National News

ఢిల్లీ : రాఫెల్ డీల్ పై కాంగ్రెస్...బీజెపి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని హోలాండే ప్రకటన చిచ్చు రాజేస్తోంది. తాజాగా మరోసారి దీనిపై పలు వ్యాఖ్యలు చేశారు. మోడీపై పలు ఆరోపణలు గుప్పించారు. 

ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని, పలు స్కాంల కారణంగా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని...మాజీ ప్రధాని మన‍్మోహన్‌  విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒప్పందంకంటే 9 శాతం తక్కువకే ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ హాయాంలోనే ఈ ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. 2012లో జరిగిన ఈ ఒప్పందం దేశ చరిత్రలో ప్రధానిపై ఈ తరహా ఆరోపణలు ఏ పార్టీ అధ్యక్షులు చేయలేదని వివరించారు. 

ఢిల్లీ : బీజేపీ...ఆర్ఎస్ఎస్ నుండి బయటకొచ్చేయాలంటూ మోహన్ లాల్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో విన్నపాలు చేస్తున్నారు. ఇటీవలే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మోహన్ లాల్ సమావేశమైన సంగతి తెలిసిందే.  ఈ భేటీ సెప్టెంబర్ 3వ తేదీన జరిగింది. అనంతరం ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ఫేస్ బుక్ లో అభిమానులతో పలు విషయాలను పంచుకున్నాడు. కేరళ రాష్ట్రానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటానని మోడీ పేర్కొనడం జరిగిందని మోహన్ లాల్ తెలిపారు. ఇతర విషయాలను కూడా ఆయన వెల్లడించారు. 

దీనిపై ఆయన అభిమానులు స్పందించారు. భిన్నమైన అభిప్రాయాలను తెలియచేశారు. 776 మంది వ్యాఖ్యలు చేయగా 9000 వేల మంది లైక్ చేసి షేర్ చేశారు. ‘తాము వీరాభిమానులం...కానీ ఈ భేటీ నిరుత్సాహానికి గురి చేసింది. ఆర్ఎస్ఎస్..బీజేపీ నుండి బయటకు రావాలి. లేనిపక్షంలో కేరళ రాష్ట్రంలో ఉన్న అభిమానును కోల్పోవాల్సి వస్తుంది’ అంటూ పేర్కొన్నారు. చివరగా బీజేపీ కూడా దీనిపై స్పందించింది. బీజేపీ అభ్యర్థి అంటూ పుకార్లు వస్తున్నాయని, ఇందులో నిజం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు వి.మురళీధరన్ వ్యాఖ్యానించారు. 

రాజస్థాన్ : బీర్ బాటిళ్లతో వెళ్తున్న ట్రక్కు టోల్ ప్లాజాను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. కిషన్‌బాగ్ జిల్లాలో శుక్రవారం బీర్ బాటిళ్లతో వెళ్తోన్న ట్రక్కు జైపూర్..అజ్మీర్ నేషనల్ హైవేపై ఉన్న టోల్‌ప్లాజాను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ట్రక్కు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. ట్రక్కులోని బీరు బాటిళ్లు ముందువెళ్తున్న వాహనంపై పడ్డాయి. బీరు బాటిళ్లు చెల్లాచెదరుగా పడి పగిలిపోయాయి. బాలిళ్లు పగలడంతో అందులోని బీరంతా నీటి ప్రవాహం లాగా ముందున్న వాహనంపై పడింది. అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాచ్ వీడియో...

ఢిల్లీ :  ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచకపడ్డారు. రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు రాజకీయాల్లో మంట రాజేస్తోంది. రాహుల్ వీటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు ఆరోఫణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ కు ఫ్రాన్్స మాజీ అధ్య‌క్షుడు హోలాండే చేసిన ప్రకటన మరింత బలం ఇచ్చినట్లైంది. శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని హోలాండే ప్రకటన చిచ్చు రాజేస్తోంది. 

దీనిపై రాహుల్ ఎదురుదాడిని మరింత ఉధృతం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీలు ఇద్దరు కలిసి భారత రక్షణ వ్యవస్థపై రూ.130వేలకోట్లతో సర్జికల్ దాడులు నిర్వహించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రూ.30,000 కోట్ల విలువైన రాఫెల్ కాంట్రాక్టును అనిల్ అంబానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. అనిల్ అంబానీ జీవితంలో ఇప్పటి వరకూ యుద్ధ విమానాలను తయారు చేయలేదనీ, ఆయన పేరుపై ఇప్పటికే రూ.45,000 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల రక్తాన్ని మోడీ అగౌరవ పర్చారని ఒక విధంగా సిగ్గుపడాల్సి అంశమని వెల్లడించారు. ఇన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా మోడీ ఎందుక సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారు. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారని రాహుల్ విరుచుకుపడ్డారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి సీతారామన్ లు రాజీనామాలు చేయాలని, ఈ ఘటనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో ఒక్కో రాఫెల్ యుద్ద విమానం కోసం రూ.570 కోట్లతో ఒప్పందం జరగ్గా.. మోదీ సర్కార్ ఒక్కో విమానంపై రూ.1670కోట్లు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డసాల్ట్‌తో కుదిరిన ఒప్పందం మేరకు నాగపూర్‌లో రిలయన్స్ సహకారంతో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫాల్కన్‌తో పాటు రాఫెల్ విమానాల విడి భాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. తాజాగా రాహుల్ చేసిన విమర్శలపై బీజేపీ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 

 

అయ్యో ఎక్కడ నిషేధం..అనుకుంటున్నారా ? రెండు సంవత్సరాల పాటు పైన పేర్కొన్న మందు కావాలంటే దొరకదు. ఎందుకంటే అలాంటి మద్యంపై నిషేధం విధించారంట. మద్యంలో పలు రకాల బ్రాండ్లను పలు కంపెనీలు ప్రవేశ పెడుతుంటాయి. అందులో కొన్ని రకాలు చాలా ఖరీదుగా ఉంటాయి. తాజాగా దేశ రాజధానిలో వ్యాట్ 69, స్పిన్ ఆఫ్ మద్యంపై నిషేధం విధించనున్నారు. మద్యం తయారు చేసే కంపెనీ నిబంధనలు ఉల్లఘించడంతో అక్కడి ప్రభుత్వం సదరు కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టింది. ఢిల్లీ ఆర్థిక కమిషనర్ ఓ జాతీయ పత్రికతో మాట్లాడారు. రాష్ట్ర ఎక్సైజ్ యాక్టు 2009 ప్రకారం యుఎస్ఎల్ నిబంధనలు అతిక్రమించిందన్నారు. దేశ రాజధానిలో రెండు సంవత్సరాల వరకు బ్యాన్ విధించడం జరిగిందన్నారు. 

హిమాచల్‌ప్రదేశ్‌ : సిమ్లా జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జీపు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో సుమారు 13 మంది మృతి చెందారు. సనాలీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక చిన్నారి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

అమరావతి : ఏసీ సీఎం చంద్రబాబు నాయుడికి ఐక్యరాజ్యసమితి అరుదైన గౌరవాన్ని అందించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రసగించాల్సిందిగా చంద్రబాబును కోరుతు ఐక్యరాజ్యసమితి ఆహ్వానంపంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 22న అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. 28వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రసంగించనున్నారు. 'సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లు-ఏపీలో సహజ వ్యవసాయాభివృద్ధి విధానాలు' అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. 
అనంతరం 25న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 26న కొలంబియా యూనిర్శిటీలో 'గవర్నెన్స్ ఇన్ ది ఏజ్ ఆఫ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగిస్తారు. అమెరికాకు చంద్రబాబుతో పాటు మంత్రి యనమల, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్తున్నారు.

 

కర్ణాటక : కన్నడలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చినట్లుగా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటుకు నానా కష్టాలు పడి ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి ప్రభుత్వం కూలిపోనుందా? సంకీర్ణప్రభుత్వాన్ని కూల్చివేసే దిశగా బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. బీజేపీ నేతలు గవర్ణర్ ను కలిసేందుకు సన్నద్ధం అవతున్న నేపథ్యంలో వీటికి బలం చేకూర్చేలా వాతావరణ వేడెక్కింది. కాంగ్రెస్, జేడీఎస్ నుండి దాదాపు 20మంది ఎమ్మెల్యేలు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. తమ డిమాండ్లకు కుమారస్వామి ఒప్పుకోవాలని ముంబై నుండి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెలే్యలు కథను నడిపిస్తున్నారు.  దీనికోసము కాచుకుని కూర్చున్న బీజేపీ వారిని తమవైపు లాక్కుని ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా పావులు కదుపుతోంది. దీనిపై స్పందించి ముఖ్యమంత్రి కుమార స్వామి ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.15 కోట్లు ఎరవేసి తమవైపు లాక్కునేందుకు బీజేపీ బేరసారాలు నడుపుతోందని ఆరోపించారు. ఈ హాట్ హాట్ వాతావరణం చూస్తుంటే కుమారస్వామి సీెఎం పదవి ప్రమాదంలో పడినట్లుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

 

పంజాబ్‌ : పంజాబ్‌లోని లూథియానాలో పుట్టింటి.పట్టుదలతో మేటి అనిపించుకుంది.చిన్న వయసులోనే రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌ శరీరాన్ని కుంగదీస్తున్నా..సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించుకుంది. చిన్న చిన్న సమస్యలకు నిండు జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచన వున్నవారి ఈమెను చూస్తే ఖచ్చితంగా స్ఫూర్తి పొందుతారు.ఆమే పర్వీందర్‌ చావ్లా
నడవలేదు..కానీ చక్రాల కుర్చీపై 23 దేశాలు పర్యటించిందామె. చిన్న వయసులోనే  రుమటాయిడ్‌ ఆర్థ్రరయిటిస్‌కి గురైంది. 
కనీసం తిండికూడా తనంతట తాను తినలేని అశక్తతతో ఉండే పర్వీకి తల్లే అన్నీ చేసేది. ఆ పరిస్థితితో మంచానికే పరిమితం కానీ పర్వీ డిగ్రీ చేసింది. అనంతరం ఉద్యోగంలో చేరింది. అలా నాలుగుగోడలమధ్యే ఉండిపోకుండా బయటి ప్రపంచాన్ని చూడాలనే కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలనుకుని నిశ్చయించుకుంది. దీంతో కాల్‌సెంటర్‌లో చిన్నపాటి ఉద్యోగం చేస్తునే ఓ కేటరింగ్‌ సర్వీస్‌ను ప్రారంభించి తానే నిర్వహించేది. తరువాత తన స్నేహితులతో కలిసి వెళ్లడానికి సిద్ధమై ప్రయాణంలో అన్ని ఖర్చులను తానే సంపాదించుకుంది. 
స్నేహితులతో గుల్మార్గ్‌, జమ్ము కాశ్మీర్‌ వంటి ప్రాంతాలన్నింటినీ చుట్టి వచ్చింది. అలా వెళ్తున్నప్పుడు తోటి స్నేహితులు తనవల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఓ ఆటోమేటిక్‌ వీల్‌ఛెయిర్‌ను ఏర్పాటు చేసుకుంది. తరువాత ప్రపంచాన్నీ చుట్టిరావాలనే ఆలోచనను కలిగించింది. కనీ ఈసారి ఒంటరిగానే వెళ్లాలనుకుంది.  ట్రావెల్స్‌ సంస్థలు ఆమె పరిస్థిని  చూసి ఒప్పుకోలేదు. అయినా ఆమె మానలేదు. ఒంటరిగా ప్రయాణించేందుకే సిద్ధమయ్యింది.
అలా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లతో యూరప్‌ దేశాలన్నింటినీ రెండు ,మూడుసార్లు చుట్టి వచ్చిందామె. అలాగే చైనా, రోమ్‌, ఆస్ట్రేలియా, దుబాయ్‌ వంటి 23 దేశాలు పర్యటించింది పర్వీ. అయితే అది చెప్పినంత సులువు కాదు.ఈ నేపథ్యంలో పలు శారీరక సమస్యలను కూడా ఎదుర్కొంది. కానీ దివ్యాంగురాలై కూడా తనకంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా, తనలాంటి   వారిలో స్ఫూర్తిని కలిగించిందీ పర్వీ అనటంలో ఏమాత్రం సందేహం లేదు.

 

న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు సెస్టెంబర్ 29 తేదీని సర్జికల్ దినోత్సవం రోజుగా పాటించాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులకు సంఘీభావంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆరోజు ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉత్తరాలను యూజీసీ పంపించింది.

యూజీసీ ఇచ్చిన ఆదేశాలపై జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) అద్యాపకులు విమర్శించారు. ఇది విశ్వవిద్యాలయాల్లో యుధ్ధ టాంకులను మొహరింపచేయడమేనని.. దీని ద్వారా బీజేపీ నేతలు తమను తాము జాతీయవాదులుగా నిరూపించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

రాజకీయ లబ్దికి బీజేపీ కుట్ర : కాంగ్రెస్

సర్జికల్ స్ట్రైక్ దినోత్సవాన్ని జరపాలని యూజీసీ ఆదేశించడం రాజకీయ దురుద్దేశమేనని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీని ద్వారా రాజకీయ లబ్దిపొందేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ కపిల్ సిబాల్ విమర్శించారు. ఇటువంటి చర్యలవల్ల విశ్వవిద్యాలయాలు స్వతంత్రతను కోల్పోతాయని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూజీసీ ఈ తరహా సర్కులర్‌లను జారీచేయలేదని సిబాల్ పేర్కొన్నారు.

ఢిల్లీ : భారత క్రికెట్స్‌పై వివాదాస్ప వ్యాఖ్యలు చేయటం సర్వసాధారణంగా మారిపోయింది. టీమిండియా గెలుపులను చూసి ఓర్వలేని పాక్ క్రికెటర్స్ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పిచ్చి పిచ్చి వ్యాఖలు చేస్తుంటారు. ఈ క్రమంలో పాక్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై వెటకారపు మాటలు మాట్లాడాడు. ఆసియా క‌ప్‌లో పాకిస్థాన్‌తో ఫైన‌ల్స్‌తో స‌హా భార‌త్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇది ముందే ఊహించి కోహ్లీ ఆసియా కప్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. పాకిస్థాన్ జ‌ట్టుతో ఆడ‌డానికి కోహ్లీ భ‌య‌ప‌డి ఉంటాడు. ఇంగ్లండ్‌తో అన్ని మ్యాచ్‌లూ ఆడిన‌వాడు ఆసియా క‌ప్ నుంచి ఎందుకు నిష్క్ర‌మించాడని త‌న్వీర్ విమ‌ర్శించాడు. త‌న్వీర్ వ్యాఖ్య‌ల‌పై టీమిండియా క్రికెట‌ర్ గౌత‌మ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. విరాట్ కోహ్లీ ఇప్ప‌టికే 35-36 సెంచ‌రీలు చేశాడు. అలాంటి అట‌గాడికి మ‌రో సెంచ‌రీ చేయ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. కానీ, త‌న్వీర్ అనే ఆట‌గాడు క‌నీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడ‌లేక‌పోయాడు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది` అని గంభీర్ రిప్లై ఇచ్చాడు.

మధ్యప్రదేశ్  : గత కొంతకాలంగా ఎస్సీ, ఎస్టీ చట్టంపై దేశ వ్యాప్లంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాజాగా సాక్షాత్తు  సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో దానికి మరింత వేడి రాజుకుంది.  ఎస్సీ, ఎస్టీ చట్టంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో విచారణ లేకుండా అరెస్టులు ఉండవని పేర్కొన్నారు. శివరాజ్ తాజా వ్యాఖ్యలు మధ్యప్రదేశ్‌లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీన్ని ఎన్నికల స్టంట్‌గా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అగ్రవర్ణాలను సంతృప్తి పరిచే వ్యూహంలో భాగంగా శివరాజ్ సింగ్ ఈ విధమైన ప్రకటన చేశారంటున్నారు.
 
ఎస్సీ, ఎస్టీ చట్టంలో మార్పులు ఉండవని కేంద్రం గత నెలలో తేల్చి చెప్పింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని వ్యాఖ్యానించింది. దళితులపై దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అందుకు కారణమైన వారిని ఎలాంటి విచారణ చేయకుండా అరెస్టు చేయడం సరికాదని తన తీర్పులో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఇప్పుడున్న చట్టాన్ని నీరుగారిస్తే భవిష్యత్తులో దళితులపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని విపక్షాలు, దళిత సంఘాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మార్పులు తీసుకురావడంలేదని కేబినెట్ తీర్మానం ద్వారా స్పష్టం చేసింది.

 

మహారాష్ట్ర : ధర్మాబాద్ కోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు చుక్కెదురైంది. బాబ్లీ కేసులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. చంద్రబాబు వేసిన రీకాల్ పిటిషన్‌ను ధర్మాబాద్ కోర్టు తిరస్కరించింది. అక్టోబర్ 15కు విచారణను వాయిదా వేశారు. నోలీసులు అందుకున్నవారంతా విచారణకు హాజరు కావాలని కోర్టు అదేశించింది. ప్రకాశ్‌గౌడ్, గంగుల కరుణాకర్, కేఎస్ రత్నానికి బెయిల్ మంజూరు అయింది. రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. 

 

మహారాష్ట్ర : బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తరుపు లాయర్లు ధర్మాబాద్ కోర్టుకు హాజరైయ్యారు. అడ్వకేట్, రాజ్యసభ సభ్యులు కనకమేడల కవీంద్ర కుమార్ నేతృత్వంలో లాయర్ల బృందం ధర్మాబాద్‌కు వెళ్లింది. రెండు రాష్ట్రాల మధ్య సమస్య కావడంతో ఏఏజీ కీలక పాత్ర పోషించనుంది. కాగా కోర్టులో ఏపీ ప్రభుత్వం రీకాల్ పిటిషన్ వేసింది. చంద్రబాబు కోర్టుకు ఎందుకు రాలేదో లాయర్లు వివరించనున్నారు. 

 

భారతదేశంలో అత్యంత కుబేరుడిగా పేరొందిన ముకేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం కార్యక్రమం శుక్రవారం జరుగనుంది. బిజినెస్ దిగ్గజం అజయ్ పిరమాల్ కుమారుడైన ఆనంద్ పిరమాల్ తో ఈ 'ఎంగేజ్‌మెంట్' జరుగనుంది. ఇందుకు అంబానీ కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురిని అంబానీ కుటుంబం ఆహ్వానించింది. కానీ ఈ వేడుక మాత్రం భారతదేశంలో జరగడం లేదు. ఇటలీలోని 'లేక్ కోమో'లో అట్టహాసంగా జరిగే నిశ్చితార్థం వేడుక మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటులతోపాటు ముకేశ్ అంబానీకి చెందిన దగ్గరి బంధువులు హాజరుకానున్నారు. 

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిశ్చితార్థ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శనివారం సంగీత్‌ వేడుకలు, ప్రత్యేక డిన్నర్‌...ఆదివారం లంచ్‌తో నిశ్చితార్థ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకకు వచ్చే అతిథులకు ప్రత్యేక డ్రెస్ ను ఎంపిక చేశారని టాక్. గత కొంతకాలంగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ లు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. మే నెలలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేమజంటను ఆశీర్వదించారు. డిసెంబర్‌లో వీరి వివాహాం జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల నిశ్చితార్థం జూన్‌లో జరిగిన విషయం తెలిసిందే. 

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఉగ్రవాదుల అరాచకానికి పాల్పడ్డారు. ముగ్గురు పోలీసులను కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేశారు. షోపియాన్‌లో స్పెషల్‌ పోలీస్‌ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నఫిర్దోస్‌ అహ్మద్‌ కుచే, కుల్దీప్‌ సింగ్‌, నిసార్‌ అహ్మద్‌ ధోబీలతో పాటు నిసార్‌ సోదరుడు ఫయాజ్‌ అహ్మద్‌ భట్‌ను హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు ఉదయం కిడ్నాప్‌ చేశారు. ఇళ్లల్లోకి చొరబడి వారిని అపహరించారు. అయితే గ్రామస్థుల సాయంతో నిసార్‌ సోదరుడు ఫయాజ్‌ తప్పించుకోగా.. మిగతా ముగ్గురిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారిని చంపేసినట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఈ ముగ్గురిని ఉగ్రవాదులు బెదిరించినట్లు తెలుస్తోంది. ‘నాలుగు రోజుల్లో మీరు ఉద్యోగాలకు రాజీనామా చేయండి. లేదంటే ప్రాణాలు పోతాయి’ అని ఉగ్రవాదులు బెదిరించినట్లు అధికారులు తెలిపారు.

గత నెలలో పోలీసుల కుటుంబాలకు చెందిన 8 మంది వ్యక్తులను ఉగ్రవాదులు అహపరించుకుపోయిన విషయం తెలిసిందే. వాంటెడ్‌ ఉగ్రవాది సయ్యద్‌ సలాహుద్దీన్‌ కుమారుడిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడంతో ఉగ్రవాదులు ఈ కిడ్నాప్‌లకు పాల్పడ్డారు. అయితే ఆ తర్వాత వారిని విడిచిపెట్టినట్లు సమాచారం.

ఉత్తర్ ప్రదేశ్ : రాష్ట్రంలో శిశు మరణాలు ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా చిన్నారులు మృతి చెందుతుండడంతో కలకలం రేపుతోంది. గతంలో ఉత్తర్ ప్రదేశ్ లోని బాబా రాఘవ్ దాస్ (బీఆర్డీ) మెడికల్ కాలేజీలో సుమారు 70 మందికి పైగా చిన్నారుల మరణాలు సంభవించిన సంగతి తెలిసిందే. తాజాగా బాహ్రయిచ్ ప్రాంతంలో 45 రోజుల వ్యవధిలో 71 మంది చిన్నారులు మృత్యువాత పడడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి సూపరిటెండెంట్ డీకే సింగ్ ఈ విషయంపై ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. 

వివిధ అనారోగ్య కారణాలతో చిన్నారులు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారని, ఆసుపత్రిలోని పలు ప్రాంతాల నుండి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొస్తున్నారని తెలిపారు. కానీ ఆసుపత్రిలో పలు సమస్యలున్నాయని వెల్లడించారు. 450 మంది చిన్నారులు ఆసుపత్రిలో జాయిన్ అయితే కేవలం 200 బెడ్్స మాత్రమే ఉన్నాయని, కానీ చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేయడం జరుగుతోందన్నారు. మరి అక్కడి ప్రభుత్వం స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

పూణే: ఇద్దరు మైనర్ బాలికలను ఇద్దరు వ్యక్తులు చాక్‌లెట్ ఆశచూపి మానభంగం చేయడంతో ఓ బాలిక కొమాలోకి వెళ్లి మరణించిన ఘటన పూణే లోని హింజేవాడి ఏరియాలో చోటుచేసుకుంది. ఈ నెల 16న ఇంటిదగ్గలో పిల్లలిద్దరూ ఆడుకుంటుండగా, ఇద్దరు వ్యక్తులు (ఒకరు మైనర్ బాలుడు) వారికి చాక్‌లెట్లు ఇచ్చి దగ్గరలోని అటవీప్రాంతోలోకి తీసుకెళ్లి మానభంగం చేశారు. దీంతొ ఇద్దరు బాలికలు అస్వస్థతకు గురయ్యారు.

ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బాలిక తీవ్ర రక్తస్రావంతో కొమాలోకి వెళ్లి మరణించగా.. మరోబాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది. నిందితులను స్థానిక కోర్టులో శుక్రవారం హాజరుపర్చగా వారిద్దరినీ ఈ నెల 25 వరకు పోలీసు కస్టడీకి పంపించారు.

నిందితులు ఇద్దరిలో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జువెనైల్ హోమ్‌కు తరలించారు. కాగా. మైనర్ బాలుడు 11 వ తరగతి చదువుతుండగా, మరొకరు 22 వయస్సున్న డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు. ఇద్దరు బాలికల తల్లిదండ్రులు కూలీలని పోలీసులు తెలిపారు.

వియత్నాం అధ్య‌క్షుడు త్రన్ దాయి కన్నుమూశారు. ఆయన వయస్సు 61. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారని స్థానిక మీడియా వెల్లడించింది. అంతర్జాతీయ వైద్యులు ఎంతగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని వియత్నాం టెలివిజన్‌ వార్త పేర్కొంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు. 

ఢిల్లీ : భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు.

 

ఝునాఘడ్: గుజరాత్‌లోని గిర్ అడవుల్లో గత కొద్దికాలంగా 11 సింహాలు మృత్యువాతపడినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వీటి మృతికి కారణాలు అన్వేషించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అటవీశాఖ అధికారులను ఆదేశించింది.  

ఎక్కువ శాతం సింహాలు మరణించడానికి ఊపిరితిత్తులకు సోకిన ఇన్ఫెక్షన్ కారణమని అటవీశాఖకు చెందిన వెటర్నరీ అధికారులు తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరించడంతో సింహాలు మృతి చెందిఉంటాయని భావిస్తున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ ఇతర సింహాలకు, పులులకు సోకకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు.. వాటికి అవసరమైన చికిత్స చేపట్టినట్టు  హితేష్ వంజా అనే వెటర్నరీ డాక్టర్ తెలిపారు. చనిపోయిన సింహాల అంతర్గత అవయవాల శాంపుల్స్‌ను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. అయితే కొన్ని సింహాలు వాటి మధ్య జరిగిన పోరాటంలో కొన్ని సింహాలు మరణించినట్టు గుర్తించినట్టు వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ సభ్యులు తెలిపారు.  

ఢిల్లీ : భారతదేశపు క్రీడా విభాగంల్లో ఖేల్ రత్న అవార్డు అత్యుత్తమైనది. ఈ అవార్డు పొందాలని ప్రతీ క్రీడాకారుడి మనస్సు ఉవ్విళ్లూరుతుంది. అత్యుత్తమ  ప్రతిభ చాటి ఖేల్ రత్న అవార్డు పొందటం ప్రతీ క్రీడాకారుడి జీవితంలో మరపురాని కల. ఆ కలను సారాన్ని ఈ సంవత్సరానికి గాను సాకారం చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, మీరాబాయ్ చాను. 
2018 సంవత్సరానికిగానూ జాతీయ క్రీడా పురస్కారాలను అధికారికంగా ప్రకటించారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఇవాళ క్రీడా పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేసింది. అందరూ ఊహించిన విధంగానే... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చానులకు భారత అత్యన్నత క్రీడా పురస్కరం ‘రాజీవ్ గాంధీ ఖేల్ రత్న’ అవార్డు దక్కింది. మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (1997), టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (2007) తర్వాత ఈ పురస్కారాన్ని అందుకున్న మూడో క్రికెటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం.
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతియేటా ఆగస్టు 29న జాతీయ క్రీడా పురస్కారాలు ప్రదానం చేస్తారు. సెప్టెంబర్ 25న ఈ క్రీడాపురస్కారాలు ఆయా క్రీడాకారులకు అందజేయనున్నారు.

 

ఢిల్లీ : ప్రతిభకు తగిన గుర్తింపు వుంటే అది మరింతగా రాణిస్తుంది. ప్రతిభను ప్రోత్సహిస్తే మరింతగా విజయాలను అందుకుంటుంది. ప్రోత్సాహం వుంటే ఎంతటివారైనా విజయాలను అందుకోవచ్చు. విజయకేతనాలను ఎగురవేయవచ్చు. ఈనేపథ్యంలో క్రీడల్లో రాణించినవారికి అవార్డులను ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రకటించే అర్జున అవార్డుల బాజితాను కేంద్ర  మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 
వివిధ క్రీడా రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే అర్జున అవార్డు గ్రహీతల విడుదల చేసింది. 2018లో వివిధ క్రీడా రంగాలకు చెందిన 20 మంది క్రీడాకారులు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నెల 25న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. కాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డును టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరా భాయ్ చాను అందుకోనున్నారు. ఇంకా అథ్లెటిక్స్-జావెలిన్ త్రో నీరజ్ చోప్రా, జిన్‌సన్ జాన్సన్ (అథ్లెటిక్స్- స్ప్రింటర్),హిమదాస్,(అథ్లెటిక్స్-స్ప్రింటర్),ఎన్.సిక్కీ రెడ్డి (బ్యాడ్మింటన్),సతీష్ కుమార్ (బాక్సింగ్),స్మృతి మందన్న (క్రికెట్),శుభంకర్ శర్మ (గోల్ఫ్),మన్‌ప్రీత్ సింగ్ (హాకీ),సవితా (హాకీ),కల్నల్ రవీ రాథోడ్ (పోలో),రహీ సర్నోబత్ (షూటింగ్),అన్‌కూర్ మిట్టల్ (షూటింగ్),శ్రేయసీ సింగ్ (షూటింగ్),మానికా బత్రా (టేబుల్ టెన్నీస్),జీ.సథియన్ (టేబుల్ టెన్నీస్),రోహన్ బొపన్న (టెన్నీస్),సుమిత్ (రెజ్లింగ్),పూజా కడియన్ (వూషూ),అన్‌కూర్ ధర్మ (ప్యారా అథ్లెటిక్స్),మనోజ్ సర్కార్ (ప్యారా బ్యాడ్మింటన్) అర్జున అవార్డులు సాధించారు. 

 

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబుపై వున్న నాన్‌బెయిలబుల్ కేసు ధర్మాబాద్ కోర్టు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ధర్మాబాద్ కోర్టులో సీఎం చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు విచారణకు రానుంది. హైదరాబాద్ నుంచి ధర్మాబాద్ కోర్టుకు న్యాయవాది సుబ్బారావును పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాబ్లీ కేసులో వాయిదాలు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా తమకు నోటీసులు అందలేదని న్యాయవాదుల బృందం కోర్టుకు విన్నవించనున్నారు. ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్, నాన్‌బెయిలబుల్ వారెంట్ కాపీలను అధికారికంగా న్యాయవాదులు తీసుకోనున్నారు. చంద్రబాబుతో పాటు 15మంది తరపున లాయర్ల బృందం పిటిషన్ వేయనుంది. 
2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన వారిలో చంద్రబాబుతో పాటు 15 మందికి ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు 15 మందిని కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోర్టు ఆదేశించింది. చంద్రబాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, టి .ప్రకాష్ గౌడ్, నక్కా ఆనంద బాబు, గంగుల కమలాకర్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు,జి.రామానాయుడు,.హెచ్.విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింభులకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: బలవంతంగా సేకరించిన నిధులతో నక్సలైట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారని నేషనల్ ఇన్విస్టిగేటింగ్ ఏజన్సీ (ఎన్ఐఏ) అనుబంధ సంస్థ తన నివేదికలో పేర్కొంది. నక్సలైట్ల నిధుల సేకరణ విధానంపై దర్యాప్తు చేస్తున్న ఈ సంస్థ తమ దర్యాప్తులో ఈ విషయం తేలిందని తెలిపింది.

తమ నమ్మకమైన రియల్ ఎస్టేట్ ఏజంట్లుగా ఉన్న మాజీ నక్సలైట్ల ద్వారా రియల్ రంగంలోకి పెట్టుబడులను తరలిస్తోందని పేర్కొంది.  వారు తమ వ్యాపారాల్లో ఈ నిధులను వాడుకొని.. నక్సలైట్లకు అవసరమైనపుడు తిరిగి ఇచ్చేస్తారని తెలిపింది. 

ఈ నిథులను సీనియర్ నక్సలైట్ల పిల్లల చదువులకు సైతం ఉపయోగిస్తున్నారని ఎన్ఐఏ అనుబంధ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

పాట్న: ఐదో తరగతి చదువుతున్న బాలికను రేప్ చేసిన కేసులో ఓ ప్రయివేటు పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్స్‌పల్, క్లర్క్‌లను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది నెలలుగా ఆ బాలికను వీరిద్దరూ మానభంగం చేసి బాలిక గర్భం దాల్చేందుకు కారణమయ్యారు.  

బాలిక స్కూల్ నుంచి రాగానే వాంతులు చేసుకోవడంతో వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. గర్భవతి అని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

 ముంబయి: ముంబాయి నుంచి జైపూర్ వెళ్లే విమానంలోని ప్రయాణీకులు గురువారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితి కలిగింది. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా ఊపిరాడని పరిస్థితి ఎదుర్కొన్నారు. తల దిమ్ముగా ఉండటంతో ప్రయాణీకులు హాహాకారాలు చేశారు. కొందరు ప్రయాణీకుల ముక్కుల్లోంచి రక్తం ధారలు కట్టడంతో సిబ్బంది అప్రమత్తమై విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబయిలో దించారు.

జెట్ ఎయిర్‌వేస్ 9డబ్ల్యూ 697 విమానం ముంబయి నుంచి జైపూర్‌కు గురువారం ఉదయం 166 మంది ప్రయాణీకులతో బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాదాపు 30 మంది ప్రయాణీకులు తల దిమ్ముగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. కేబిన్‌లో గాలి వత్తిడి తగ్గటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. అకాశంలో ఉండగానే తలనొప్పితోపాటు ఊపిరి ఆడకపోవడంతో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించినా ఇబ్బందులు తప్పలేదు. టేకాఫ్ సమయంలో సిబ్బంది గాలి వత్తిడిని మైయింటేన్ చేసే స్విచ్‌ను ఆన్ చేయకపోవడంతో ఇబ్బంది ఎదురైందని తెలుస్తోంది.

ఒక ప్రయాణీకుడి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ముంబయిలోని డాక్టర్ బాలాభాయ్ నానావతి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనసై జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. కారణాలను కనుగొనేందుకు విచారణ చేస్తున్నట్టు తెలిపింది. పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను సంఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

 

Pages

Don't Miss