BHEL సీఎండీగా నళిన్ సింఘాల్

Submitted on 9 July 2019
Nalin Shinghal takes over as BHEL Chairman

బీహెచ్‌ఈఎల్‌ చైర్మన్,మేనేజింగ్ డైరక్టర్(CMD) గా నళిన్‌ సింఘాల్‌ ను కేంద్రం నియమించింది. మంగళవారం(జులై-9,2019) బీహెచ్‌ఈఎల్‌ ఈ విషయాన్ని  ప్రకటించింది. బీహెచ్‌ఈఎల్‌ బాధ్యతలు చేపట్టక ముందు నళిన్ సింఘాల్.. సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ కు సీఎండీగా పని చేశారు. సింఘాల్‌ ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ లో బీటెక్‌ డిగ్రీని అందుకొన్నారు.

ఐఐఎం కోల్‌కతా నుంచి పీజీడీఎంను పూర్తి చేశారు. ఆయన ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీసులో పనిచేశారు. దీంతోపాటు ఆయన కాన్‌కోర్‌, ఐఆర్‌సీటీసీ, సీఈఎల్‌లో వివిధ రకాల బాధ్యతలను చేపట్టారు. ఆయన రైల్వే మంత్రిత్వశాఖలో కీలక నిర్ణయాలు తీసుకునే లాంగ్‌రేంజ్‌ సపోర్టిగ్‌ గ్రూప్‌లో కూడా పనిచేశారు.

CMD
NALIN SINGHAL
BHEL
ANNOUNCE

మరిన్ని వార్తలు