National News

Monday, October 5, 2015 - 13:32

హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఇవాళ దద్ధరిల్లింది. బీఫ్ బ్యాన్ తో పాటు వరద సాయంలో అవకతవకలు వంటి అంశాలపై వెంటనే సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీ సభ్యులు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. వరద సాయం కొందరికే అందటం, వైష్ణోదేవి భక్తులపై పన్నులు వేయటాన్ని వారు తప్పుపట్టారు. కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవడంతో.. సభలో కాసేపు గందరగోళం నెలకొంది. స్పీకర్...

Monday, October 5, 2015 - 12:43

హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. గుడిలోకి వెళ్లినందుకు 90 ఏళ్ల దళిత వృద్ధుడిపై ఓ వ్యక్తి దాడిచేసి, సజీవ దహనం చేశాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన జలౌన్ జిల్లా బిల్గాం ప్రాంతంలోని బాబా గుడిలో జరిగింది. చిమ్మ.. తన భార్య, కొడుకుతో కలిసి స్థానికంగా వుండే  మైదాని బాబాగుడికి వెళ్లాడు. గుళ్లోకి వెళ్లడానికి వీల్లేదంటూ సంజయ్ తివారీ.. వీళ్లని అడ్డుకున్నాడు...

Monday, October 5, 2015 - 09:14

హైదరాబాద్ : చేనేత పరిశ్రమను ఆదుకోవాలనే లక్ష్యంతో బెంగళూరులో జరిగిన డాగ్‌ షో అందరిని అలరించింది. ఖాదీతో తయారు చేసిన అవుట్ ఫిట్స్‌ను ధరించిన పెట్‌ డాగ్స్‌ షోలో సందడి చేసాయి. ఇంచుమించు ర్యాంప్‌ పై క్యాట్‌ వాక్‌ చేసే మోడళ్లను తలదన్నాయి. డాగ్‌ షోను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శునక రాజుల విన్యాసాలు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు....

Monday, October 5, 2015 - 07:57

హైదరాబాద్ :చైనా ఓపెన్ కోసం ప్రస్తుతం బీజింగ్ లో ఉన్న సానియా, డబుల్స్ లో తన సహచరి మార్టినా హింగిస్ తో కలిసి నిన్న సరదాగా గడిపింది. హింగిస్ ను రిక్షాలో ఎక్కించుకుని తాను రిక్షా తొక్కుతున్నట్లు ఓ ఫొటో తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. హింగిస్ కు ‘డే ఆప్’ అయితే తనకు మాత్రం ‘వర్కింగ్ డే’ అంటూ సదరు పోస్ట్ కు ఆమె సరదా కామెంట్ జోడించింది.  

Monday, October 5, 2015 - 07:21

హైదరాబాద్ : ప్రముఖ న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రాంజెఠ్మలానీ నిన్న ప్రధాని నరేంద్ర మోదీపై అంతెత్తున ఎగిరిపడ్డారు. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకువస్తానని ప్రకటించిన మోదీని తాను దైవదూతగానే భావించానని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనను మోదీ మోసం చేశారని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. అయితే మీరు మాత్రం...

Monday, October 5, 2015 - 06:58

హైదరాబాద్ : కర్నాటక-ఆంధ్రా రాష్ర్టాల మధ్య జలవివాదం ముదురుతోంది. సువర్ణముఖి నదీ జలాల కోసం ఇరు రాష్ట్రాల రైతుల పోరుబాట పట్టారు. నదిపై నిర్మించిన అడ్డుకట్టను తొలగించాలని కర్నాటక రైతు సంఘం నాయకులు, రైతులు డిమాండ్‌ చేస్తుండడంతో.. అనంతపురం జిల్లా అగళి మండలంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.

సువర్ణముఖి...

Sunday, October 4, 2015 - 21:32

ఉత్తర్ ప్రదేశ్ : దాద్రి బాధిత కుటుంబానికి మొదట ప్రకటించిన రూ.10లక్షల ఎక్స్ గ్రేషియాను ఏకంగా రూ.45లక్షలకు పెంచారు. లక్నోలో ఆక్లాక్ కుటుంబసభ్యులు సీఎం అఖిలేష్ యాదవ్ ను కలిశారు. అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలేష్ భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత యూపీలో మతసామర్యం దెబ్బతిన్నదని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇదిలా...

Sunday, October 4, 2015 - 20:52

ఖాకీ డ్రెస్ లు వేసుకున్న కొంతమంది అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడం..లంచాల తీసుకుంటుండడం..వేధింపులకు గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ ఖాకీ మాత్రం స్పెషల్. ఎందుకంటే ఆయన చేసేది ఉద్యోగం పోలీసే. కానీ టీచర్ అయిపోయాడు ఎలా అంటారా ? అయితే ఇది చదవండి.
ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్..ఇక్కడ కొంతమంది పేద పిల్లలు పాపడ్స్ అమ్ముతుంటారు. ఈ దృశ్యం ధర్మపాల్ సింగ్ అనే కానిస్టేబుల్...

Sunday, October 4, 2015 - 17:58

ముంబై : భారత క్రికెట్ బోర్డు ను సమూలంగా ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని బీసీసీఐ సరికొత్త బాస్ శశాంక్ మనోహర్ ప్రకటించారు. జగ్ మోహన్ దాల్మియా చేపట్టిన మంచిపనులను తానూ కొనసాగిస్తానని బోర్డు అధ్యక్ష పదవిని రెండో సారి చేపట్టిన తర్వాత ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. క్రికెట్ అభిమానుల్లో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పాదుకొలపడమే తనముందున్న కర్తవ్యమని చెప్పారు....

Sunday, October 4, 2015 - 14:31

ముంబాయి : భారత క్రికెట్ బోర్డు సరికొత్త అధ్యక్షుడుగా..మాజీ చైర్మన్, నాగపూర్ లాయర్ శశాంక్ మనోహర్ ఎంపికయ్యారు. బీసీసీఐకి రెండు విడతలుగా అసాధారణ సేవలు అందించిన జగ్ మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో...ఆయన వారసుడి ఎంపిక కార్యక్రమాన్ని ముంబైలో ముగిసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ముగించారు. 75 ఏళ్ల జగ్ మోహన్ ద్మాల్మియా హఠాన్మరణంతో ఆయన వారసుడిగా ..బోర్డు అధ్యక్షపదవి...

Sunday, October 4, 2015 - 09:33

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. హేమంత్‌కుమార్‌కుమార్‌ అనే టీవీ జర్నలిస్టును గుర్తుతెలియని దుండగులు పొట్టనపెట్టుకున్నారు. చండూలి గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్‌ కూరగాయాల మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా...గుర్తుతెలియని దుండగులు హేమంత్‌కుమార్‌పై కాల్పులు జరిపి పరారయ్యారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు హుటాహుటిన హేమంత్‌కుమార్‌ను ఆసుపత్రికి...

Sunday, October 4, 2015 - 09:31

గుజరాత్ : పటేల్‌ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న హార్దిక్‌ పటేల్‌పై కరెన్సీ వర్షం కురిసింది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌లో జరిగిన పటీదార్‌ సన్మాన కార్యక్రమానికి పటేల్‌ హాజరయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న హార్దిక్‌పై ఇతర నేతలు, కార్యకర్తలు కరెన్సీ నోట్లు వెదజల్లారు. దీంతో.. వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. అయితే.. హార్దిక్‌ వారిని ఏమాత్రం...

Sunday, October 4, 2015 - 08:09

చండీఘర్ : హర్యానాలోని గుర్‌గావ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఫర్నీచర్‌ షాపులో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల భారీగా మంటలంటుకున్నాయి. దీంతో షాపులో ఉన్న ఫర్నీచర్‌ అంతా పూర్తిగా దగ్దం అయింది. ఫర్నీచర్‌తో పాటు...వాహనాలు కూడా దగ్ధం అయ్యాయి. 

Sunday, October 4, 2015 - 07:44

ఉత్తరప్రదేశ్ : గోమాంసం తిన్నారన్న అపోహతో ఇఖ్‌లాక్‌ను కొట్టి చంపిన కేసులో పోలీసులు ప్రధాన నిందితులు ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయనేతలు క్యూ కడుతున్నారు. గ్రామస్థులు నేతలను, మీడియాను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ఇఖ్‌లాక్‌ కుటుంబం గ్రామం వదిలి లక్నోకు పయనమైంది.
గ్రామస్థుల మూకుమ్మడి దాడి...

Sunday, October 4, 2015 - 07:36

ముంబై : షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని ఆమెకు వైద్యం అందిస్తున్న జేజే దవాఖాన వైద్యులు శనివారం తెలిపారు. బైకుల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె ఆరోగ్యం క్షీణించటంతో శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచీ ఆమె గాఢ నిద్రలోనే ఉన్నదని జేజే దవాఖాన డీన్ టీపీ లహానే...

Saturday, October 3, 2015 - 21:33

హైదరాబాద్ : చెన్నై జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ప్రారంభ వేడుకలకు తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు.ఈ వేడుకలకు 8 జట్ల ప్రాంచైజీ ఓనర్లతో పాటు కేరళా బ్లాస్టర్స్‌ కో-ఓనర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, బాలీవుడ్‌ షెహన్‌ షా అమితాబ్‌ బచ్చన్‌,ముఖేష్‌ అంబానీ,నీతా అంబానీ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఆఖర్లో ఏ ఆర్...

Saturday, October 3, 2015 - 21:30

హైదరాబాద్ : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాగల్పూర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ మోది సర్కార్‌పై ధ్వజమెత్తారు. మోది ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల దేశంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయని ఆమె విమర్శించారు. మోది ఇచ్చే వాగ్దానాలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్యాకేజీ- రీప్యాకేజీలో ప్రధాని సిద్ధహస్తుడని సోనియా తీవ్రస్థాయిలో...

Saturday, October 3, 2015 - 16:52

హైదరాబాద్ : బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యావ్ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్నే డబ్ స్మాష్ చేశారు. ప్రధానితో పాటు అమిత్ షానూ తన హావ భావాల్ని, పెదవుల కదలికల్ని జోడించేశారు. ఎలా అనుకరించారో మీరూ చూడాలనుకుంటే ఈవీడియోను క్లిక్ చేయండి...

Saturday, October 3, 2015 - 12:05

ఉత్తరప్రదేశ్ : ఫరూఖాబాద్‌ లో కలకలం చెలరేగింది.. రైల్వే స్టేషన్లో బాంబులాంటి అనుమానాస్పదన వస్తువు దర్శనమిచ్చింది.. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.. ఆ వస్తువును పరిశీలించిన పోలీసులు అందులో ఎలక్ట్రిక్ సర్క్యూట్‌, టైమర్లున్నాయని గుర్తించారు. బాంబ్‌ స్క్వాడ్‌ బృందంతో కలిసి ఆ వస్తువును తనిఖీ చేస్తున్నారు.

Saturday, October 3, 2015 - 11:58

కోల్ కతా : పశ్చిమబెంగాల్ లో స్థానిక సంస్థల ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. బదాన్ నగర్ లోని ఓ ఓటింగ్ కేంద్రంలో.. కొందరు ఈవీఎంలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. లాఠీఛార్జ్ చేశారు. మరో ఘటనలో తృణముల్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకోవడంతో.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న...

Saturday, October 3, 2015 - 07:58

ధర్మశాల : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ- 20 మ్యాచ్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్ , సౌతాఫ్రికా మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పరాజయం పాలైంది. టీమిండియా విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో సఫారీలు 1-0 లీడ్‌కు చేరుకున్నారు.
ఉత్కంఠగా తొలి టీ-20...

Saturday, October 3, 2015 - 07:43

ముంబై : షీనా బోరా కేసులో ఊహించని ట్విస్ట్‌ ఎదురయ్యింది. షీనా బోరా తల్లి.. కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా బైకుల్లా జైలులో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు కేసు సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
...

Friday, October 2, 2015 - 21:41

హైదరాబాద్ : నేపాల్‌ ప్రధానమంత్రి సుశీల్‌ కోయిరాలా రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌బరన్‌ యాదవ్‌కు అందజేశారు. కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలి తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నేపాలి కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కోయిరాలాను ఫిబ్రవరి 10, 2014న ప్రధానిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 20న నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని పార్లమెంట్‌...

Friday, October 2, 2015 - 21:37

హైదరాబాద్ : ఆర్జేడి, జెడియు మహాకూటమిని చూసి ఓర్వలేక ప్రధాని జంగల్‌రాజ్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ దుయ్యబట్టారు. మది జంగల్‌ రాజ్‌ కాదు... కానూన్‌ రాజ్‌అన్నారు. నేషనల్‌ క్రైం బ్యూరో రికార్డ్స్‌ ప్రకారం నేరాలకు సంబంధించి దేశంలో బీహార్‌ 22 వ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజధాని ఢిల్లీలోనే నేరాల...

Friday, October 2, 2015 - 21:35

హైదరాబాద్ : బీహార్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోది బాంకా సభలో అభివృద్ధి పాటను ఆలపించారు. బీహార్‌ అభివృద్ధి లేకుండా భారత్‌ అభివృద్ధి చెందలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. యువతకు ఉపాధి, వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీహార్‌లో అహంకార్‌ పాలన, కుటుంబ పాలనలను చూశారని నితీష్‌, లాలూల నుద్దేశించి మోది పరోక్షంగా...

Friday, October 2, 2015 - 21:33

హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌ శ్రీనగర్‌లో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. జామా మసీదులో ప్రార్థనల అనంతరం కొందరు యువకులు ఐఎస్‌ఐఎస్‌, జిహాదీ జెండాలను పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.

Friday, October 2, 2015 - 16:48

హైదరాబాద్ : మాంసం నిషేధం పేరిట మతతత్వశక్తులు మారణహోమం సృష్టిస్తున్నాయి. గోమాంసం తిన్నారన్న కారణంతో దాద్రీలో ఓ మనిషిని సాటి మనుషులే కొట్టి చంపారు. మతమౌఢ్యం పరాకాష్ఠకు చేరిన ఈ ఘటన దేశ రాజధానికి అత్యంత సమీపంలో జరిగింది. ఈ దారుణానికి ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలే కారణమని సిపిఎం ధ్వజమెత్తింది.

రెచ్చిపోతున్న మతతత్వ శక్తులు...

Pages

Don't Miss