National News

Thursday, July 27, 2017 - 11:31

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా నితీష్ అరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటి సీఎంగా సుశీల్ మోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ తివారి... నితీష్ కుమార్, సుశీల్ మోడీల చేత ప్రమాణస్వీకారం చేయించారు. 

 

Thursday, July 27, 2017 - 11:27

బీహార్ సీఎం రాజీనామా చేయడం... 24 గంటలు గడవక ముందే మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు వుండరు. శాశ్వత మిత్రులు వుండరు అన్న సామెత బీహార్ రాజకీయాలకు సరిపోతోంది. నిన్నమొన్నటివరకు ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకున్న జేడీయూ-ఆర్జేడీలు పార్టీలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయాయి. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం...

Thursday, July 27, 2017 - 08:51

ఢిల్లీ : టీమిండియా టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చటేశ్వర్‌ పుజారా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. గాలే టెస్ట్‌లో మరో అసలు సిసలు టెస్ట్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. ధావన్‌తో డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం జోడించిన పుజారా...టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. ట్రేడ్‌ మార్క్‌ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన పుజారా173 బంతుల్లో సెంచరీ మార్క్‌ దాటాడు. సెంచరీ పూర్తయ్యాక...

Thursday, July 27, 2017 - 07:36

పాట్నా : బీహార్ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. రాజీనామా చేసిన కొన్ని గంటలకే ఎన్ డీఏ శాసనసభపక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం జేడీయూకు బీజేపీ మద్దతు ఇచ్చింది. ఉదయం 10 గంటలకు జేడీయూ, బేజీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 132 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్లు ఇరు పార్టీలు గవర్నర్ కు వెల్లడించాయి. నితీష్ కుమార్ సీఎంగా మళ్లీ...

Thursday, July 27, 2017 - 07:31

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే కేంద్ర నిర్ణయం వల్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు ఉపాధ్యాయ,బాలల హక్కుల సంఘాలు, విద్యార్ధిసంఘాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్రంగా తప్పుపడుతోంది. అయితే రాష్ట్రంలో అమలుచేసేందుకు ప్రభుత్వం నిరాకరించినప్పటికీ కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో...

Wednesday, July 26, 2017 - 21:32

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యంపై సిపిఎం ఆందోళనకు సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు 6 అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టనున్నట్లు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. రైతుల రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, జిఎస్‌టి అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, ప్రయివేటీకరణ, మహిళలకు రిజర్వేషన్లపై ఆందోళన...

Wednesday, July 26, 2017 - 21:25

హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు. ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్ రెండో రోజూ ఇదేపనిపై పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు. మోదీతో భేటీ అయిన కేసీఆర్‌... అసెంబ్లీ స్థానాల పెంపు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులపై చర్చించారు. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను వరుసగా కలిశారు. మొదటగా ఏన్డీఏ...

Wednesday, July 26, 2017 - 21:19

పాట్నా : బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్‌కుమార్‌ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ వ్యవహారంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో నితీష్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో తాను పనిచేయలేనని... అంతరాత్మ ప్రబోదం ప్రకారం తానీ నిర్ణయానికి వచ్చినట్లు నితీష్‌ తెలిపారు. బీహార్...

Wednesday, July 26, 2017 - 20:33

పాట్నా : బీహార్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ? ఎన్నికలకే నితీష్ మొగ్గు చూపుతారా ? నితీష్ ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా ? లాలూ - నితీష్ స్నేహహస్తం బెడిసికొట్టిందా ? ఇలా అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. మహాకూటమి విచ్చినమయ్యే పరిస్థితి...

Wednesday, July 26, 2017 - 19:14

పాట్నా : బీహార్ రాష్ట్రంలో రాజకీయం ముదిరిపోయింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆ నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామా చేయాలని అనలేదన్న నితీష్..
గవర్నర్ కు రాజీనామా లేఖ ఇవ్వడం జరిగిందని...

Wednesday, July 26, 2017 - 17:31

ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.... కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. ఆర్థికపరమైన అంశాలపై చర్చించారు. జీఎస్టీ నుంచి గ్రానైట్‌ రంగాన్ని సడలించాలని అరుణ్‌జైట్లీని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన 450 కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలన్నారు. మిషన్‌ భగీరథ, జల వనరులశాఖు సంబంధించిన పలు ఆర్థిక అంశాలను అరుణ్‌జైట్లీ దృష్టికి...

Wednesday, July 26, 2017 - 17:20

ఢిల్లీ : సీఎం కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా తనను కలిసినట్లు ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడు చెప్పారు. ఢిల్లీలో వెంకయ్యనాయుడుతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తమకు టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందని.. కేసీఆర్ తాను కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రస్తుతం తాను పొలిటికల్ విషయాలకు దూరంగా ఉన్నట్లు...

Wednesday, July 26, 2017 - 17:02

ఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగంపై రాజ్యసభలో దుమారం రేగింది. కోవింద్‌ జాతిపిత మహాత్మాగాంధీతో సమానంగా దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయను పోల్చడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిజెపి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూలను అవమానమించిందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా...

Wednesday, July 26, 2017 - 17:00

ఢిల్లీ : ఇరాక్‌లోని మోసుల్‌లో అదృశ్యమైన 39 మంది భారతీయులు చనిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ లోక్‌సభకు తెలిపారు. అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. నేను చెప్పేది అబద్ధమయితే అదృశ్యమైన 39 మంది భారతీయుల కుటుంబాలను కలవండి, వాళ్లే చెబుతారని పేర్కొన్నారు. ఇరాక్‌ కూడా...

Wednesday, July 26, 2017 - 14:55

మధ్యప్రదేశ్ : రాష్ట్రంలో సంచలనం రేపిన వ్యాపం ప్రధాన సూత్రధారి ప్రవీణ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేగుతోంది. ఆయన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో తెలియరాలేదు. వ్యాపమ్ పేరిట జరిగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అడ్మిషన్ కోసం జరిగే పరీక్షల్లో భారీ ఎత్తున స్కాం జరిగిన సంగతి తెలిసిందే. వ్యాపమ్ స్కాంతో సీనియర్...

Wednesday, July 26, 2017 - 14:50

ముంబై : ఓ ప్రాంతంలో నాలుగు అంతస్తులు భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య  17కి చేరుకుంది. ఈ ఘటనకు సంబంధించి శివసేన కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. శివసేన నేత సునీల్ కితాబ్ కు చెందిన నర్సింగ్ హోం ను పునరుద్ధరిస్తున్న సమయంలో భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. నిర్లక్ష్యం చేశారన్న దానిపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 28 మందిని రెస్క్యూటీం సురక్షితంగా కాపాడింది....

Tuesday, July 25, 2017 - 21:53

ఢిల్లీ : రైతుల ఆత్మహత్యలపై రాజ్యసభలో  విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సమయంలో రైతుల పెట్టుబడికన్న ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోది హామీ ఏమైందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ నిలదీశారు. మద్దతు ధరపై రమేష్‌ చంద్ర కమిటీ ఇచ్చిన నివేదికపై ఎందుకు...

Tuesday, July 25, 2017 - 21:51

ఢిల్లీ : ఏ దేశంతోనైనా యుద్ధమే గనక సంభవిస్తే 10 రోజులకు మించి పోరాడే ఆయుధ సంపత్తి మనవద్ద లేదని కాగ్‌ ఇచ్చిన నివేదికపై రాజ్యసభలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. చైనా-పాకిస్తాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మనవద్ద ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సరిపడా లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు రామ్‌గోపాల్‌ యాదవ్ అన్నారు....

Tuesday, July 25, 2017 - 17:30

ఢిల్లీ : పశ్చిమగోదావరి జిల్లా గరగర్రులో జరిగిన దళితుల సాంఘిక బహిష్కరణను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. దళితలను సాంఘికంగా బహిష్కరించడం తప్పు అని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని చెప్పారు. 

Tuesday, July 25, 2017 - 17:18

ఢిల్లీ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, ఆతర్వాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్‌తో భేటీ అయ్యారు. పోలరవం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులపై చర్చించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో కూడా చంద్రబాబు భేటీ...

Tuesday, July 25, 2017 - 17:15

ఢిల్లీ : స్పూర్తి గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నానని నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. 14వ రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ లో అడుగు పెట్టిన సమయంలో గత అనుభవాలు గుర్తుకొచ్చాయన్నారు. తాను చిన్న గ్రామంలో..మట్టి ఇంట్లో జన్మించడం...

Tuesday, July 25, 2017 - 17:13

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నియమితులయ్యారు. కాసేపటి క్రితం పార్లమెంట్ సెంట్రల్ హౌస్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధానులు,...

Tuesday, July 25, 2017 - 16:54

ఢిల్లీ : భారత దేశ 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్ కోవింద్‌ చేత ప్రమాణం చేయించారు.  రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా కోవింద్‌ గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా 21 శతఘ్నులను పేల్చి సైన్యం...

Tuesday, July 25, 2017 - 08:06

ఢిల్లీ : రాబోయే సంవత్సరం నుంచి వైద్య విద్యకు దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష..ఒకే ప్రశ్నాపత్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్ ఎగ్జామ్‌పై పలు రాష్ట్రాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాంతీయ భాషల్లో రూపొందించిన ప్రశ్నాపత్రం కఠినంగా ఉండటం..ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వడం వివాదాస్పదమైంది. దీంతో పలు రాష్ట్రాల్లో విద్యార్థులు,...

Pages

Don't Miss