర పడుతుండేసరికి ప్రతి చాప్టర్ పూర్తి చేయాలని ఆరాట పడుతుంటారు. పరీక్ష ఫలితాల్లో అనుకున్న హైస్కోరు రాలేదని ఫీల్ అవుతుంటారు.

మరికొంతమంది విద్యార్థులు అంతకష్టం పడలేము బాబోయ్.. జెస్ట్ పాస్ అయితే అదే చాలు అనుకుంటారు. కానీ, ఏదొక సబ్జెక్టు బెడిసి కొడుతుంది. అయ్యో ఫెయిల్ అయ్యామని బాధపడుతుంటారు. కానీ, ముంబైకి చెందిన SSC విద్యార్థికి ఆ దిగులు అసలే లేదు. అన్ని సబ్జెక్టులు అలవోకగా పాసై హిస్టరీ క్రియేట్ చేశాడు. 

అన్ని సబ్జెక్టులో 100కు 35 మార్కులతో టెన్త్ క్లాస్ విజయవంతంగా పూర్తి చేశాడు. అతడే.. అక్షిత్ జాదవ్.. ముంబై మీరా రోడ్డులోని శాంతి నగర్ హైస్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. రాసిన అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు సాధించి మినీ ఇంటర్నెట్ సెలబ్రెటీగా మారిపోయాడు. పదో తరగతి రిజల్ట్స్ తర్వాత అక్షిత్ సోషల్ మీడియాలో, స్థానిక మీడియా ఛానెళ్లలో పాపులర్ అయిపోయాడు.

అక్షిత్ ను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ప్రతినిధులు క్యూ కట్టేశారు. కనీసం పాస్ అవుతాడో లేదో అని భయపడిన అక్షిత్ తండ్రి కూడా తన కుమారుడు పాస్ మార్కులుతో పాస్ కావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసి.. SSC పాస్ అయినందుకు తమ కుటుంబం అంతా ఆనందంగా ఉందని అన్నాడు. 

అక్షిత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అందరిలానే హై స్కోరు సాధించాలని పరీక్షకు వెళ్లలేదు. పాస్ అవుతానని కూడా ఊహించలేదు. లక్కీగా 35 మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాను. పరీక్ష పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు. ముంబైలో జరిగిన SSC పరీక్షల్లో మొత్తం 16లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. ఈ ఏడాది 77.10 శాతంతో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 20 మంది వరకు 100 శాతం మార్కులు సాధించారు. 

Mumbai Student
SSC Pass marks
All Subjects
Clears Boards

మరిన్ని వార్తలు