బంజారాహిల్స్ GVK మాల్ దగ్గర దారుణం : రక్తపుమడుగులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్

Submitted on 26 May 2019
Mystery shrouds IT managers death in Banjara Hills

హైదరాబాద్ : బంజారాహిల్స్ దారుణం జరిగింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. శనివారం(మే 25, 2019) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జీవీకె మాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శివనాగరాజు అనే టెక్కీని దుండగులు గొంతు కోసి చంపారు. ఆ తర్వాత భవనంపై నుంచి కిందికి తోసేశారు. నాగరాజు జారో ఎడ్యుకేషన్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 8లోని 5 అంతస్తుల భవనం మీద నుంచి కిందపడ్డాడు. మొదట దీన్ని ఆత్మహత్యగా పోలీసులు అనుకున్నారు. తర్వాత నాగరాజు ఒంటిపై కత్తిగాట్లను గమనించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

శివనాగరాజు బిల్డింగ్‌ పైనుంచి కిందపడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివనాగరాజు ఒంటి మీద కత్తి ఘాట్లు ఉన్నాయని, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత వివరాలు తెలుస్తాయని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి ఆఫీస్ లోపల సీసీ కెమెరాలు ఆపేశారని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు ఎవరు ఆపారు అనేది తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆఫీస్ మేనేజర్‌తో పాటు సిబ్బందిని విచారిస్తున్నారు.

ఘటన జరిగిన సమయంలో ఆఫీస్ లో శివ తప్ప మరెవరూ లేరని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు నాగరాజు తన భార్య నవ్యకి ఫోన్ చేశాడు. ఇంటికి లేట్ గా వస్తానని చెప్పాడు. రాత్రి 8.30గంటలకు నవ్య భర్తకి కాల్ చేసింది. కానీ ఫోన్ రీచ్ కాలేదు. పలుసార్లు కాల్ చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. శనివారం ఉదయం 4 గంటలకు నవ్య తన బంధువు గౌతమ్ ని.. భర్త నాగరాజు ఆఫీస్ కి పంపింది. నాగరాజు గురించి తెలుసుకోవాలని చెప్పింది. అక్కడ ఫ్లోర్ మీద నాగరాజు శవం చూసి గౌతమ్ షాక్ తిన్నాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 302 (మర్డర్) కింద కేసు నమోదు చేశారు. నాగరాజు హయత్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అతడి స్వస్థలం కృష్ణా జిల్లా. 

Mystery
shrouds
IT managers death
Banjara Hills
murder
software engineer
shiva nagaraju
jaro education

మరిన్ని వార్తలు