National News

Wednesday, May 18, 2016 - 07:08

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన తీవ్ర వాయుగుండం మారింది. చెన్నైకి నైరుతి దిశగా కేంద్రీకృతమైన వాయుగుండం.. తుఫానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడుతో పాటు.. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

...

Wednesday, May 18, 2016 - 06:59

హైదరాబాద్ : నీట్ పై సందిగ్ధత కొనసాగుతునే ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ నిర్వహించాలా? లేదా? అన్న అంశం పై కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మెడికల్ అడ్మిషన్లకు నీట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించినా, దీని పై కేంద్రం ఇంకా తుది నిర్ణయానికి...

Tuesday, May 17, 2016 - 21:58

ఢిల్లీ : ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ఏపీ కోలుకోలేదని ప్రధానికి చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరానని చెప్పారు. నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు.

ప్రధానితో బాబు భేటీ...

Tuesday, May 17, 2016 - 15:50

ఢిల్లీ : ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను వెంటనే తొలిగించాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్‌ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా మారుతోందని లేఖలో పేర్కొన్నారు. ఆయన దేశంలో గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ ఉంటున్నారే తప్ప మానసికంగా ఆయన పూర్తి స్థాయిలో...

Tuesday, May 17, 2016 - 15:24

ఢిల్లీ : ప్రధాని మోడీతో చంద్రబాబు బృందం భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో 12 డిమాండ్లపై ప్రధానితో చర్చించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు...వాటిని ఖర్చు చేసిన వివరాలను అందజేశారు. ప్రత్యేక హోదా విషయం రాజకీయ అంశంగా మారకముందే చర్య తీసుకోవాలని సూచించారు.

Tuesday, May 17, 2016 - 11:43

జమ్మూ కాశ్మీర్‌ : షోపియాన్ జిల్లా పహిల్‌ సోరాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, మిగిలిన ఉగ్రవాదులు తప్పించుకున్నారు.. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

Tuesday, May 17, 2016 - 11:42

బీహార్‌ : జేడీయు ఎమ్మెల్సీ మనోరమాదేవికి గయా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఇంట్లో అక్రమంగా మద్యం నిలువ చేసినందుకు ఆమెపై కేసు నమోదైంది. గత వారం రోజులుగా ఆమె తన పలుకుబడి ఉపయోగిస్తూ తప్పించుకుంటూ వచ్చారు. అయితే తాను ఏ నేరమూ చేయలేదని మనోరమ అంటున్నారు. ఈమె...

Tuesday, May 17, 2016 - 07:06

హైదరాబాద్ : గుజరాత్‌ ముఖ్యమంత్రిని మార్చేందుకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా సిఎం ఆనందీబెన్‌ పటేల్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బిజెపి అధినేతలు ఆమెకు ఉద్వాసన పలకేందుకే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదితో సిఎం సమావేశం కావడం ఇందుకు బలం చేకూరుస్తోంది.

గుజరాత్‌లో బిజెపికి ఓటమి భయం...

...

Monday, May 16, 2016 - 22:00

ఢిల్లీ : బ్యాంకుల రుణాల చెల్లిపుల విషయంలో అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఎస్‌బిఐతో తాను కొత్త సెటిల్‌మెంట్‌కు సిద్ధమని వ్యాపారవేత్త విజయ్‌మాల్యా చెప్పారు. ముంబైలో శుక్రవారం జరిగిన యునైటెడ్ బ్రెవరేజెస్ లిమిటెడ్ డైరెక్టర్స్ బోర్డు సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మాల్యా-తన భద్రత, స్వేచ్ఛకు సరైన హామీ లభిస్తే త్వరలోనే...

Monday, May 16, 2016 - 18:41

హైదరాబాద్ : కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులోని 24 జిల్లాలతో పాటు.. బై పోల్ జరుగుతున్న ఖమ్మం జిల్లా పాలేరులోనూ పోలింగ్ ముగిసింది. 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు భారీవర్షాలతో తమిళనాడులోని 8 జిల్లాల్లో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ 8 జిల్లాల్లో రాత్రి 7గంటల వరకు సమయం...

Monday, May 16, 2016 - 17:31

గుజరాత్‌ : 2017లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీబెన్‌ పటేల్‌నే తక్షణమే మార్చాలని నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమాన్ని హ్యాండిల్‌ చేయడంలో ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ వైఫల్యం చెందారన్న సమాచారం నేపథ్యంలో ఈ మార్పు తథ్యమని తెలుస్తోంది. ఆనందీబెన్‌ స్థానంలో కొత్త...

Monday, May 16, 2016 - 17:23

బిహార్‌ : ఆదిత్య సచ్‌దేవ్‌ను కాల్చి చంపిన ఘటనలో రాఖీ యాదవ్‌ కజిన్‌ టేనీ యాదవ్‌ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు టేనీకి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆదిత్యను కాల్చి చంపిన సమయంలో టేనీ కూడా రాఖీతో పాటు ఉన్నాడు. తన కారును ఓవర్‌ టేక్‌ చేసినందుకు నడిరోడ్డుపై ఆదిత్యను రాఖీ యాదవ్‌ కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎమ్మెల్సీ మనోరమదేవి కుమారుడు...

Monday, May 16, 2016 - 17:14

ఢిల్లీ : నీట్ వల్ల తెలుగు రాష్ర్ట విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని దాని నుంచి కనీసం రెండు సంవత్సరాలు మినహాయింపు కావాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నీట్ వల్ల ఎదురయ్యే సమస్యలను ఏకరువు పెట్టామని కామినేని తెలిపారు.

Monday, May 16, 2016 - 17:10

ఢిల్లీ : నీట్‌పై రాష్ట్రాలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నీట్‌ పరీక్షపై విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో జేపీ నడ్డా ఢిల్లీలో సమావేశాన్ని నిర్వంచారు. ఈ సమావేశంలో నీట్‌ పరీక్ష నిర్వహించాలని అన్ని రాష్ట్రాల మంత్రులు సూత్రాప్రాయంగా...

Monday, May 16, 2016 - 16:14

హైదరాబాద్ : తెలంగాణలో రానున్న ఖరీఫ్‌కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుందని అన్నారు. రైతులకు ఏ సమస్యా ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి పోచారం తెలిపారు.

Monday, May 16, 2016 - 15:24

కేరళ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కొట్టాయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో సిఎం మాట్లాడుతూ...తన విజయం తథ్యమన్న ధీమాను వ్యక్తం చేశారు. కేరళలో బిజెపికి స్థానం లేదని ఊమెన్‌ చాందీ స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ140 స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 21 వేల 498 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 52 వేలమంది పోలీసులతో...

Monday, May 16, 2016 - 13:16

గుజరాత్‌ : జామ్ నగర్ మహిళా ఎంపీ మురుగు కాల్వలో పడిపోయారు. పది అడుగుల లోతులో పడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. జామ్ నగర్ కు ఎంపీ పూనమ్ మాదమ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోమవారం స్థానికంగా ఉన్న జాలారమ్ నగర్ లో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వెళ్లారు. అక్కడనే ఉన్న ఓ నాలాపై నిలబడి సమస్యలు వింటున్నారు. ఆమెతో పాటు అధికారులు..ఇతరులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా శ్లాబ్...

Monday, May 16, 2016 - 13:14

యానాం : పుదుచ్చేరిలో భాగమైన యానాంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందే దాదాపు అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. యానాంలో మొత్తం 35 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 36 వేల 557 ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 17వేల 544 స్త్రీలు 17వేల 013 మంది...

Monday, May 16, 2016 - 11:50

హైదరాబాద్ : తమిళనాడు, కేరళ, పుద్దేచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం తొమ్మిదిగంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు తమిళనాడులోని ఐదు జిల్లాలో భారీ వర్షం పడుతుంది. దీంతో ఆయా జిల్లాలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఇప్పటిదాకా ఓటు వినియోగించుకున్న ప్రముఖుల్లో రజినీకాంత్,అజిత్,కమల్...

Monday, May 16, 2016 - 11:48

ఢిల్లీ : నీట్ పరీక్ష నిర్వహణపై రాష్ట్రాలతో కేంద్రం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి జేపి నడ్డా అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీ నుంచి మంత్రి కామినేని తెలంగాణ నుంచి హెల్త్ సెక్రటరీ రాజీవ్ తివారి పాల్గొన్నారు.

 

Monday, May 16, 2016 - 10:28

వందలు కాదు..వేలు కాదు..లక్షలు కాదు..ఏకంగా కోట్లు వద్దని అనుకున్నాడా ? ఏంటీ ఆ పిల్లగాడికి ఏమన్నా పిచ్చా ? లేక అంతకన్నా డబ్బులు ఎక్కువున్నాయా ? అని ఆశ్చర్యపోతున్నారా ? ఈ డబ్బు వెనుక చిన్న కథ ఉంది. ఏంటా కథ ? అంత పెద్ద డబ్బును ఎందుకు వద్దని అనుకున్నాడు ? అనేది తెలుసుకోవాలంటే ఇది చదవండి..
న్యూయార్కులోని అలాబామాకు చెందిన 14 ఏండ్ల విద్యార్థి రోసెంతల్ కు బేస్ బాల్ అంటే ఇష్టం...

Monday, May 16, 2016 - 10:13

కాశ్మీర్ : ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్‌లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్...

Monday, May 16, 2016 - 08:26

కొచ్చి : కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ స్టేషన్ల వద్ద ప్రజలు బారులు తీరారు. ఈ ఎన్నికల కోసం 52వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేరళలో 140 స్థానాలకు 1,203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 109 మంది మహిళ అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాల్లో 344...

Monday, May 16, 2016 - 08:23

చెన్నై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు ఓటు వేయడానికి బారులు తీరారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ హీరోలు రజినీకాంత్,అజిత్,కమల్‌హాసన్... డీఎంకే అధినేత కరుణానిధి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 3776 మంది అభ్యర్థులు...

Monday, May 16, 2016 - 06:58

విశాఖ : నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురైంది. 10 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ప్రైవేట్‌ వాతావరణ సంస్థలు ఇచ్చిన ప్రకటనల్లో వాస్తవం లేదని భారతీయ వాతావరణ విభాగం స్పష్టం చేసింది.                                                                                                             
...

Monday, May 16, 2016 - 06:35

ఢిల్లీ : నీట్‌పై కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాష్‌ నడ్డా అధ్యక్షతన జరిగే ఈ భేటీలో నీట్‌లో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తారు. కొన్ని రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రాల ...

Sunday, May 15, 2016 - 21:32

ఢిల్లీ : నైరుతి రుతుపవనాలు ఆరు రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1 నాటికి కేరళకు చేరుకోవాల్సిన రుతుపవనాలు ఏడో తేదీన తాకే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు ఆలస్యమవనున్నాయి. గత 11ఏళ్లుగా నైరుతి ఆగమనాన్ని వాతావరణ శాఖ సరిగ్గా అంచనా వేస్తోంది. ఈ కొద్ది రోజులు ఆలస్యమవడం పెద్ద విషయమేమీ కాదని వాతావరణ శాఖ...

Pages

Don't Miss